
నీటి ఎద్దడి అధిగమించాం
● అన్ని వార్డులకు నిర్ణీత సమయంలో సరఫరా ● అవసరమైన ఏరియాల్లో ట్యాంకర్లతో అందిస్తున్నాం ● వేసవిలో ప్ర‘జల’ ఇబ్బందులు తీరుస్తున్నాం ● వచ్చే ఏడాదిలో విలీన గ్రామాల్లోనూ మిషన్ భగీరథ నీరు ● ఇంటర్వ్యూలో మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వాణి
సిరిసిల్లటౌన్: పక్కా ప్రణాళికతో సిరిసిల్లలో తా గునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషన ర్ పోసు వాణి తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వా ర్డుల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
39 వార్డుల్లో నిత్యం నీటి సరఫరా
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో ని త్యం తాగునీటి సరఫరా చేస్తున్నాం. వేసవి ఆరంభంలో కొన్ని ఏరియాల నుంచి వచ్చిన ఫిర్యాదు ల మేరకు చర్యలు తీసుకున్నాం. ఆయా ఏరియాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాం. అన్ని వార్డులకు ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. 13 మంది లైన్‌మెన్లు, ఇద్దరు బోర్‌వెల్ మెకానిక్స్, 9 మంది లీకేజీ రిపేరర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం
వేసవిలో నీటి కొరత రాకుండా ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93308లో ఇప్పటి వరకు ఎనిమిది ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించాం. ఫిర్యాదుల్లో ఎక్కువగా నల్లా కనెక్షన్లు కావాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా నిత్యం 9 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నాం. మున్సిపల్ ఫిల్టర్ బెడ్, ట్యాంకర్లు, పవర్‌బోర్ల ద్వారా 8.6 ఎం.ఎల్.డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందిస్తున్నాం.
39 వార్డులు.. 13 జోన్లు
సిరిసిల్ల, విలీన గ్రామాలు కలిపి 39 వార్డులను 13 జోన్లుగా విభజించి నీటి సరఫరా చేపడుతున్నాం. ఉదయం 3.30 నుంచి 6 గంటల వరకు ఎనిమిది జోన్లకు, మధ్యాహ్నం 3.30 నుంచి సా యంత్రం 6.30 గంటల వరకు ఐదు జోన్లకు నీటి సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం 1.10లక్షల మంది కి నీటి సరఫరా ఉంది. రాబోయే ఏడాది తర్వాత 1.40లక్షల మందికి 24 ఎంఎల్‌డీ లీటర్ల నీటిని సరఫరా చేసే దిశగా పనులు చేపడుతున్నాం.
విలీన గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ
విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా చే పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లేని చో ట్ల లో ‘అమృత్ 2.0’ పథకంలో భాగంగా మరో 40 కి లోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరుగుతుంది. రూ. 100కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీటి స రఫరాకు కొన్ని నిధులు కేటాయించగా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా సిరిసిల్లలో విలీనమై న గ్రామాలతోపాటు అన్ని వార్డుల్లో నూరుశా తం తా గునీటి పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపడతాం.
4 ట్యాంకర్లతో సరఫరా
సిరిసిల్ల పట్టణంలో మిషన్ భగీరథ, మున్సిపల్ ఫిల్టర్‌బెడ్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. పట్టణ జనాభా 1.10లక్షల మందికి 17.6 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరా కాని ప్రాంతాలకు నాలుగు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. అన్ని వార్డుల్లో మొత్తంగా 450 పవర్‌బోర్ల ద్వారా స్థానికులు నీటిని వినియోగిస్తున్నారు. వాటిలో 11 రిపేర్లు చేయిస్తున్నాం. మిగతా 439 పవర్‌బోర్లు ద్వారా ప్రజలు నిరంతరం నీటిని వినియోగించుకుంటున్నారు.
నీటిని వృథా చేయొద్దు
చాలా మంది నల్లాలకు బిరడాలు బిగించడం లే దు. ఫలితంగా నల్లా నీటిని వాడుకోని వారి ఇళ్లలో నుంచి నీరు వృథాగా పోతుందన్న ఫిర్యాదులు ఉన్నా యి. నల్లా నీరు వృథా పోకుండా పౌరులంతా బా ధ్యతగా ఉండాలి. ఎవరికై నా నీటి సరఫరాలో సమ స్య ఉంటే వెంటనే ఆఫీసులో ఏ ర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. లీకేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేశాం.
సిరిసిల్ల మున్సిపల్ వివరాలు
జనాభా : 1,10,00
రోజూ నీటి సరఫరా : 16,500 మిలియన్ లీటర్లు
డిమాండ్ : 17.6 ఎంఎల్‌డీలు

నీటి ఎద్దడి అధిగమించాం