
బుగ్గ.. జలసవ్వడుల అడ్డా
● నీటిబెంగ తీర్చుతున్న అక్కపల్లి బుగ్గ ● వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న నీరు ● మోహిని‘కుంట’నే ఆధారం
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద గుట్టల నుంచి నీటి ఊట వస్తోంది. ఆ ఊట నీరు కుండీలో నిల్వ ఉండడంతో వన్యప్రాణుల దాహం తీరుతుంది. అక్కపల్లి బుగ్గ వద్ద కోతులు నీటిని తాగుతూ ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకుంటున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా చుక్కనీరు లేక.. ఎండిన ఆకులు.. తడిలేని ఒర్రెలు దర్శనమిస్తుంటే అక్కపల్లి బుగ్గజలం.. వన్యప్రాణులకు వరంగా మారింది.