
కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నాయి
కోనరావుపేట/ఇల్లంతకుంట: రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంటల సాగు సమయంలో సరిగ్గా నీరు అందక సగానికి పైగా పంటలు ఎండిపోగా.. ధాన్యం కోసిన తర్వాత సకాలంలో తూకం వేయక అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వట్టిమల్ల లో వడ్లు మొలకెత్తాయి. ఇల్లంతకుంట మండలం దాచారం, సిరికొండ, పెద్దలింగాపురం, తాళ్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దాచారం, పెద్దలింగాపూర్ గ్రామాల్లో వెయ్యి బస్తాల వరకు తడిసిపోయిందని ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ తెలిపారు.