మధ్యాహ్న భోజనంపై ఎంఈవో నిలదీత
● సుద్దాల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘటన
కోనరావుపేట(వేములవాడ): నిత్యం ఉడకని అన్నం నీళ్లచారుతో విద్యార్థులు భోజనం చేయలేని పరిస్థితి ఉందని మండల విద్యాధికారి మురళీనాయక్‌ను సుద్దాల హైస్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు శుక్రవారం ఎంఈవో రాగా అక్కడే ఉన్న తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనం నిర్వహణ సరిగా లేదని ఫిర్యాదు చేశారు. అన్నం సరిగా ఉడకడం లేదని, కూరలో కారం, ఉప్పు ఎక్కువగా వేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే భోజనంలో నాణ్యత ఉండడం లేదన్నారు.


