సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కోనరావుపేట(వేములవాడ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని గర్భిణీల రిజిస్ట్రేషన్, చెకప్ ఆన్‌లైన్ నమోదు పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య పథకాల ఎన్‌సీడీ, టీబీ వ్యాధి ఇతర ఆరోగ్య కార్యక్రమాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. వైద్యాధికారులు వేణుమాధవ్, సురేష్, సీహెచ్‌వో బాలచంద్రం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, డిప్యూటీ డెమో రాజుకుమార్ పాల్గొన్నారు.


