
ఇసుక రీచ్‌లు తెరవాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, పదిర, వెంకటాపూర్ గ్రామాల్లో ఇసుక రీచ్‌లు ప్రారంభించాలని ట్రాక్టర్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గ్రామాల నుంచి 70ట్రాక్టర్లతో తరలివచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో నారాయణపూర్, వెంకటాపూర్ ఇసుక రీచ్‌లను రద్దు చేశారు. పదిర రీచ్‌కు మాత్రమే అనుమతులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో తమ గ్రామాల్లోనూ రీచ్‌లు ప్రారంభించాలని ఆందోళన నిర్వహించి, తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం ఇచ్చారు.