
రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని వంకాయగూడెంలో మంగళవారం వేకువజామున బొగ్గులారీ రోడ్డు కిందకు దూసుకుపోయింది. బొగ్గులోడ్ లారీ వైజాగ్ నుంచి నాగపూర్ వెళ్తుండగా వంకాయగూడెంలోకి చేరుకోగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ రోడ్డు కిందకు దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రం దగ్ధం
సిరిసిల్లటౌన్: షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి ఉపాధి కేంద్రం కాలిపోయిన ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో రజనీకాంత్ చాలా రోజులుగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాప్‌ను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచే సరికి కంప్యూటర్, ఫర్నీచర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలిపోయినట్లు పేర్కొన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
వేములవాడ: వేములవాడలోని మార్కండేయనగర్‌లో తాళం వేసిన ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. తాటికొండ సంతోష్ అనే ఫిజియోథెరపిస్ట్ కు టుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విహా రయాత్రకు వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో ఉన్న దాచిన రూ.25వేలకు పైగా నగదు, 10 గ్రాముల బంగారం వస్తువులు చో రీ అయింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరి పొలం దగ్ధం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): హుస్సేన్‌మియా వాగు సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు జంగ రాజయ్యకు చెందిన ఎకరంపావు బాస్మతి వరి, కొరకండ్ల శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 30 గుంటలు బాస్మతి వరి కుప్ప మంటల్లో కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వరి కొయ్యలు కాలపెట్టడంవల్లే నిప్పురవ్వలు గాలికి చెలరేగి మంటలు వ్యాపించినట్లు బాధిత రైతులు వాపోయారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ