
వార్పిన్ కార్మికుల సమ్మెబాట
● కూలీరేట్లు పెంచాలని డిమాండ్ ● కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డికి వినతిపత్రం
సిరిసిల్ల: వార్పిన్ కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. వార్పిన్ కార్మికులను ఇస్తున్న కూలీ రేట్లను పెంచాలని కోరుతూ పనులు బంద్ చేసి సమ్మెలోకి దిగారు. దీంతో స్థానికంగా మహిళాశక్తి చీరల ఆర్డర్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. సిరిసిల్లలో వార్పిన్ కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ వార్పిన్, వైపని, పవర్‌లూమ్ కార్మికులు పక్షం రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లకు కూలీ పెంచాలని సమ్మె చేయగా.. చేనేత, జౌళి శాఖ అధికారులు బతుకమ్మ చీరలకు ఇచ్చిన కూలీ కంటే మెరుగైన వేతనం అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారులు హామీ ఇచ్చిన మేరకు మీటరు బట్టపై రూ.2 కూలీ పెంచారన్నా రు. ఈమేరకు కార్మికుల కూలీ పెరగాల్సి ఉండగా.. యజమానులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కూలీని కా ర్మికులకు ఇచ్చేందుకు యజమానులకు మనసు రా వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జౌళిశాఖ అధి కారులు కార్మికుల కూలీ రేట్లను నిర్ణయించే బాధ్యత ను యజమానులకు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ఇప్పటికై నాకూలీరేట్లు పెంచాలని కో రారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, కార్మిక నాయకులు ఉడుత రవి, మచ్చ వేణు, బూట్ల వెంకటేశం, దోమల రమేశ్, ఐరన్ ప్రవీణ్, సామల శీను పాల్గొన్నారు.
నేడు పాలిస్టర్ అసోసియేషన్ భవన్ ఎదుట ధర్నా
పవర్‌లూమ్ కార్మికులు, వార్పర్లు, వైపనికార్మికుల కూలీరేట్లు పెంచాలని కోరుతూ బుధవారం సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ భవన్ ఎదుట ధర్నా చేస్తున్నామని సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ ధర్నాలో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డికి వినతి
కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మ హిళాశక్తి చీరలకు ఆర్డర్లు ఇవ్వగా.. కార్మికుల కూలీ లో కోత విధిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజ కవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. సరైన వేతనం ఇ వ్వకుండా కూలీ రేట్లను తగ్గించాలని చూస్తున్నా యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.