
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది.
– తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్‌పూర్ (కోనరావుపేట)
దేశ సేవలో..
నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు.
– బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట)

ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..