అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది

May 15 2025 2:12 AM | Updated on May 15 2025 2:12 AM

అర్బన

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది

● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక జైస్వాల్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ చాలా బాగుందని, ప్రకృతిసిద్ధంగా పెరిగిన చెట్లు, సెలయేళ్లు చూడముచ్చటగా ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక జైస్వాల్‌ పేర్కొన్నారు. పార్క్‌ను బుధవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. పండ్లు, మోదుగుచెట్లు పెంచడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిద్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు అటవీహక్కుల చట్టా లను తెలియజేయడంతోపాటు వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కేంద్రంలో లభించే ఉచిత న్యాయ సదుపాయాన్ని వినియోగించుకునేలా అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వి.శ్రీహరిప్రసాద్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులోని సదుపాయాల గురించి వివరించారు. లోక్‌ అదాలత్‌ మెంబర్లు చింతోజు భాస్కర్‌, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు.

ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

ఎస్పీ మహేశ్‌ బీ గీతే

బోయినపల్లి(చొప్పదండి): ఫిర్యాదులపై వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో 5–ఎస్‌ అమలు తీరు తెలుసుకున్నారు. కేసుల వివరాలు, పెండింగ్‌ ఫైల్స్‌, రికార్డ్‌ గది పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించాలని తెలిపారు. వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, పీఎస్సై అనిల్‌కుమార్‌, ఏఎస్సై మోతీరామ్‌ తదితరులు ఉన్నారు.

నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): యూరియా తక్కువ మోతాదులో వాడుతూ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల్లో అధిక దిగుబడి పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి లత పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌ రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ సాగు యాజమాన్య పద్ధతులు, కూరగాయలు, పూలసాగుపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి సురేశ్‌రెడ్డి, ఏఈవోలు జ్యోతి, అర్చన, రవళి, లలిత, గంగ పాల్గొన్నారు.

హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి

సిరిసిల్ల: కరీంనగర్‌లో ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ కోరారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడులో బుధవారం స్థానిక హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసి, హిందూ ఏక్తాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ కరీంనగర్‌లో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొంటారని తెలిపారు. బీజేపీ నాయకులు బూర విష్ణు, అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు మాస బాలయ్య, మాస వంశీకృష్ణ, ఏశ సాయిదీప్‌, పోతుల సాయిచరణ్‌, బూర దేవరాజు, వంగ కృష్ణ, బూర కొమురయ్య, నర్సయ్య, శశిధర్‌ పాల్గొన్నారు.

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది
1
1/3

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది
2
2/3

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది
3
3/3

అర్బన్‌ ఫారెస్ట్‌ బాగుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement