
కులమతాలకు అతీతంగా అభివృద్ధి
ఎల్లారెడ్డిపేట/తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమ హయాంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులోని దర్శావలిగుట్టపై గురువారం నిర్వహించిన ఉర్సు ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో దర్శావలి గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉర్సు ఉత్సవాల నిర్వాహకులు సన్మానించారు. ఉత్సవాల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, నాయకులు అందె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
భీరప్పకామరాతి కల్యాణానికి హాజరు
తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన భీరప్పకామరతి కల్యాణంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు.
● దర్శావలి ఉర్సు ఉత్సవాల్లో మాజీ మంత్రి కేటీఆర్