
చివరి గింజ వరకు కొంటాం
కోనరావుపేట: రైతులు పండించిన ఆఖరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వేమువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా వడ్ల కొనుగోలు జరుగుతోందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని తీసుకుని వస్తే వెంటనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం సేకరించి మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం తాలుతప్ప పేరుతో నిలువునా మోసం చేసిందని రైతులు విప్ దృష్టికి తెచ్చారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
దర్శావళి ఉత్సవాలకు రావాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారులో గల దర్శావళి దర్గా ఉత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో పాటు జిల్లా అధికారులకు శుక్రవారం ఉత్సవ నిర్వాహకులు అజీజ్‌బాయి, కాంగ్రెస్ నాయకులు ఆహ్వానం పలికారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలను వారి కార్యాలయాల్లో కలిసి ఉత్సవ ఆహ్వానపత్రికలను అందజేశారు. అనంతరం సిరిసిల్లలో గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌కు అందించారు. ఈ నెల 15న ఉర్సు ఉత్సవాలు ఉంటాయని, అదే రోజు మండల కేంద్రం నుంచి దర్శావళి దర్గా వరకు సందల్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుందని నిర్వహకులు అజీజ్‌బాయి తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్