
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు
సిరిసిల్లటౌన్: పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సింది పోయి అక్రమంగా దాడులకు పాల్పడటం సిగ్గుచేటని జర్నలిస్టులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు వారెంటు లేకుండా సోదాలు చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జ యంత్‌కుమార్,ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, కరుణాల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, రాపెల్లి సంతోష్, కాంబోజి ముత్యం, కాయితీ బాలు, పాలమాకుల శే ఖర్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, కోశాధికారి వంకాయల శ్రీకాంత్, సహాయ కార్యదర్శి కంకణాల శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
● సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన ర్యాలీ