
వచ్చే నెలలో ప్రత్యేక లోక్ అదాలత్
సిరిసిల్లకల్చరల్: అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం వచ్చే నెలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. జూన్ 9 నుంచి 14 వరకు నిర్వహించే అదాలత్‌లో ప్రధానంగా చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. సంప్రదింపులు, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకునే కక్షిదారులు 14న జరిగే మెగా జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారానికి నోచుకునేలా పోలీస్ యంత్రాంగం న్యాయవాదులు సహకరించాలని సూచించారు. న్యాయమూర్తులు లక్ష్మణాచారి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్, ప్రవీణ్‌కుమార్, గడ్డం మేఘన, కావేటి సృజన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు పాల్గొన్నారు.
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ