
సైకాలజిస్ట్ అసోసియేషన్ ఫార్మేషన్ డే
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయసంస్థ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఫార్మేషన్ డే నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పున్నం చందర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వై.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి చొప్పదండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
అశోకచక్ర అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: సాహసోపేతంగా ప్రజలను కాపాడిన పోలీసులకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేంద్ర హోంశాఖ అందించే అశోకచక్ర అవార్డు కో సం అర్హులైన పోలీసులు దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ప్రకటనలో కోరారు. ప్రజల ప్రాణరక్షణలో తన ప్రాణాలు ఫణంగా పెట్టి అమరులైన వారికి అశోకచక్ర, ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి కీర్తిచక్ర, శౌర్యం ప్రదర్శించిన సిబ్బందికి శౌర్యచక్ర అవార్డులు ప్రదానం చేస్తారని వివరించా రు. అర్హత గల వారు జిల్లా ఎస్పీకి తమ దరఖా స్తులను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. జూలై 2024 నుంచి జనవరి 2025 మధ్యలో జరిగిన సంఘటన అయి ఉండాలని, ఫొటోగ్రాఫర్ వివరాలు సమర్పించాలని కోరారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆక్షేపణీయం
సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య పాఠశాలలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, తెలంగాణ ప్రజలను ఢిల్లీలో దొంగలుగా చూస్తున్నారని, ఉద్యోగులు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని టీపీటీఎఫ్ ఖండిస్తుందన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా సీఎం అసత్యాలు మాట్లాడడం శోచనీయమన్నారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు దబ్బెడ హనుమాండ్లు, మందాడి శ్రీనివాస్‌రెడ్డి, నూగురి దేవేందర్ , జిల్లా కార్యదర్శులు మైలారం తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బొజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు
జమ్మికుంట(హుజూరాబాద్): రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. 2023లో పట్టణంలోని పొనగంటి కావ్య నుంచి మ్యనకొండ సాయికిరణ్ తక్కువ ధరకు ప్లాట్ కొనిస్తానని రూ.93లక్షలు తీసుకున్నాడు. ప్లాట్ చూపించకుండా మోసం చేస్తున్నాడు. డబ్బు అడిగితే అంతుచూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

సైకాలజిస్ట్ అసోసియేషన్ ఫార్మేషన్ డే