
మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత : ఎస్పీ
సిరిసిల్ల ఎడ్యుకేషన్: రుద్రంగి మండలంలో శుక్రవా రం మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గురువారం సమీక్షించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, డీసీ ఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.