
వైద్యం కోసం సాయం చేయండి
మాది వీర్నపల్లి మండలం వన్‌పల్లి. నేను గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న. మాకున్న ఎకరం భూమిని అమ్మి అమ్మనాన్నలు రూ.15లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.10లక్షలు వైద్య ఖర్చులకు అవసరం ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వపరంగా సాయం అందిస్తే వైద్యం చేయించుకుంటాను.
– జింక ప్రభాస్, వన్‌పల్లి
ఆస్తిని తీసుకున్నారు
మాది తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్. నా భర్త నర్సయ్య పన్నెండేళ్ల క్రితం చనిపోగా మాకున్న పొలాన్ని ముగ్గురు కొడుకులు వారి పేర్లపై పట్టా చేయించుకున్నారు. వారు కూడా కాలం చేయగా.. పెద్దకోడలు కనుకవ్వ, రెండో కోడలు భద్రవ్వ పట్టించుకోవడం లేదు. రోజూ తిడుతున్నారు. తిండికూడా పెట్టడం లేదు.
– వంతడ్పుల నర్సవ్వ

వైద్యం కోసం సాయం చేయండి