
మేరా భారత్ మహాన్
సిరిసిల్లటౌన్: మేరా భారత్ మహాన్..భారత్ మాతాకీ జై.. అనే నినాదాలతో సిరిసిల్ల హోరెత్తింది. పాకిస్థాన్‌తో భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతుండడంపై జిల్లా కేంద్రం హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. కుల, మతాలకతీతంగా సబ్బండ వర్గాలు ఏకమై శనివారం రాత్రి భారత సైన్యం సాహసోపేతాన్ని కొనియాడుతూ ‘త్రివర్ణ సిందూర్ ర్యాలీ’ నిర్వహించారు. చేనేతన్న విగ్రహం నుంచి అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, పెద్దబజార్ మీదుగా వేలాది సంఖ్యలో పౌరులు మువ్వన్నెల జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా, పట్టణ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, దుమాల శ్రీకాంత్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్‌కుమార్, సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.