
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం
జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్‌తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్‌కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు.