
సజావుగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
సిరిసిల్ల ఎడ్యుకేషన్/తంగళ్లపల్లి: జిల్లాలో పాలీసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా సాగింది. తంగళ్లపల్లి, గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనితీరును తెలుసుకున్నారు. తంగళ్లపల్లి హైస్కూల్‌లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ శంకర్ నారాయణను ఆదేశించారు. బోరుమోటార్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో 2,136 మందికి 2,027 మంది హాజరయ్యారు.