
సామాన్యులు సాధించారు
దేశ సరిహద్దుల్లో నుంచి ప్రజాక్షేత్రంలోకి..
ముస్తాబాద్ పీఎస్సైగా విధుల్లో చేరిన బాలెంకి శ్రీనివాస్ 17 ఏళ్లు ఆర్మీలో హవల్దార్‌గా చేశారు. శ్రీనివాస్‌ది సాధారణ రైతుకుటుంబం. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బాలెంకి ఆశలు, రాజేశ్వరీ దంపతుల కుమారుడు శ్రీనివాస్ విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. డిగ్రీ ఫైనలియర్‌లోనే ఆర్మీకి ఎంపికై కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, పుణేతోపాటు భూటాన్ దేశంలో పనిచేశారు. 17 ఏళ్లపాటు ఆర్మీలో విధలు నిర్వర్తించి, 2022లో రిటైర్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు.
నాన్న కష్టాలను చూసి..
మానకొండూరు మండలం రంగపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి, వనజ దంపతుల కుమార్తె వినీతారెడ్డి. ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన వినీతారెడ్డి కోటి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చది వారు. నాన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం సాధించాలనే తపనతో చదివి ఎస్సైగా ఎంపికయ్యారు. తంగళ్లపల్లిలో ప్రొబేషనరీ ఎస్సైగా విధుల్లో చేరారు. షీటీమ్, డయల్ 100, సైబర్ నేరాలపై మహిళలను చైతన్యం చేస్తున్నారు. వినీతారెడ్డి వివాహం తన బ్యాచ్‌మేట్, కోనరావుపేట ప్రొబేషనరీ ఎస్సై రాహుల్‌రెడ్డితో ఇటీవల జరిగింది. నేతకార్మికులు ఉండే ప్రాంతం కావడం.. చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటుండడం ఆమెను కలచివేసింది. నేతన్న కుటుంబాల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

సామాన్యులు సాధించారు

సామాన్యులు సాధించారు

సామాన్యులు సాధించారు