
చర్యలు తీసుకోవాలి
బావుపేట, ఒద్యారం, వెంకట్రావుపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను(డస్ట్) రోడ్డు పరిసరాల్లో విచ్చలవిడిగా పారబోస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రెండు జిల్లాలకు చెందిన మైనింగ్, ఆర్‌అండ్‌బీ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. గ్రానైట్ వ్యర్థాల డస్ట్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి
కళ్లు దెబ్బతింటున్నాయి
రోడ్లపై పోసిన గ్రానైట్ డస్ట్ రాతిపొడి చూర గాలికి లేవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బైక్‌లపై ప్రయాణం చేసేవారి కళ్లలో డస్ట్ పడడంతో దెబ్బతింటున్నాయి. ఒక్కోసారి బైక్‌లు స్కిడ్ అవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
– దోమకొండ విజయ్, కొదురుపాక

చర్యలు తీసుకోవాలి