
ఆశన్నపల్లెలో నకిలీ మందుల విక్రయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆశన్నపల్లె గ్రామంలో సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ నిర్వాహకుల మని నమ్మించి గ్రామస్తులకు సోమవారం నకిలీ మ ందులు విక్రయించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్ మంద వెంకన్న వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను అదుపులోకి తీసకున్నారు. వరంగల్‌కు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి చేరుకుని గడువు తీరిన, నకిలీ మందులు విక్రయించారు. విక్రేతలకు గ్రామ పంచాయతీ కా ర్యదర్శి సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపించా రు. ఈవిషయమై డిప్యూటీ డీఅండ్‌హెచ్‌వో సుధాక ర్, కూనారం ఆరోగ్య కేంద్రం డాక్టర్ భావన మాట్లాడుతూ, నకిలీ వైద్యం, నకిలీ మందులకు ప్రజలు మోసపోవద్దన్నారు. నకిలీ మందులు, వాహనాన్ని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.