
వక్ఫ్ ఆస్తులపై దురాక్రమణ తగదు
● వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
● మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు
జగిత్యాలటౌన్: వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ దురాక్రమణ తగదని, వక్ఫ్ అధికారాలను పరిమితం చేయడం సరికాదని, ఇది ముస్లిం మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్‌ఇండియా పర్సనల్ లాబోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు కేవలం షరియా మేధోమార్పిడి మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధంగా లభించిన మైనార్టీల హక్కులకు విరుద్ధంగా ఉందన్నారు. ర్యాలీలో మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లియాఖత్‌అలీ మొహిసిన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ కౌన్సిలర్, ముస్లిం సదర్ మహ్మద్‌భారీ, నేహాల్ పాల్గొన్నారు.