నాలుగు రోజుల్లో బోడగుట్ట సర్వే చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్
చందుర్తి(వేములవాడ): మండల కేంద్రం శివారులోని 442 సర్వే నంబర్‌లోని బోడగుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. బోడగుట్ట ప్రాంతంలో 54 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సగానికి పైగా కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్‌మెంట్ కమిటీ తీర్మాణంతోపాటు అక్రమ పట్టాలపై వెంటనే రికార్డులు పరిశీలించి, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని సూచించినట్లు తెలిసింది. జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ భూపతి, డీఐ వెంకటరత్నం, మండల సర్వేయర్ చామంతి, ఆర్‌ఐలు శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు.
రాజన్న సేవలో ఐఆర్‌ఎస్ అధికారి
వేములవాడ: రాజన్నను ఐఆర్‌ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి వంశీకృష్ణారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. రాధాకృష్ణరెడ్డి, రేగూరి లక్ష్మణ్, మహేశ్ ఉన్నారు.
నాలుగు రోజుల్లో బోడగుట్ట సర్వే చేయాలి


