కలెక్టరేట్‌లో చేనేతలక్ష్మి
సిరిసిల్లటౌన్: చేనేత కార్మికులకు ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసే ‘చేనేత లక్ష్మి’ కార్యక్రమం ఈ ఏడాది ఆరంభమైంది. ఈమేరకు కలెక్టరేట్‌లో చేనేత వస్త్రోత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్‌తో చేనేత కార్మికులకు చేతినిండా పని, సరసమైన ధరలలో బట్టలు డిస్కౌంట్‌లో లభిస్తాయని సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు తెలిపారు.
పనులు పూర్తి చేస్తాం
రుద్రంగి(వేములవాడ): మండలంలోని గైదిగుట్టతండాలో పనులు మధ్యలోనే నిలిచిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల భవనం పనులను మార్చి 31లోగా పూర్తి చేస్తామని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ సత్యానందం తెలిపారు. డీఈ సంపత్ కుమార్, ఏఈ మాధురిలతో కలిసి భవనం పనులను శుక్రవారం పరిశీలించారు. ప్రిన్సిపాల్ ప్రతిభ, రుద్రంగి మాజీ వైస్ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి ఉన్నారు.
రోడ్డు నియమాలు పాటించాలి
వేములవాడఅర్బన్: ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. వేములవాడ నందికమాన్ వద్ద శుక్రవారం రోడ్డు భద్రత మసోత్సవాల భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్లను తనిఖీ చేశారు. కార్లు డ్రైవింగ్ చేసే సమయంలో సీటుబెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనలు నడపొద్దని, రాంగ్‌రూట్‌లో వెళ్లకూడదని సూచించారు. వేములవాడ ట్రాఫిక్ ఎస్సై రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, రజనీ, ఫృథ్వీరాజ్‌వర్మ పాల్గొన్నారు.
సర్పంచ్‌కు పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మంజుల మలేషియా పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందారు. కరీంనగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. 2020లో జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం మలేషియాలోని లింకన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందినట్లు మంజుల తెలిపారు.
వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా నాగార్జున చక్రవర్తి
సిరిసిల్లటౌన్: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి శుక్రవారం నియమితులయ్యారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ హెచ్‌వోడీ అనస్థీషియా డిపార్ట్‌మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాలతో ఈమేరకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నియమించారు. నాగార్జున చక్రవర్తిని తోటి వైద్యులు, సిబ్బంది అభినందించారు.
సెలవులో రాజన్న ఈవో
వేములవాడ: రాజన్న ఆలయ ఈవో రమాదేవి వారం రోజులపాటు సెలవులో వెళ్లినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 6 వరకు ఆమె సెలవులో ఉండనున్నారు. ఈనెల 7 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నారు.
కలెక్టరేట్‌లో చేనేతలక్ష్మి
కలెక్టరేట్‌లో చేనేతలక్ష్మి
కలెక్టరేట్‌లో చేనేతలక్ష్మి
కలెక్టరేట్‌లో చేనేతలక్ష్మి


