సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

May 7 2025 12:03 AM | Updated on May 8 2025 2:10 PM

ఎస్పీ మహేశ్‌ బీ గీతే 

సిరిసిల్ల: సైబర్‌ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. మోసపోతే జరిగిన గంట(గోల్డెన్‌ అవర్‌)లోపు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాలపై మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో మొబైల్‌కు వచ్చే లింకులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు, కొత్త నంబర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేస్తే మీ మొబైల్‌ హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాలు, ఫొటోలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 

సోషల్‌మీడియా అకౌంట్స్‌కు ప్రొఫైల్‌ లాక్‌ పెట్టుకోవాలని సూచించారు. లోన్‌యాప్‌లకు దూరంగా కోరారు. కస్టమర్‌ కేర్‌ నంబర్లను గూగుల్‌లో వెతకొద్దని సూచించారు. ఈజీ రిటర్న్స్‌, కమీషన్‌ బేస్డ్‌ సైట్లలో పెట్టుబడి పెట్టొద్దని, పాస్‌వర్డ్‌, ఓటీపీ, పిన్‌ నంబర్లను ఎవరికీ షేర్‌ చేయొద్దని కోరారు. ‘డిజిటల్‌ అరెస్ట్‌’లో ఉన్నారని బెదిరింపులకు ఎవరైనా దిగినా స్పందించొద్దని సూచించారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

బోయినపల్లి/గంభీరావుపేట/వేములవాడరూరల్‌: అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లపాలవుతున్నాయి. బోయినపల్లి, గంభీరావుపేట మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాని కి ధాన్యం తడిసిపోయింది. కాంటా పెట్టిన ధా న్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. బోయినపల్లి మండలం కోరెంలోని కేంద్రంలో ఽరైతుల ధాన్యం కుప్పలు తడవడంతో లబోదిబోమన్నా రు. కాంటా పెట్టిన సంచులు సైతం తడిశాయి.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా సహకార అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అకాల వర్షానికి నష్టం జరిగిన రైతుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. లారీల కొరత ఉందని, వేములవాడ పరిధిలో బాయిల్డ్‌ రైస్‌మిల్లులు సరిపడా లేనందున జాప్యమవుతుందని తెలిపారు.

బోనమో పోచమ్మా

వేములవాడ: రాజన్న దర్శనానంతరం భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బోనాలతో అమ్మవారి చెంతకు చేరుకుని బోనం, కల్లుసాక, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

సమ్మె విజయవంతం చేయండి

సిరిసిల్లటౌన్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం సమ్మె పోస్టర్‌ను సిరిసిల్లలో ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, గాజుల రా జు, బూట్ల వెంకటేశ్వర్లు, అవధూత హరిదాసు, చింతకింది సుదర్శన్‌, దోమల రమేశ్‌, శ్యామ్‌, సతీశ్‌, సదానందం పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా స్వామి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిధిగా కదిరె స్వామి గౌడ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో నియామకపత్రం అందుకున్నారు. మండలంలోని మద్దికుంటకు చెందిన స్వామిగౌడ్‌ పదేళ్లుగా వెనుకబడిన తరగతుల హక్కుల కోసం పోరాడుతున్నారని, మరింత చురుకుగా పనిచేసేందుకు రాష్ట్ర అధికార ప్రతి నిధిగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి1
1/1

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement