
పిల్లలకోసం మా వంతుగా
మండే ఎండల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించా లని నేనూ, మా స్నేహితులు ముందుకు వచ్చాం. పత్తిపాక దామోదర్, మోర విష్ణు, పత్తిపాక మధు, కారంపురి శ్యాంసుందర్, గుడ్ల ప్రభాకర్, నాగుల రవీందర్, దాసరి నాగేశ్వర్, సబ్బని భాస్కర్‌తో కలిసి రోజూ అరటి పండ్లు, స్నాక్స్ అందిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, మోర దామోదర్ తాగునీటి వసతి కల్పిస్తున్నారు.
– గాజుల ప్రతాప్, విశ్రాంత ప్రిన్సిపాల్
పేద పిల్లలకు వరప్రసాదం
నేత పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కార్మిక కుటుంబాలకు పాలిసెట్ ఉచిత శిక్షణ వరప్రసాదంగా మారింది. ఏటా 100 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రేరణగా నిలిచింది. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా కొనసాగిస్తున్నాం. స్వచ్ఛంద సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు పోపా తరఫున ధన్యవాదాలు.
– మామిడాల భూపతి, పోపా ఉపాధ్యక్షుడు
పుష్కర కాలంగా
పదేళ్లకు పైగా సమితి సారథ్యంలో పిల్లలకు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నాం. డైట్ సెట్ ద్వారా సీట్లు సాధించిన చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికై జీవితంలో స్థిరపడడం చాలా సంతృప్తి కలిగించే అంశం. ఏటా 150 మంది పిల్లలు ఈ శిబిరం ద్వారా ప్రయోజనం పొందడం సమితి సభ్యులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
– గోశికొండ బాలరాజు, శిబిరం నిర్వాహకుడు

పిల్లలకోసం మా వంతుగా

పిల్లలకోసం మా వంతుగా