
దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి
ముస్తాబాద్(సిరిసిల్ల): దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్‌కు చెందిన సైనికులు ధర్మపురి, శరత్‌లు ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా వారిని ఆదివారం సన్మానించారు. గోపి మాట్లాడుతూ సైనికులు ప్రాణాలకు తెగించి దేశ ప్రజలందరిని సురక్షితంగా కాపాడుతున్నారని కొనియాడారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న సైనికుల రుణం తీర్చుకోలేమన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, సంతోష్‌రెడ్డి, మహేశ్వరి, మహేశ్, కార్తీక్‌రెడ్డి, రమేశ్, సుధాకర్, రాజేందర్, రాజు, వంశీ, శ్రీకర్, గాలిరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధ్యాయులు కాలానుగుణంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్‌రావు కోరారు. మండలకేంద్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్త్యంతర శిక్షణ తరగతులను ఆదివారం పరిశీలించారు. బడిబాటను విజయవంతం చేయాలని కోరారు. ఎంఈవో శ్రవణ్‌కుమార్, హెడ్‌మాస్టర్ బొలగం శ్రీనివాస్, కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ ఎస్.మొండయ్య, రిసోర్సుపర్సన్లు కనకయ్య, జగన్‌మోహన్, కుమారస్వామి, బి.శ్రీనివాస్, చంద్రశేఖర్, సురేంద్రస్వామి, టెక్నికల్ పర్సన్ శ్రీపతి చంద్రమౌళి ఉన్నారు.
మహాసభలు విజయవంతం చేయండి
సిరిసిల్లటౌన్: సీపీఐ జిల్లా నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. జూన్ 12, 13 తేదీల్లో సిరిసిల్లలో జరిగే జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ విప్లవ పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు జిల్లా కేంద్రంగా ఉండేదన్నారు. సోమ నాగరాజు, గాజుల లింగం, రాయమల్లు, నల్ల మార్కండేయులు, మోర తిరుపతి, సుంకనపెళ్లి శాంతక్క, కోడం ప్రమీల పాల్గొన్నారు.
కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలను నిషేధించాలి
● హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్
ముస్తాబాద్(సిరిసిల్ల): కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని, స్వర్ణకారుల చేతివృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్‌లో రైతుఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన స్వర్ణకారుల సమావేశంలో మాట్లాడారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులు రాజస్థాన్ నుంచి వస్తున్న కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలతో రోడ్డున పడుతున్నారన్నారు. పుస్తె, మెట్టెలను విక్రయించే హక్కులను స్వర్ణకారులకు ఇవ్వాలని కోరారు. సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, డీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, అడ్వకేట్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర

దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర

దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర