మా నాన్నను కాపాడండి
సిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ లెక్చరర్‌గా జీవనం సాగిస్తున్న బత్తుల మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరుకు చెందిన మహేశ్ సిరిసిల్లలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సివిక్స్ లెక్చరర్‌గా పని చేసేవారు. గతంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వాహకుడిగా వ్యవహరించారు. వారం క్రితం ఉన్నట్టుండి ఇంట్లోనే పడిపోయాడు. వెంటనే సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి బంధువులు తీసుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి... వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే దిశగా బ్రెయిన్ సర్జరీ చేశారు. మందులు, వైద్యఖర్చులు, ఇతర పరీక్షల నిమిత్తం ఇప్పటికే రూ.4లక్షలు ఖర్చయ్యాయి. ఇదంతా మహేశ్ అన్న వేణు అప్పులు చేసి సమకూర్చాడు. మహేశ్‌ను ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెదడు నుంచి ఓ వాల్వ్ అమర్చాల్సి ఉంటుందని ఇంకో రూ.4లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తేల్చారు. గ్రామస్తులు తలోచేయి వేసి రూ.50వేల వరకు పోగు చేసి అందజేశారు. తనకు వచ్చిన జబ్బు ఆరోగ్యశ్రీలో లేకపోవడం, వైద్యానికి అవసరమైన డబ్బులు సరిపోకపోవడం, ఆర్థిక పరిస్థితి దీనంగా ఉండడంతో మహేశ్ భార్యాపిల్లలు, బంధువులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మహేశ్ భార్య మాధవి, తన ఏడేళ్లలోపు ఇద్దరు పిల్లలు తండ్రిని బతికించండంటూ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు 97018 13527, 98492 89250లలో సంప్రదించాలని కోరుతున్నారు.
మృత్యువుతో పోరాడుతున్న ప్రైవేట్ లెక్చరర్
వైద్యానికి డబ్బు లేక దైన్యం
ఆదుకోవాలంటూ కుటుంబం వేడుకోలు
మా నాన్నను కాపాడండి
మా నాన్నను కాపాడండి
మా నాన్నను కాపాడండి
మా నాన్నను కాపాడండి


