జీవో 252 సవరించేలా చొరవ చూపాలి
● మాజీ మంత్రి కేటీఆర్‌కు జర్నలిస్టుల వినతి
సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్ 252లో సవరణలు చేసేలా చొరవ చూపాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే హెచ్–143) విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు లాయక్‌పాషా ఆధ్వర్యంలో సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ తెలంగాణ జర్నలిస్టుల పక్షాన నిలబడతామని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షుడు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు సామల గట్టు, మహమ్మద్ అజీం, ట్రెజరర్ అందె దేవేందర్, ప్రవీణ్, కలీం, సల్మాన్, పహద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


