ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు

May 10 2025 12:09 AM | Updated on May 10 2025 12:09 AM

ప్రభు

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు

వేములవాడఅర్బన్‌: యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రుల భవనాలపై పన్నెండు అడుగుల పొడవు, వెడల్పుతో రెడ్‌క్రాస్‌ గుర్తు వేయడం జరిగిందని వేములవాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పెంచలయ్య తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి భవనంపై సైతం గుర్తును వేశామని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యవసర వైద్యసేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియమాల్లో భాగంగా, గుర్తు వేయడం జరిగిందన్నారు.

దర్శావళి ఉత్సవాలకు రండి

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని దర్శావళి దర్గా వద్ద ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు రావాలని కోరుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు శుక్రవారం నిర్వాహకుడు అజీజ్‌బాయి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ముస్లిం కమిటీ సభ్యులు చాంద్‌పాషా, షేక్‌ సాహెబ్‌, షేక్‌ గౌస్‌, మహమ్మద్‌ జబ్బర్‌, జహాంగీర్‌, ఇర్ఫాన్‌, గౌస్‌ పాల్గొన్నారు.

చేనేత శిల్పికి సన్మానం

సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీర సృష్టికర్త, సిరిసిల్ల చేనేత శిల్పి నల్ల విజయ్‌కుమార్‌ను ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శుక్రవారం హరి యాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సన్మానించారు. అగ్గిపెట్టలో ఇమిడే చీర, బంగారు, వెండిపోగులతో తయారు చేసిన చీరను మగ్గంపై నేసి అబ్బుర పరిచారు. ఆ చీరను దత్తాత్రేయ సతీమణికి ఉప రాష్ట్రపతి జగదీశ్‌ దినకరగ్‌ చేతుల మీదుగా బహుకరించారు. విజయ్‌ కుమార్‌ను దత్తాత్రేయ అభినందించారు.

ఇంటర్‌లో స్పాట్‌ కౌన్సెలింగ్‌

సిరిసిల్ల: ఇంటర్‌ 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో ఎస్టీ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ సమన్వయ అధికారి డీ.ఎస్‌.వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలికలు), సిరిసిల్ల ఎస్టీ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలికలు), మానాల (వేములవాడ), ఎస్టీ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలికలు), అక్కన్నపేట (హుస్నాబాద్‌), ఎస్టీ గురుకుల జునియర్‌ కళాశాల మంథనిలో సీట్ల భర్తీకి స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలికలు), సిరిసిల్ల (ఇందిరమ్మ కాలనీ) సారంపల్లిలో మే 16న నిర్వహించే కౌన్సెలింగ్‌ హాజరు కావాలని కోరారు. 10వ తరగతి ఉత్తీర్ణులు అయిన బాల, బాలికలు అన్నీ ఒరిజి నల్‌ ధృవీకరణ పత్రాలతో పాటు, ఒక సెట్‌ జిరాక్స్‌ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని వెంకన్న కోరారు. వివరాలకు ఫోన్‌ నంబర్‌ 83339 25362ను సంప్రదించాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు 
1
1/2

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు 
2
2/2

ప్రభుత్వ ఆస్పత్రిపై రెడ్‌క్రాస్‌ గుర్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement