
ఎండుతున్న మొక్కలు
ముస్తాబాద్: ముస్తాబాద్– కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. ముస్తాబాద్, నామాపూర్ మధ్య ఈ పరిస్థితి నెలకొంది. మొర్రాయిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు కిలోమీటర్ల పరిధిలో రహదారి పక్కన ఉన్న మొక్కలకు పంచాయతీ సిబ్బంది నీరందించడం లేదు. మండువేసవిలో మొక్కలు ఎండుతున్నా... పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. పంచాయతీలో నిధులున్నా.. మొక్కలను కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాల్సి ఉండగా.. పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.