జిల్లాలో ఉపాధి పనుల వివరాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు

May 9 2025 1:11 AM | Updated on May 9 2025 1:11 AM

జిల్ల

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు

వివరాలు పనుల సంఖ్య ఖర్చు చేసిన మొత్తం చెరువుల పూడికతీత 158 రూ.2.13కోట్లు ఫాంపాండ్స్‌ 308 రూ.3.17కోట్లు కండిత కందకాలు 330 రూ.8.03కోట్లు ఫీడర్‌ చానల్‌ 192 రూ.3.20లక్షలు వర్షపు నీటి సంరక్షణ 06 రూ.18వేలు బోర్‌వేల్‌ రీచార్జ్‌ 33 రూ.2.08లక్షలు

జిల్లాలో 11.14కోట్లతో పనులు

కూలీలకు ఊతమిస్తున్న ఉపాధి

భూగర్భజలాలు, నీటి వనరుల పెంపు

అటవీప్రాంతంలో పశువులకు సమృద్ధిగా తాగునీరు

రైతులకు ప్రయోజనాలు

నీటి నిల్వలపై దృష్టి

ప్రభుత్వం వృథా నీటిని పొదుపు చేసే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నీటి నిల్వలపై దృష్టి సారించి పనులు చేపట్టాం. ముఖ్యంగా వర్షపు నీరు వృథా కాకుండా అడవిలో కండిత కందకాలు, పారంఫాడ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 968 పనులు చేపట్టి రూ.11.14కోట్లు ఖర్చు చేశాం.

– కొమురయ్య, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట

రైతులకు ప్రయోజనాలు

అడవిలో వృథా నీటిని ఒడిసి పట్టుకోవడానికి కందిత కందకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కందిత కందకాలు, పారంఫాండ్స్‌, చెక్‌ డ్యాంల ఏర్పాటును ఉపాధి హామీ పథకంలో చేపడుతున్నాం. దీంతో అటవీ ప్రాంతల్లో నీటి నిల్వలు పెంచడంతో పాటు కూలీలకు చేతి నిండా పని దోరుకుతుంది. నీటి నిల్వల పెంపుకు అందరూ సహకరించాలి.

– శేషాద్రి, డీఆర్డీవో, సిరిసిల్ల

ఈ మహిళా రైతు పేరు పుష్పల. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం. అడవి లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కండిత కందకం నీటినిల్వలతో పశువులకు తాగునీరు అందిస్తోంది. గతంలో అటవీప్రాంతంలో కనుచూపు మేరలో నీటి సౌకర్యం లేక పశువులు తడ్లాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయానికి సమీపబావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటోందని రైతులు చెబుతున్నారు.

పనికి వచ్చిన కూలీలు 75,756

జాబ్‌ కార్డులు 98,130

పనికి వచ్చిన జాబ్‌ కార్డు కుటుంబాలు 51,088

కల్పించిన పని దినాలు 21,88,092

జిల్లాలో చేపట్టిన పనులు..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడవిలో వృథా నీటిని ఒడిసిపట్టుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఓ వైపు కూలీలకు పని కల్పిస్తూనే, భూగర్భజలాల పెంపుపై దృష్టి సారించింది. గతంలో రైతుల భూముల అభివృద్ధి, ఇతర పనులకే పరిమితమైన ఉపాధిహామీ పథకాన్ని విస్తరించి ప్రధానంగా నీటివృద్ధి పనులు చేపడుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.11.14 కోట్లతో పనులను చేపట్టారు. ప్రధానంగా చెరువుల్లో పూడికతీత, పాంపౌండ్స్‌, కండిత కందకాలు, ఫీడర్‌ చానల్‌, భవనాలపై పడ్డ వర్షపునీటి సంరక్షణ, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనుల ద్వారా నీటి నిల్వలను పెంపొందిస్తున్నారు. ఫలితంగా అడవిలోని జంతు, పక్షి జాతులకు తాగునీరు పుష్కలంగా లభిస్తోంది. రైతులకు సాగునీని ప్రయోజనం చేకూరుతోంది. ఉపాధి కూలీలకు చేతినిండ పని దొరుకుతోంది.

వృథా నీటిని అరికడుతూ

వర్షాకాలంలో వృథా వరద నీటిని అరికడుతూ.. నీటి వనరులను ఉపాధిహామీ పనుల ద్వారా వృద్ధి చేస్తున్నారు. పాత చెరువుల్లో పూడికతీత పనులను చేపడుతూ నీటి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. పాంపాండ్స్‌ నిర్మాణాలు వృథా నీటిని పొదుపు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. గుట్టప్రాంతాల్లో జాలువారే నీటిని కందిత కందకాలతో నిల్వ చేస్తున్నారు. అటవీ ప్రాంతం, వాగులపై ఫీడర్‌ చానల్‌ నిర్మాణాలను చేస్తూ, పొలాలకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.11.14కోట్లు ఖర్చు చేసి నీటిని పొదుపు చేయడం విశేషం. రానున్నకాలంలో ఈ పనులను మరింత విస్తరించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

కూలీలకు ఉపాధి..

జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల ద్వారా ఎంతో మంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జాబ్‌కార్డులున్న ప్రతీ ఒక్కరికి వందరోజులు పని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా నూతనంగా శ్రీకారం చుట్టిన నీటి పొదుపు పనులు కూలీలకు వరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా జాబ్‌కార్డులున్న 98,130 మంది కూలీలు 21,88,092 పని దినాలను వినియోగించుకుని ఉపాధి పొందుతున్నారు.

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు
1
1/2

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు
2
2/2

జిల్లాలో ఉపాధి పనుల వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement