వేములవాడలో కాషాయజెండా ఎగురవేద్దాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
వేములవాడ: రాజన్న క్షేత్రం కొలువై ఉన్న వేములవాడలో కాషాయ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి స్పష్టం చేశారు. సిరిసిల్లలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో మాదిరిగానే బీజేపీ కాషాయ జెండాను ఎగురవేసేందుకు నాయకత్వం, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ గతంలో కంటే బీజేపీ ఇప్పుడు బలంగా ఉందన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు ఎర్రం మహేష్, సిరికొండ శ్రీనివాస్, కృష్ణస్వామి, సంటి మహేష్, రేగుల రాజ్‌కుమార్, రాధిక, వివేక్, సంతోష్, వెంకన్న, అశోక్, గడ్డమీద శ్రీను తదితరులు పాల్గొన్నారు.


