
చెత్త కాదు.. ఫైళ్లగుట్ట
కోనరావుపేట: కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలోని ఉపాధి హామీ కార్యాలయం ఫైళ్లతో నిండిపోతోంది. ఫైళ్లతో సగం కార్యాలయం గుట్టలుగా పేరుకుపోయింది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీకి సంబంధించిన ఫైళ్లన్నీ సంచుల్లో కట్టి పెడుతున్నారు. ఇలా పెట్టుకుంటూ ఏళ్లుగా ఇలా మూలకు పడేస్తున్నారు. దీంతో కార్యాలయంలో ఫైళ్లన్నీ గుట్టలుగా మారుతున్నాయి. సగం కార్యాలయం వీటికే పోవడమే కాకుండా క్రిమి కీటకాలు చేరే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. ప్రజలు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.