విద్యార్థులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అభినందనలు

May 6 2025 12:05 AM | Updated on May 6 2025 12:05 AM

విద్య

విద్యార్థులకు అభినందనలు

సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బీ గీతే అభినందించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు పి.ప్రణవి 564, స్వేచ్ఛ 538, పి.కిరణ్‌తేజ 537, పి.మధుశాలిని 533, సంపత్‌కుమార్‌ 533, శ్రీవాణి 525, జి.రుచిత 524 మార్కులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.మురళీధర్‌, ఉపాధ్యాయులు ఎస్‌.దేవయ్య పాల్గొన్నారు.

బీమాచెక్కు పంపిణీ

గంభీరావుపేట(సిరిసిల్ల): ఇటీవల మృతిచెందిన మండల కేంద్రానికి చెందిన సహకార సంఘం సభ్యుడు వంగ రాజిరెడ్డి కుటుంబానికి బీమా చెక్కును నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అందించారు. గంభీరావుపేటకు చెందిన బరిగెల బాలకిషన్‌ ఇటీవల రోడ్డు ప్ర మాదంలో మృతిచెందాడు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వ బీమా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, పట్టణాధ్యక్షుడు పెద్దవేని వెంకటి, ప్రధాన కార్యదర్శి గంధ్యాడపు రాజు, సెస్‌ డైరెక్టర్‌ గౌరినేని నారాయణరావు, సింగిల్‌విండో చైర్మన్‌ సురేందర్‌ పాల్గొన్నారు.

బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు

సిరిసిల్ల: జిల్లాలో బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు చేస్తున్నామని, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి పి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. జిల్లాలో బహిరంగంగా మద్యపానంపై ‘సాక్షి’లో ‘ఓపెన్‌ సిట్టింగ్‌’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎకై ్సజ్‌ అధికారి జిల్లాలో ఈ ఏడాది 31 బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేశామని, 34 మందిని అరెస్ట్‌ చేసి 503 లీటర్ల మద్యం సీజ్‌ చేసినట్లు తెలిపారు. జిల్లాలో బెల్ట్‌షాపులపై నిఘా ఉంచామని, బహిరంగ మద్యం సేవించడాన్ని టాస్క్‌ఫోర్స్‌ టీంతో నిరోధిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఎకై ్సజ్‌ అధికారులు స్పందించారు.

ధాన్యం కాంటా పెట్టండి

కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా లారీలు రావడంలేదని, దీంతో కొనుగోళ్లు కూడా నిలిచిపోయాని మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. గొల్లపల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా లారీలు రాకపోవడంతో కాంటా కూడా పెట్టడం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదముందని, అధికారులు స్పందించి వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లను మొదలుపెట్టాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్‌ బండ రవి, రైతులు మాడుగుల శ్రీకాంత్‌, బొంగు రవి, బండ మల్లేశం, కాలువ దేవమల్లయ్య, బండ శంకర్‌ పాల్గొన్నారు.

సేంద్రియ సాగుతో అధిక దిగుబడి

ముస్తాబాద్‌/ఇల్లంతకుంట: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించడమే కాదు.. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సతీశ్‌ పేర్కొన్నారు. ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ రైతువేదికలో అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డాక్టర్‌ సతీశ్‌ అధునాతన వ్యవసాయ పద్దతులను అవలంభించి దిగుబడులు సాధించవచ్చన్నారు. పంట మార్పిడిని పాటించాలన్నారు. శాస్త్రవేత్త సంపత్‌, ఏఎంసీ చైర్మన్‌ తలారి రాణి, సెస్‌ డైరెక్టర్‌ అంజిరెడ్డి, ఏవో దుర్గారాజు, ఏఈవోలు అనుష, సౌమ్య, నరేశ్‌, అఖిల పాల్గొన్నారు.

పంట మార్పిడి ద్వారా భూసారం పెంపు

వరిపంట కోసిన వెంటనే వ్యవసాయ భూముల్లో పచ్చిరొట్ట, పెసర, సాగు చేసుకుంటే భూసారం పెరుగుతోందని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు రైతువేదికలో పాల్గొన్నారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మదన్మోహన్‌, అసోసియేట్‌ డీన్‌ కేబీ సునీతా దేవి, డాక్టర్‌ ఉషారాణి, విజయభాస్కర్‌రెడ్డి, శ్రావణి, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందనలు
1
1/3

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులకు అభినందనలు
2
2/3

విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులకు అభినందనలు
3
3/3

విద్యార్థులకు అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement