మిల్లర్లు కోతలు విధించొద్దు
● ధాన్యం తరలింపులో జాప్యం చేస్తే లారీ కాంట్రాక్టర్‌కు జరిమానా ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల/చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యంలో రైస్‌మిల్లర్లు కోతలు విధించొద్దని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది, ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారన్నది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు తడవకుండా ఉండేందుకు తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. బస్తాల సరఫరాలో జాప్యం చేయడం ద్వారా వర్షాలకు ధాన్యం తడిస్తే లారీల కాంట్రాక్టర్ల నుంచి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ ఏపీఎంలు రజిత, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాలీసెట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. పాలీసెట్ నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించే టీజీ పాలీసెట్‌కు జిల్లాలో 2,136 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఏడు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఫస్ట్ ఎయిడ్‌కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో మెడికల్ క్యాంపు ఏర్పా టు చేయాలని సెస్, వైద్య అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, పాలీటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ పి.వాణి, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.


