
కేటీఆర్ బిజీ..బిజీ
సారూ.. నిన్ను చూడక ఎన్నో రోజులవుతాంది
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని శాంతినగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్‌ను చూడగానే అదే గ్రామానికి చెందిన అలువాల అంజవ్వ భావోద్వేగానికి లోనైంది. కేటీఆర్ సారు నిన్ను చూడక ఎన్నో రోజులవుతుందని సంబరపడిపోయింది. కేటీఆర్ వచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకోగా.. కారు దిగకుండానే మళ్లీ కలుస్తాను ఏమీ అనుకోవద్దంటూ వెళ్లిపోయారు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆదివారం జిల్లాలో బిజీబిజీగా పర్యటించారు. సిరిసిల్ల అర్బన్‌బ్యాంకు వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి–మాధవి దంపతుల కొడుకు వివాహం ఇటీవల జరగ్గా.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. భవాని ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు పెళ్లికి హాజరయ్యారు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ అలువాల ఈశ్వర్ కూతురు రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు.
తమ్మీ భయడకు నేనున్నా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘తమ్మీ మహేశ్.. భయపడకు నీకు అండగా నేనున్నా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే నిన్ను ఇంటికి తీసుకొస్తాను’ అంటూ గల్ఫ్ బాధితుడు మంద మహేశ్‌కు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మండెపల్లిలోని మహేశ్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సౌదీ అరేబియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడి భరోసా కల్పించారు. రాళ్లపేట మాజీ సర్పంచ్ తీగల దుర్గయ్య కొడుకు వివాహం ఇటీవల జరుగగా వారిని ఆశీర్వదించా రు. చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ నాయకుడు జంగపల్లి భిక్షపతిని ఫోన్‌లో పరామర్శించారు.
ఎల్లమ్మ దర్శనం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో రేణుక ఎల్లమ్మ–జమదగ్ని కల్యాణోత్సవానికి హాజరయ్యారు. పందిర్ల శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్‌గౌడ్, కిషన్‌గౌడ్‌లు కేటీఆర్‌ను శాలువా లతో సత్కరించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొండ రమేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.