
ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణకు రూ.47కోట్ల పరిహారం మంజూరైందన్నా రు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్, బీఎస్పీ నాయకులు సోమవారం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు
రాజన్న ఆలయ పరిసరాలు, తిప్పాపుర్‌లలో కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 10 మంజూరు చేసినందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త సబ్‌స్టేషన్లతో వేములవాడ పట్టణం, తిప్పాపూర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండబోదన్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాటి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.