breaking news
murder case
-
ఇబ్రహీంపట్నంలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి హత్య
-
‘పోలీసులకు చెప్పాడని’ అనుమానంతో.. స్నేహితుడి దారుణహత్య!
హైదరాబాద్: మహానగరంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే కత్తులతో విరుచుకుపడి నిండు ప్రాణాలు తీశారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్న సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని స్నేహితులే కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన మేరకు.. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ ప్రాంతానికి చెందిన వసీం(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చింతల్మెట్ ప్రాంతానికి చెందిన సోహెబ్, ఇలియాస్‌లు స్నేహితులు. గతంలో మాదకద్రవ్యాలు అమ్ముతూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారు. జైలు నుంచి వచ్చిన అనంతరం ముగ్గురూ కలిసి స్థానికంగా మాదకద్రవ్యాలు అమ్ముతున్నారు. కొన్ని రోజుల నుంచి స్నేహితులకు వసీం దూరంగా ఉంటున్నాడు.మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఇరువురిని గతంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తమ సమాచారాన్ని వసీం పోలీసులకు అందించాడని ఇద్దరూ భావించి గొడవపడ్డారు. ఇదే విషయమై మనస్పర్థలు వచ్చాయి. గురువారం వసీం ఇంటికి వచ్చిన ఇలియాస్, సోహెబ్‌లు బయటకు పిలిచి ఇదే విషయమై చర్చించారు. మాట మాట పెరిగి వసీంపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలైన వాసీం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరొకరితో వెళ్లిపోయేందుకు సిద్ధపడిందని.. -
టమోట పంట అమ్మి ప్రియుడికి డబ్బులిచ్చింది!
బి.కొత్తకోట (మదనపల్లె టౌన్) : నాయనబావి సమీపంలో యువరైతు గోపాల్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన భార్య ప్రతిభను బి.కొత్తకోట పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి అరెస్టుకు సంబంధించి సీఐ గోపాల్ రెడ్డి మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. బి కొత్తకోట మండలంలోని నాయుని బావి పంచాయతీ కామ్మోళ్లపల్లెకు చెందిన గోపాల్‌రెడ్డి భార్య ప్రతిభకు అదే పంచాయతీ కాయలవారిపల్లికి చెందిన దాదం దేవేంద్రరెడ్డితో వివాహేతర సంబంధం ఉన్న విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల టమోటా పంట ద్వారా వచ్చిన డబ్బులను భార్య దేవేంద్రరెడ్డికి ఇవ్వడంపై గోపాల్‌రెడ్డి మందలించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. భర్త వేధిస్తున్నాడంటూ ప్రతిభ తన తమ్ముడు రాజశేఖర్‌రెడ్డితో చెప్పి బాధపడేదని తెలిపారు. వారం రోజుల క్రితం పొలం వద్ద ఏడుస్తూ.. భర్తను అడ్డు తొలగించుకుంటేనే తనకు మనశ్శాంతి ఉంటుందని ప్రతిభ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో రాజశేఖర్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి కలిసి గోపాల్‌రెడ్డి రెండో కుమారుడు తరుణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ కుట్రలోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తిలో కొంత భూమిని నీ పేరున రాస్తామని ఆశ చూపి అతడిని ఒప్పించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న గోపాల్‌రెడ్డి పొలం వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో రాజశేఖర్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, తరుణ్ కుమార్‌రెడ్డి కలిసి కరల్రు, రాయితో దాడి చేసి అతి కిరాతకంగా ప్రతిభ తన భర్త గోపాల్ రెడ్డిని హత్య చేయించినట్లు సీఐ తెలిపారు. భర్త హత్య విషయం తెలుసుకున్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా ప్రతిభ సంఘటనా స్థలానికి వెళ్లినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె పాత్రపై దర్యాప్తు అనంతరం సెప్టెంబర్ 23న తోకలపల్లి స్కూల్ సమీపంలో ప్రతిభను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాలు, మరో వ్యక్తితో ఉన్న సంబంధం చివరకు ఒక కుటుంబంలో విషాదాన్ని నింపి, ప్రతిభను జైలు పాలయ్యే పరిస్థితికి తీసుకెళ్లాయి. -
బిహార్ మైనర్ బాలిక కేసులో ఊహించని ట్విస్ట్
పట్నా: బిహార్ జముయీలో ఇటీవల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు విచారణలో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు లోతైన విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడైన నందన్ యాదవ్ తండ్రి, గత 23 ఏళ్లుగా పరారీలో ఉన్న నేరస్థుడని తెలిసింది. 23 ఏళ్ల క్రితం రెండు హత్యలు చేసి నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా పోలీసులకు ఆ సమాచారం అందగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఏం జరిగింది?జముయీ జిల్లా ప్రతాప్పూర్ గ్రామంలో 2003, ఏప్రిల్ 3వ తేదీన వ్యాపార వివాదాల కారణంగా డి.పి. యాదవ్, పుణే యాదవ్ అనే ఇద్దరు సోదరులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధితుల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణోరి యాదవ్‌ను ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా పోలీసులకు దొరకకుండా గణోరి యాదవ్ పరారీలో ఉన్నాడు, అయితే అతని కుమారుడి నేరంపై పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తాజాగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.బాలికపై లైంగిక దాడికొద్దిరోజుల క్రితం రోడ్డుపై వెళ్తున్న ఒక పదో తరగతి విద్యార్థిపై దాడి చేసి, అతనితో ఉన్న మైనర్ బాలికను వేధించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో గణోరి యాదవ్ కుమారుడు నందన్ యాదవ్ అరెస్టయ్యాడు. అయితే, పోలీస్ కస్టడీ నుండి తప్పించుకోవడానికి నందన్ యాదవ్ ప్రయత్నించడంతో అతనిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో అతని కాలుకు గాయమైంది. ఈ బాలిక వేధింపుల కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.లాయర్ల దాడిఅయితే ఈ కేసులో నిందిుతుడిగా ఉన్న హరేరామ్ యాదవ్ అనే వ్యక్తిపై కోర్టు ఆవరణలో లాయర్లు దాడి చేశారు. లాయర్లు కాక ముందు తామంతా మనుషులమని ఈ ఘటనతో జముయు ప్రాంతానికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు వచ్చిందని అన్నారు. ఇది చదవండి: బాలికపై లైంగిక దాడి నిందితుడి ఎన్ కౌంటర్ -
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్!
యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్గా అక్కడి అధికారులు నిర్దారించారు.ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఫోన్ చేశారు. అల్విన్ కాల్ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్ పంపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.అల్విన్ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించారు. అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రెండు నెలల తర్వాత.. ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.భార్య, కుమారుడు ఎక్కడ?అల్విన్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఉడుపి పోలీసుల దృష్టికి..అల్విన్ సోదరుడు అనిల్, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.విదేశాల్లో భారతీయుల విషాదం..ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్ కుందర్ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా? -
నన్ను జైల్లోనే చంపేస్తారు
బెంగళూరు: ‘నా బ్యారక్‌లో నైజీరియా మహిళా ఖైదీలు నన్ను హింసిస్తున్నారు. వారు నన్ను చంపేస్తామని చెబుతున్నారు’ అని నటి పవిత్రగౌడ జడ్జి ముందు విలపించింది. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన జైల్లో ఉన్న ఆమె బెయిలు కోసం బెంగళూరు 59 సీసీహెచ్ కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. పవిత్రగౌడ విలపిస్తూ గోడును వెళ్లబోసుకుంది. తన బ్యారక్‌లో నైజీరియా మహిళా నిందితులు ఉన్నారని, గతంలో వేధిస్తున్నారని జైలు అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిసి మరింత సతాయిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పవిత్ర రోదించింది. తనకు చనిపోవాలని ఉందని, విషం కావాలని విలపిస్తూ చెప్పిందని ఆమె న్యాయవాదులు తెలిపారు. హైకోర్టుకు దర్శన్ భార్య రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారతానని ప్రకటించిన ప్రదోశ్‌కు వ్యతిరేకంగా రెండో నిందితుడు, నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడు దర్శన్‌కు శత్రువని, స్వార్థం కోసం అప్రూవర్ అవుతున్నాడని, అనుమతించరాదని కోరారు. -
మాదాపూర్ OYOలో యువతి మృతి.. ప్రియుడే హత్య చేశాడా?
-
ఆ ఎస్ఐని భార్యే సజీవ దహనం చేసింది
సాక్షి, చెన్నై: చెన్నైలో సంచలనం సృష్టించిన ఎస్ఐ రాజ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి విస్మయాన్ని కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన ఈ ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుని ఘాతుకమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన రాజ్ (58) పుదుపేట ఆర్మ్డ్ ఫోర్స్ మోటార్ విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సెల్వ రాణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాలుగు రోజులుగా రాజ్ సెలవులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ ఇంటి మొదటి అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. శరీరం అంతా మంటలతో రాజ్ కేకలు వేయడంతో, సెల్వ రాణి చుట్టుపక్కల వారి సహాయంతో ఆయనను కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. తొలుత రాజ్ పోక్సో కేసులో చిక్కుకున్నాడని, ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు తన ముఖాన్ని దాచుకుంటూ హడావుడిగా ఇంటి నుండి బయటకు పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు సెల్వరాణిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. సెల్వరాణికి గతంలోనే వివాహమై, మొదటి భర్తకు దూరమయ్యాక రాజ్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికి వయసులో 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి..అయితే గత మూడు నెలలుగా సెల్వరాణి సెల్ఫోన్లో ఎక్కువ సమయం గడపడాన్ని రాజ్ గమనించి ప్రశ్నించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆగ్రహించిన సెల్వరాణి తన ప్రియుడు దేవాను ఇంటికి రప్పించి, రాజ్‌కు నిద్ర మాత్రలు కలిపిన ఆహారం తినిపించింది. గాఢ నిద్రలో ఉన్న రాజ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి ఆత్మాహుతి చేసుకున్నట్టుగా నాటకం రచించినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి సెల్వ రాణిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. ఇదీ చదవండి: సాంబారు గిన్నెలో పడి మహిళ మృతి -
బెయిలివ్వరూ.. ప్లీజ్
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ.. తల్లిదండ్రులు, కూతురి యోగక్షేమాలు చూసుకోవలసి ఉన్నందున బెయిల్‌ను మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు చెప్పడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ హత్య కేసు విచారణ సాగుతున్న బెంగళూరు 59న సెషన్స్ కోర్టులో సోమవారం బెయిల్ అర్జీపై వాదనలు సాగాయి. నాపై వచ్చిన ఆరోపణలు అబద్ధం, అనారోగ్య సమస్యలున్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి అని పవిత్ర పేర్కొంది. ఇదీ చదవండి: స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి -
కేతన్ అగర్వాల్ హత్య కేసు: 5,053 పేజీల ఛార్జ్‌షీట్!
పూణె: మహారాష్ట్రలోని పూణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కాబోయే భార్య సియా ప్రవీణ్ గోయల్, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ బాబులాల్ చౌధరి, రితేశ్ సంజయ్ హంగేపై పుణెలోని వడ్గావ్ మావల్ కోర్టులో పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ముగ్గురూ ప్రస్తుతం జైలులో ఉన్నారు.మొదట గాయపర్చాలని.. కేతన్‌ను తీవ్రంగా గాయపర్చేందుకు తొలుత నిందితులు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ఇందుకోసం మహారాష్ట్ర వెలుపల కొందరిని సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యవహారం తర్వాత తమకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చని, పోలీసులకు కుట్ర విషయం తెలిసే అవకాశం ఉందని భావించి ఆ ప్రణాళికను విరమించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో సంప్రదించిన వారిలో ఒకరు ప్రస్తుతం సాక్షిగా ఉన్నారని పోలీసులు తెలిపారు.సినిమాలు, పాడ్‌కాస్ట్‌లతో ప్రణాళిక?ఆ తర్వాత కేతన్‌ను తామే హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు ఆరోపించారు. హత్యల ఆధారంగా రూపొందిన సినిమాలు చూశారని, పోలీసులకు చిక్కకుండా ఉండే మార్గాలపై పాడ్‌కాస్ట్‌లు విన్నారని, మేఘాలయలో రాజా రఘువంశీ హత్య కేసును కూడా పరిశీలించారని తెలిపారు.లోహగఢ్నే ఎందుకు ఎంచుకున్నారు?లొనావాలా పరిసరాల్లోని పలు ప్రాంతాలను నిందితులు పరిశీలించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మే చివర్లో సియా, చేతన్ టైగర్ పాయింట్ తదితర ప్రాంతాలను సందర్శించి ఒంటరి ప్రదేశాన్ని గుర్తించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్లో సీసీటీవీ కెమెరాలు లేవని గుర్తించినప్పటికీ, చివరకు గతంలో ఒక మహిళ మృతి చెందిన ఘటన కారణంగా లోహగఢ్ను ఎంచుకున్నట్లు తెలియవచ్చింది.తొలి ప్రయత్నం విఫలం..జూన్ 14న సియా, కేతన్ లోహగఢ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ సియా.. కేతన్‌ను తోసేందుకు ప్రయత్నించినప్పటికీ అది విఫలమైందని తేలింది. అనంతరం పాము ఉందని చెప్పి అతడిని అంచువైపు వెళ్లేలా చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.నకిలీ ‘మాహి’ ఖాతాతో ఉచ్చులోకి?జూన్ 18న ‘మాహి’ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. పరిచయమున్న ఓ యువతి ఫొటోను ఉపయోగించి రూపొందించిన ఈ ఖాతా ద్వారా కేతన్కు సందేశాలు పంపినట్లు ఆరోపించారు. మాహి తన స్నేహితురాలని భావించేలా చేసి, ఆమె పుట్టినరోజు సర్ప్రైజ్గా జరిపేందుకు సియాను లోహగఢ్‌కు తీసుకెళ్లాలని కేతన్‌ను ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. హంగే రూపొందించిన ఈ ఖాతాను హత్య అనంతరం తొలగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 100 మందికి పైగా సాక్షులను పోలీసులు చేర్చారు. వారిలో ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్లు, ఫొటోలు, కాల్ డీటెయిల్ రికార్డులు, సాంకేతిక విశ్లేషణతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో సమర్పించారు.ఇదీ చదవండి: ఎల్ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే.. -
తల్లిని చంపి.. మృతదేహంపై బిడ్డను వదిలేశారు
రాయచూరు రూరల్: కర్ణాటకలో అత్యంత హృదయ విదారకమైన ఘోరం వెలుగుచూసింది. పొలంలో ఓ వివాహిత హత్యకు గురికాగా మృతదేహంపై చిన్నారి విలపిస్తోంది. తన తల్లి ఎందుకు అలా పడి ఉందో తెలియక, పాల కోసం రోదిస్తూ ఉంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో ఆర్‌హెచ్ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని స్నేహ అమిత్ (26)గా గుర్తించారు. ఏడాదిన్నర కుమార్తె మేఘనను మృతదేహంపై పడుకోబెట్టి హంతకులు పరారయ్యారు. బాలిక ఏడుపుతో హత్య వెలుగులోకి వచ్చింది. స్నేహ తల, గొంతులో కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లున్నాయి. సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వినాయక్, డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ ఘటనాస్థలిని పరిశీలించారు. స్నేహకు అమిత్ అనే యువకుడితో 3 ఏళ్ల కిందట పెళ్లయినట్లు తెలుస్తోంది. అమిత్‌తో పాటు ఆమె స్నేహితుడు శుభం అనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఉత్తరాది నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య
-
వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు!
సాక్షి, నిజామాబాద్: కేవలం పది సెకండ్లలో.. 9 కత్తిపోట్లు. కళ్ల ముందే కొడుకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ ఘటన తాలూకు దృశ్యాలు కళ్లముందు మెదులుతుండటం.. హరిబాబు తల్లి లక్ష్మిని షాక్‌కి గురి చేసింది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు ప్రధాన నిందితుడు, ఆమె భర్త హరిబాబు కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్‌బాస్ తరహా రిక్వెస్టులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. హరిబాబు గురువారం నిజామాబాద్‌లోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు అతడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సెకన్ల వ్యవధిలోనే పదే పదే పొడిచేశారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘హరిబాబును చంపినట్లే.. నన్నూ చంపేస్తారేమో. నన్ను కాపాడండయ్యా’ అంటూ లక్ష్మి ప్రాణభయంతో వణికిపోతూ పోలీసులను ప్రాధేయపడుతోంది. వైషు అమ్మ హత్యకు కారకుడంటూ..జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి ‘వైషు అమ్మ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించేది. ఈ ఏడాది మార్చి 17న ఆమె తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. అప్పటికి ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ కేసులో హరిబాబును పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. అదనపు కట్నం వేధింపుల ఆరోపణలపై అతడి తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్లపైనా కేసులు నమోదయ్యాయి.బెయిల్‌పై బయటకు వచ్చి..వైష్ణవి హత్య కేసులో కొంతకాలం జైలులో ఉన్న హరిబాబు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ప్రాణభయంతో.. తల్లి లక్ష్మితో కలిసి నిజామాబాద్‌కు మకాం మార్చాడు. గురువారం ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఉన్న సమయంలో కారులో వచ్చిన వ్యక్తి అతడిపై దాడి చేసి హత్య చేశాడు. కళ్ల ముందే కొడుకు హత్య.. తల్లికి షాక్కొడుకు హత్యతో లక్ష్మి తీవ్ర షాక్‌కు గురైంది. ఇప్పటికే వైష్ణవి హత్య కేసు కారణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు హరిబాబు కూడా హత్యకు గురికావడంతో ఆమె మరింత భయాందోళనకు గురవుతోంది. తన కొడుకుకు జరిగినట్లే తనకూ ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు హరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యనిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడుఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులుగతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త… https://t.co/8zfUYb4EGU pic.twitter.com/ZEj321W10M— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026పోలీసుల అదుపులో సంతోష్!మరోవైపు హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైష్ణవి సోదరుడు సంతోష్, హరిబాబును తానే హత్య చేసినట్లు చెబుతూ కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో షాకింగ్ కామెంట్లు చేశాడు. ‘‘మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు. మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి. నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి’’ అంటూ వీడియోలో చెప్పాడు. కోరుట్ల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు.నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండిమా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశానుయూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంతోష్తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందని సెల్ఫీ వీడియో… https://t.co/ooYqCBxGiJ pic.twitter.com/2F78UV6lJc— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026సంతోష్ భార్య కూడా.. ‘మా ఆయన హత్య చేయడం కరెక్టా, కాదా మీరే చెప్పాలి..’ అంటూ ఇటు సంతోష్ భార్య కూడా గత రాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది. కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది. నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి’ అంటూ సంతోష్ భార్య ఆ వీడియోలో విజ్ఞప్తి చేసింది. మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలినన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉందినా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి- యూట్యూబర్ వైష్ణవి సోదరుడి భార్య https://t.co/NunTPlhxiJ pic.twitter.com/uVwUvjotF6— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026 VIDEO CREDITS: Telugu Scribe -
వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య!
హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పాల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్‌స్టాప్ సమీపంలో పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్! -
‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’..
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం దారుణ హత్య జరిగింది. ఈ ఏడాది మార్చి 17న భార్య (ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి)ను చంపిన కేసులో నిందితుడు, కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు (27)ను మృతురాలి చిన్నాన్న కుమారుడు గంధం సంతోశ్ నడిరోడ్డుపై నరికి చంపాడు. పట్టణంలోని రాజరాజేంద్ర చౌరస్తా ప్రధాన రోడ్డుపై గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో హరిబాబు మంచినీళ్ల కోసం మరో దుకాణం వద్దకు వెళ్లగా.. కారులో వచి్చన ఓ వ్యక్తి... హరిబాబు మెడ, తలపై పలుమార్లు కత్తితో నరకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు అదే కారులో పారిపోయాడు. అయితే అనూహ్యంగా గురువారం రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసిన నిందితుడు సంతోశ్.. తన చెల్లిని చంపినందుకే హరిబాబును హతమార్చినట్లు పేర్కొన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. అతను కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. హరిబాబును చంపుతామని 15 రోజుల క్రితమే వీడియోల్లో కొందరు హెచ్చరించారు. అన్నట్లుగానే హతమార్చడం గమనార్హం.ప్రేమ పెళ్లి.. ఆపై హత్యతో.. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం రాణి, దుర్గాప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు వైష్ణవి ఉన్నారు. వైష్ణవి (18) యూట్యూబర్‌గా గుర్తింపు పొందింది. ఆమెను కోరుట్లకు చెందిన చిత్తారి హరిబాబు యూ ట్యూబ్ వీడియోల్లో చూసి ప్రేమించానని వెంటబడ్డాడు. ఇద్దరి దీ ఒకే సామాజికవర్గం కావడంతో 2025 ఆగస్టులో పెద్దల అంగీకరాంతో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైష్ణవి, హరిబాబు మాదాపూర్‌లోని అత్తారింట్లో ఉండగా.. కొన్ని రోజులకు ఎక్కడ ఉండాలన్న విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి.అలాగే వైష్ణవి గర్భం దాల్చాక దంపతుల మధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణి అయిన భార్యను మార్చి 17న రాత్రి ఆమె పుట్టింట్లోనే హరిబాబు హింసించి చంపాడు. ఈ కేసులో సుమారు మూడు నెలలపాటు జైల్లో ఉన్న అతను జూలైలో బెయిల్‌పై విడుదలై కొంతకాలం ఏపీలోని బంధువుల వద్ద తలదాచుకున్నాడు. మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటూ కూరగాయలు, మక్కకంకులు అమ్ముతూ జీవిస్తున్న తల్లి లక్ష్మి వద్దకు వచ్చాడు.ఎవరికీ నా చెల్లి గతి పట్టొద్దనే.. ‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దనే హరిబాబును చంపేశా. వైష్ణవి విషయంలో గవర్నమెంట్ నాకు న్యాయం చేయలేదు. నేను కావాలని హత్య చేయలేదు. వేరే పనిపై నిజామాబాద్ వెళ్తే అనుకోకుండా నాకు హరిబాబు కనిపించడంతో చంపేసా. నాకు శిక్ష పడకుండా మీరంతా (ప్రజలు) బయటకు వచ్చి నాకు శిక్ష పడకుండా పోరాటం చేయండి. మీ కాళ్లు మొక్కుతా’ అంటూ గంధం సంతోశ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు అతని భార్య సానియా సైతం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. వైష్ణవిని చంపిన వ్యక్తి చనిపోయినందుకు ఆనందంగానే ఉందని.. అయితే తన భర్త ఇలా చేస్తాడని అనుకోలేదని.. జైలు నుంచి అతను వచ్చేదాకా ప్రజలే తనకు, తన ఇద్దరు పిల్లలకు తోడుండాలని కోరింది.ఇదీ చదవండి: చంపేశారని ఎఫ్ఐఆర్.. ఇన్‌స్టా వీడియోతో బయటపడిన నిజం -
దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?
న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు క్రిమినల్ కేసుల దర్యాప్తులో అనుభవం ఉన్న సీబీఐ అధికారి సీమా పాహుజాకు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనంలోని 12వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా సాలియన్ మృతి చెందింది. ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో ఎవరినీ నిందితుడిగా పేర్కొనలేదు.సీమా పాహుజా ఎవరంటే..ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ క్రైమ్స్ యూనిట్ ఎస్పీగా సీమా పాహుజా పనిచేస్తున్నారు. గతంలో సీబీఐ చండీగఢ్ విభాగంలోనూ సేవలందించారు. హత్రాస్ ఘటన, ఉన్నావ్ అత్యాచార కేసు, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తులతో పాటు సిమ్లాలోని ‘గుడియా’ అత్యాచారం హత్య కేసు దర్యాప్తులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. 2021లో ‘బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్’గా సీమా పాహుజాకు బంగారు పతకం లభించించింది.దిశా సాలియన్ కేసులో దర్యాప్తుదిశా మృతికి సంబంధించిన పాత రికార్డులు, అందుబాటులో ఉన్న ఆధారాలను సీబీఐ బృందం మరోసారి పరిశీలించనుంది. 2020 జూన్ 8 రాత్రి ఆమె కాబోయే భర్త రోహన్ రాయ్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన వారి వాంగ్మూలాలను తొలిదశలో నమోదు చేయనున్నారు. అప్పటి పోలీసు దర్యాప్తు వివరాలు, ఘటనాస్థల రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర పత్రాలను కూడా పరిశీలించనున్నారు. దిశా మృతి జరిగిన కొద్ది రోజులకే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో మృతిచెందారు. రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో వాటి మధ్య సంబంధంపై అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించాయి.ఇదీ చదవండి: ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ! -
గణేశ్ మండపంలో దారుణ హత్య
బిలాస్పూర్: గణేశ్ చతుర్థి వేడుకల సందడి మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద సౌండ్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబల్పురి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సౌండ్ సిస్టమ్ విషయమై అమన్ సూర్యవంశీ (23), ఆకాశ్ సూర్యవంశీ (22) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అది ఘర్షణకు దారి తీసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రేషన్ దుకాణం ఎదుట గణేశ్ ఉత్సవాల కోసం మండపం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు విషయంలో అమన్, ఆకాశ్ మధ్య మాటామాటా పెరిగింది. వివాదం ముదరడంతో అమన్ కత్తి తీసుకుని ఆకాశ్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.సమాచారం అందుకున్న గ్రామస్థులు డయల్-112కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు అమన్ సూర్యవంశీని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.ప్రాథమిక దర్యాప్తులో సౌండ్ సిస్టమ్ విషయంలోనే వివాదం తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడు మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తిగా చెబుతున్నారు. గణేశ్ మండపం సమీపంలోనే హత్య జరగడంతో గ్రామంలో కలకలం రేగింది.ఇదీ చదవండి: గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత! -
ఆ మిస్టరీ వీడకుండానే.. రియా భర్త కన్నుమూత
భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్ స్టేషన్ బయటే చెప్పాడు. చివరకు పోలీస్ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్‌ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.అసలు కేసులో ఏం జరిగింది?గువాహటి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్, అతడి భార్య రియా తాలుక్దార్ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్‌లో దాచాడు.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.‘షుగర్ డాడీ’ ఎవరు?ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.మత్తులోనే హత్య చేసి..అనుమానంతో విచారణలో రమానుజ్.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్కు డ్రగ్స్ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రమానుజ్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.ఇదీ చదవండి: దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు! -
కోర్టుకు దర్శన్ అవసరమా?
బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ కోర్టుకు హాజరు కావడానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద విచారించారు. సాక్షుల విచారణ సమయంలో నిందితుడు దర్శన్ కోర్టులో స్వయంగా హాజరు కావాలని ఆయన న్యాయవాది వాదించారు. జడ్జి స్పందిస్తూ దర్శన్‌ను కోర్టుకు తీసుకొస్తే పోలీసు భద్రత ఇవ్వాల్సి ఉంటుంది, జనం రద్దీని అడ్డుకోవడం కష్టమని అన్నారు. వీలైతే పరప్పన అగ్రహార జైలులోనే విచారణ జరపవచ్చు. వ్యక్తిగత హాజరు కంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చాలా సులువుగా ఉంటుందని తెలిపారు. ఇరువర్గాలూ మాట్లాడుకుని ఒక తీర్మానానికి రావాలని, వాయిదాలకు ప్రతిసారీ నిందితులు రావాల్సిన అవసరం లేదని జడ్జి చెప్పడం గమనార్హం. వన్యప్రాణుల కేసు? మైసూరు జిల్లా టి నరసీపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫౌంహౌస్‌లో గతంలో అరుదైన పక్షులు, వన్యజీవులు ఉన్నట్లు వీడియోలు వచ్చాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. -
12 ఏళ్ల క్రితం హతమైన మహిళ తిరిగి రావడంతో..
ససారం: బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైనట్లు భావించి కేసు నమోదు చేసిన సరస్వతీ దేవి జార్ఖండ్‌లో సజీవంగా కనిపించడంతో అప్పట్లో ఆమె భర్త, మామ, బావతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులపై నమోదైన కేసుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఆగస్టులో దేహ్రీలోని ముఫుస్సిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్రతి బిఘా-దహౌర్ ప్రాంతానికి చెందిన సరస్వతీ దేవి ఇంటి నుంచి అదృశ్యమైంది.ఆమె తన బావతో కలిసి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో ఆగస్టు 22న ఖండా గ్రామం సమీపంలోని కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సరస్వతీ దేవి సోదరుడు ఆ మృతదేహాన్ని తన సోదరిదిగా గుర్తించాడు. అనంతరం పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో సరస్వతీ దేవి భర్త అరుణ్ మెహతా, మామ దిలీప్ మెహతా, బావ గోవింద్ కుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో పలువురు జైలులో, కోర్టు విచారణల్లో సంవత్సరాల పాటు గడిపారు.అయితే ఇటీవల సరస్వతీ దేవి జార్ఖండ్‌లో జీవించి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దేహ్రీ ముఫుస్సిల్ పోలీసులు.. గర్వా జిల్లాలోని కండి పోలీస్‌స్టేషన్ పరిధి లహరి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన పేరును కాంతి దేవిగా మార్చుకుని, రట్టు సింగ్ అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమెను బిహార్‌కు తీసుకువచ్చి ససారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో 2014లో కాలువలో లభించిన మృతదేహం ఎవరిది? దానిని సరస్వతీ దేవిగా ఎలా గుర్తించారు? గుర్తింపు ప్రక్రియలో ఏ విధానాలు అనుసరించారు? వంటి ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.సరస్వతీ దేవికి ప్రస్తుతం 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అతను చిన్నవాడు. జార్ఖండ్‌లో ఆమె సజీవంగా లభించడంతో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసును పూర్తిగా పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువలో లభించిన మృతదేహం గుర్తింపును నిర్ధారించడమే ప్రస్తుతం పోలీసులకు ప్రధాన సవాలుగా మారింది.ఇదీ చదవండి: మేరీకోమ్‌పై బిగ్ బాస్ అభిమానుల ఆగ్రహం -
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్‌పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్‌ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్‌ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్‌ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం -
మంచిర్యాలలో దారుణం.. వివాహితను గొడ్డలితో నరికి చంపిన బంధువు!
తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ వివాహితను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దండేపల్లి మండలం నిల్కి వెంకటాపూర్‌లో సింగతి లక్ష్మి (37) అనే వివాహిత నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆమె బంధువు సింగతి రవి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి చంపాడు. దీంతో సింగతి లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే నిందితుడు హత్యచేసిన వెంటనే ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలోని స్థానికులలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని పట్టుకున్నాకే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. -
లోన్ ఎగ్గొట్టేందుకు మేనేజర్‌నే లేపేస్తే..
ప్రాంటిజ్: గుజరాత్‌లోని ప్రాంటిజ్ తాలూకాలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ మేనేజర్ భరత్ చౌధరి హత్య కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. రూ.6 లక్షల రుణం ఎగ్గొట్టడంతోపాటు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి దక్కించుకునేందుకు ఓ ప్రేమజంట ఈ హత్యకు పథకం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మాణసా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న భరత్ చౌధరి సెప్టెంబర్ 2న అదృశ్యమయ్యారు. అనంతరం లిమ్లా గ్రామం నుంచి వడవాసా వెళ్లే మార్గంలో ఓ కారులో ఆయన మృతదేహం కనిపించింది. ఆయన మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.డిప్యూటీ ఎస్పీ ఏకే పటేల్ వివరాల ప్రకారం.. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు భావన అలియాస్ భావూ ఠాకోర్, ఆమె ప్రియుడు యోగేశ్ ఠాకోర్లపై అనుమానం వ్యక్తం చేశారు. భావనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. భావన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నుంచి రూ.1.50 లక్షలు, యోగేశ్ రూ.4.50 లక్షలు రుణంగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం రూ.6 లక్షల రుణాన్ని చెల్లించకుండా ఉండటంతోపాటు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు ఇద్దరూ మేనేజర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.పథకంలో భాగంగా భావన.. డబ్బులు ఇస్తాననే నెపంతో భరత్‌ను ప్రాంటిజ్కు రప్పించింది. అనంతరం యోగేశ్ ఆయనను కారులో మాణసా నుంచి తీసుకెళ్లాడు. వడవాసా సమీపంలో కారులోనే పదునైన ఆయుధంతో భరత్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత మృతదేహాన్ని, కారును నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేయాలని ఇద్దరూ భావించారు. అయితే లిమ్లా వైపు వెళ్తుండగా కారును రివర్స్ చేసే సమయంలో రహదారి పక్కన ఉన్న గుంతలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు బయటకు రాకపోవడంతో పోలీసులకు చిక్కుతామనే భయంతో మృతదేహంతోపాటు కారును అక్కడే వదిలి ఇద్దరూ పరారయ్యారు.భావన, యోగేశ్ సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భావనను అరెస్టు చేయగా, యోగేశ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు! -
టీవీకే నేత దారుణ హత్య, ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శలు
సాక్షి, చెన్నై: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీలో దుమారం కొనసాగుతుండగా, మరోవైపు టీవీకే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 5న రాత్రి పార్టీకి చెందిన కణ్ణన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. పాత కక్షలతో ఒక ముఠా అతడిని కిరాతకంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కార్ రెంటల్ వ్యాపారం చేసే కణ్ణన్, సెప్టెంబర్ 5న తన స్నేహితులతో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఒక ముఠా ఆయనపై దాడి చేసింది. కత్తిపోట్లతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శాస్త్రి నగర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భరణి, రాకేష్, నరేష్, మణికంఠన్, హరిహరన్ అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.Chennai - TVK functionary S. Kannan was chased and hacked to death by a gang in the Adyar–Besant Nagar area on Saturday night. Police have arrested five men. Kannan was standing near Ellaiamman Koil Street when attackers on two-wheelers surrounded him. He tried to flee, but the… pic.twitter.com/O45DiOOz2b— NextMinute News (@nextminutenews7) September 7, 2026ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం ప్రతీకార హత్యకణ్ణన్పై క్రిమినల్ కేసులతో పాటు, హిస్టరీ షీటర్‌గా రికార్డుల్లో ఉన్నట్లు పోలీసుల తెలిపారు. గతంలో 2009లో భరణి బాబాయి శివను, 2014లో భరణి తండ్రి వేలును కణ్ణన్ బృందం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే భరణి, అతడి అనుచరులు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు తమిళనాడు డీజీపీ ఆదేశాల మేరకు అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్‌తో పాటు శాస్త్రి నగర్ ఇన్స్పెక్టర్ రోహిణిలను వేకెన్సీ రిజర్వ్‌లోకి బదిలీ చేశారు.நாளை மாண்புமிகு முதலமைச்சர் காவல்துறை மானியக் கோரிக்கை விவாதம் மீது பதிலுரை அளிப்பதற்கு முன்பாக அவரது கட்சிப் பிரமுகர் ஒருவரே தலைநகரில் கொலைக்கு ஆளாகியுள்ளார்.அதுவும், தனது உயிருக்குப் பாதுகாப்பு வேண்டி ஆளும் த.வெ.க.வில் இணைந்த சரித்திரப் பதிவேடு குற்றவாளி சாலையில் ஓட ஓட…— Udhay (@Udhaystalin) September 6, 2026మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షణ కోసం అధికార పార్టీలో చేరిన వ్యక్తే వీధిలో దారుణహత్యకు గురయ్యాడని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
భార్య తలను నరికి ఫ్రిజ్‌లో పెట్టి..
గౌహతి: అసోంలోని గౌహతిలోని హాటిగావ్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బసిష్ఠపూర్ బైలేన్లోని ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలిని నూన్‌మతికి చెందిన రియా తాలూక్దార్గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త రామానుజన్ గోస్వామి ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రామానుజన్ స్వస్థలం గౌరీపూర్ అని తెలిసింది.పోలీసులు తెలిపిన వివరాల వివరాల ప్రకారం.. రియా ఫ్యాన్సీ బజార్‌లోని ఏసీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ బొటిక్‌లో పనిచేసేది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఒక్క సోదరుడు మాత్రమే ఉన్నాడు. సోమవారం రియా, ఆమె భర్త మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో రామానుజన్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రియాను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆమె తలను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో ఉంచి ఫ్రిజ్‌లో దాచినట్లు తెలియవస్తోంది. అలాగే ఆమె వేళ్లను కూడా వేరుచేసినట్లు సమాచారం.ఈ హత్యకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)కు తరలించారు. భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: మాంసాహారం వండేవారిపై ధీరేంద్ర శాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
హత్య కేసు నిందితుడికి నడిరోడ్డుపై లాఠీ ట్రీట్ మెంట్
-
తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణ చేయాలని ఆదేశించారు. నర్సు హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని కోరారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లపై విచారణ జరిపించాలన్నారు. సంబంధిత సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని మహిళా ఉద్యోగుల భద్రతా నిబంధనల అమలుపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.అదేవిధంగా నిందితుడిపై పకడ్బందీ దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను వేగంగా సేకరించాలని ఆదేశించారు. సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని న్యాయశాఖ, పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ వేగంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏం జరిగింది?తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానికంగా మెకానిక్‌గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాజాగా దీనిపై సీఎం స్పందించారు. -
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు. -
బావ హత్యకు బావమరిదే సూత్రధారి
గుంటూరు: కిడ్నాప్‌నకు గురైన పాలిష్ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. విచారణలో విజయవాడ రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నాగమహేష్ బావమరిది పగడాల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్‌ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్ అలియాస్ మారుతీని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక క్వారీ వద్ద మృతదేహం నాగమహేష్ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్‌కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్లో పది రోజులు బస చేసి, నాగమహేష్ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్‌పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ -
ఫ్రిజ్‌లో మృతదేహం కేసులో ప్రధాన నిందితుడికి ఊరట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్‌లో కలకలం రేపిన కరీంనగర్ యువకుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై గురువారం తీర్పు వెలువరించింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోగా, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ, పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టులో శిక్ష పడిన నలుగురిని హైకోర్టు విడుదల చేస్తే, వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి, ఒకే వ్యక్తిపై హత్యానేరాన్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏం జరిగిందంటే... జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 2011 జూన్‌లో హైదరాబాద్‌కు వచ్చి అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో, బాధితుడి తండ్రి లక్షన్నర రూపాయలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు శ్రీధర్ మినహా నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. -
AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య
-
హత్యకేసులో అనుచరుడిని రక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు యత్నాలు
కాకినాడ క్రైం: కాకినాడలో ఈ నెల 23న జరిగిన జిమ్‌ట్రైనర్ కొడమటి సతీష్‌రెడ్డి హత్యకేసులో పోలీసుల తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ, కుటుంబసభ్యులు చెప్పారు. కాకినాడ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అనుచరుడైన బోను శ్రీను అలియాస్ కటౌట్ శ్రీను ఈ హత్య చేయించాడని ఆరోపించారు. శ్రీనుని రక్షించేందుకు ఎమ్మెల్యే కొండబాబు పోలీసులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. జయశ్రీ, సతీష్ రెడ్డి తల్లి ఈశ్వరి, కుటుంబసభ్యులు, బంధువులు, సతీష్ రెడ్డి స్నేహితులు సోమవారం హత్యాస్థలంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో రక్తపు మరకలు లేకుండా పోలీసులే కడిగేయడం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో హత్య జరిగితే మూడు గంటలకే.. అంటే గంట వ్యవధిలోనే శుభ్రం చేసేశారని తెలిపారు. పోలీసులు క్రైం సీన్ ప్రొటెక్షన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హత్య జరిగిన చోట మార్కింగ్, డు నాట్ ఎంటర్ బ్యాండ్లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఉదయానికి చూస్తే అసలు అక్కడ హత్య జరిగిందన్న ఆనవాళ్లు కూడా లేవన్నారు.ఈ హత్యచేయించాడని తాము అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడైన బోను శ్రీనును ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తాము కటౌట్ శ్రీను పేరు చెబితే ఓ అధికారి మీడియాకు ఆ పేరు చెప్పొద్దని ఒత్తిడి చేశారన్నారు. శ్రీను ప్రణాళికతోనే సాయికిరణ్ బృందం హత్యచేసిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుడైనందువల్లే పోలీసులు కటౌట్ శ్రీను గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదునెలల గర్భిణిని అయిన తాను, గుండె సమస్యతో బాధపడుతున్న తన అత్త ఈశ్వరి న్యాయం కోసం ఇలా తిరుగుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. కటౌట్ శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించాలని, హంతకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొండబాబు అర్థం చేసుకుని కటౌట్ శ్రీనును రక్షించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్యాలయానికి తరలింపు ఉదయం నుంచి నిరసన చేపట్టిన జయశ్రీ, ఆమె కుటుంబసభ్యులతో పోలీసులు చర్చించారు. మధ్యాహ్నం వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎస్పీని కలిసిన అనంతరం బాధితులు ఆయన సూచనమేరకు కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారు.కటౌట్ శ్రీనును విచారించిన పోలీసులుటీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీనును సోమవారం పోలీసులు విచారించారు. హత్యకు కారకుడని మృతుడు సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. -
AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
-
యోగి సర్కార్‌పై విమర్శల వేళ.. అంకిత్ కేసులో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంకిత్‌పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. సోమవారం వేకువ జామున షామ్లీ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.హరియాణాలో పుట్టి పెరిగిన అంకిత్ బల్యాన్.. యూపీకి వలస వచ్చి స్థిరపడ్డాడు. తొలుత కబడ్డీ ప్లేయర్‌గా రాణించి.. గాయం కారణంగా సంగీతం వైపు మళ్లాడు. యూట్యూబ్ వీడియోలతో పాటు హర్యాన్వీ సాంగ్స్‌తోనూ మాంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆయన వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే.. ఆగస్టు 26న సాయంత్రం షామ్లీ జిల్లా కోత్వాలి పీఎస్ పరిధిలో ఓ జిమ్ బయట అంకిత్ బల్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు.జిమ్ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తున్న అంకిత్‌పై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అంకిత్ వైపు దూసుకొచ్చి వరుసగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. కనీసం 16 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారుఅయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు ఈ ఉదయం ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ల పేర్లు సుమిత్, మోహిత్‌గా పోలీసులు నిర్ధారించారు. అయితే వాళ్లు ఏ గ్యాంగ్? ఎందుకు అంకిత్‌ను హతమార్చారు అనేదానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ఉధృతం చేసినట్లు మాత్రమే వెల్లడించారు.భార్య తీవ్ర హెచ్చరికహత్య అనంతరం అంకిత్ కుటుంబం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంకిత్ భార్య డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో హంతకులను పట్టుకోకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మాహుతికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు.నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు.. అతడికి ఎలాంటి శత్రుత్వం లేదు. అన్యాయంగా అతడిని చంపారు. నా కొడుకును ఎలాగైతే చంపారో.. ఆ హంతకులనూ అలాగే చంపాలి అని సీఎం యోగికి అంకిత్ తండ్రి విజ్ఞప్తి చేశాడు. దీంతో.. పోలీసులు అంకిత్ కుటుంబాన్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు అనుమానితులు ఎన్కౌంటర్లో హతమవడం కేసులో కీలక మలుపుగా మారింది.గోగీ గ్యాంగ్ పేరు తెరపైకిఅంకిత్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తాను హరియాణాలోని సోనిపట్‌కు చెందిన భోలు షాపురి అని చెప్పుకుంటూ.. ఈ హత్యకు గోగీ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించాడు. దీంతో కేసులో గ్యాంగ్‌వార్ కోణం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రకటనను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అంకిత్‌కు ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? గ్యాంగ్ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు అనుమానితుల నుంచి లభించే సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.యోగి సర్కార్‌పై విమర్శలుఅంకిత్ బల్యాన్ హత్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై మరోసారి రాజకీయ దుమారం రేపింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ హత్యపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ హత్య కేవలం నేర ఘటనగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది.ఎవరీ అంకిత్ బల్యాన్?33 ఏళ్ల అంకిత్ బల్యాన్ హర్యాన్వీ సంగీతంలో గుర్తింపు పొందిన గాయకుడు, యూట్యూబర్. షామ్లీకి చెందిన ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సంగీతంలోకి రాకముందు అంకిత్ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నారు. 2013–14 వరకు ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో కబడ్డీకి దూరమై అనంతరం జిమ్‌లో చేరారు. 2022 ప్రాంతంలో హర్యాన్వీ సంగీతంపై దృష్టి పెట్టారు.గాయకుడిగా మాత్రమే కాకుండా గీత రచయితగా, సంగీత స్వరకర్తగా కూడా పనిచేశారు. తన కెరీర్లో 50కి పైగా పాటలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘భారీ కోర్ట్ మే గోలి మారేంగే’, ‘బాడీ బిల్డర్’, ‘పీటీఐ’, ‘ఏక్ ఖటోలా జైల్ కే భీతర్’ వంటి పాటలతో పాపులర్ అయ్యారు. ఆయన పాటలు, వీడియోల్లో తుపాకులు, గొడవలు, గ్యాంగ్‌లు, లగ్జరీ కార్ల ప్రస్తావనలు తరచూ కనిపించేవి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అంకిత్ భావిస్తున్నట్లు గతంలో సమాచారం వచ్చింది.హత్యకు కొన్ని గంటల ముందు..అంకిత్ హత్యకు కొన్ని గంటల ముందే తన కొత్త పాట ‘బేబీ బద్మాష్’కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో హత్యను ప్రస్తావించే కొన్ని పంక్తులను పాడారు. హత్య తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ పాటకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.ఇదీ చదవండి: జాక్‌పాట్ కొట్టిన కానిస్టేబుల్.. ఏకంగా కోట్లలో లాటరీ! -
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్!
బ్రిటీష్ లైబ్రరీలో నాకు ‘ఫన్నీ లైఫ్’ అనే పుస్తకం కనిపించింది. అట్టమీది దృశ్యాన్ని బట్టి అది నాన్ ఫిక్షన్ అని, ఓ సర్కస్ బఫూన్ ఆత్మకథని గ్రహించాను. లోపల అక్కడక్కడా చదివితే అది ఇటలీకి చెందిన బీద భర్త, తన సంపన్న భార్యతో పడక పడ్డ అవస్థలు ఉన్నాయి.ఆమె అతన్ని సరిగ్గా నా భార్య నన్ను చూసేట్లుగా చూస్తోందని కూడా కొన్ని పేజీలు చదివాక తెలుసుకున్నాను. పాపం అతను కూడా నాలా టంగ్ క్లీనర్ కొనడానికి కూడా ఆర్థికంగా భార్య మీద ఆధారపడ్డవాడే.ఓ చిన్న అధ్యాయంలో ఆ బఫూన్ భర్త తన భార్యని చంపే పథకం గురించి ఉంది. భార్య మరణిస్తే మొదటగా పోలీసులు అనుమానించేది భర్తనే. కాబట్టి పట్టుబడని విధంగా భార్యని చంపాలని అనుకున్నాడు. ఆ అధ్యాయంలో దాని గురించి వివరంగా రాశాడు. నేను దాన్ని శ్రద్ధగా చదివాను.ఆ బఫూన్ ఓ లైబ్రరీలో ‘యురోపియన్ పాయిజన్స్’ అనే పుస్తకంలో పోస్ట్‌మార్టంలో బయటపడని ఓ విషం గురించి చదివాడు. పద్దెనిమిదో శతాబ్దంలో వెనిస్ నగరానికి చెందిన ఓ ఇటాలియన్ జిప్సీ మంత్రగత్తె ఎవరూ కనుక్కోలేని విషాన్ని కనిపెట్టి, తమ ఊళ్ళోని భర్తలని చంపాలనుకునే భార్యలకి అమ్మేది. వారు దాన్ని వై¯Œ లో కలిపి తమ భర్తలకి ఇచ్చి చంపేవారు. దాని పేరు ‘వెనీషియన్ విషం.’ అలా ఆమె ఆ విషాన్ని నూటముప్ఫై ఏడుమంది ఇల్లాళ్ళకి అమ్మింది! వారిలో వెనిస్ బయటి ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా అది బయటకి రాకపోవడానికి కారణం, తమ భర్తని చంపడానికి తాము ఆవిడ నుంచి విషం కొన్నామని ఎవరు చెప్తారు? ఆ విషం గురించి వారంతా రహస్యంగా ఉంచారు. ఆ మంత్రగత్తె మరణానంతరమే ఇది బయటపడింది. ఆవిడ మనవరాలు తన అమ్మమ్మ రాసుకున్న డైరీలని చదివినప్పుడు అందులో ఈ ఉదంతం, ఏ తారీకున ఎవరికి, ఎంతకి ఆ విషాన్ని అమ్మిందో వివరాలు రాసి ఉన్నాయి.బఫూన్ భర్తకి ఆ వివరాలు దొరకడంతో ఆ విషాన్ని తయారుచేసి తన భార్యని చంపాడు. ఆ విషం తయారీ పద్ధతి గురించి కూడా రాశాడు. తేలు విషం, మండ్రగబ్బ మాంసం, కరక్కాయ, తెల్ల ఉమ్మెత్త మొదలైనవి వాడాలి. నేనా పేజీని ఫొటో తీసుకున్నాను. దాన్ని శుభం దాకా జాగ్రత్తగా చదివాను. డాక్టర్స్ ఆ విషం గురించి పరిశోధన చేసి, అది పోస్ట్‌మార్టంలో కనుక్కోలేమని నిర్ధారించారని ఆ పుస్తకం చివర్లోని ఎపిలాగ్లో రాశారు. భార్య అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు ముందుగా అనుమానించేది భర్తనే అని చెప్పాను కదా. అది చాలా క్రైమ్ నవలల్లో చదివాను. అదే నన్ను ఇంతకాలం ఆపింది. ఇప్పుడు నాకో దారి దొరకడంతో ఆ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి ఆనందంగా బయటకి నడిచాను.∙∙ నేను ఆ వస్తువులన్నీ ఒకే షాప్‌లో, ఒకే రోజు, ఒకే ఊళ్ళో కొనలేదు. ఆ పుస్తకం రాసిన బఫూ¯Œ లా అనేక ఊళ్ళల్లోని అనేక షాపుల్లో కొన్నాను. వాటిని ఇంట్లో మా ఆవిడ చూడని రహస్య ప్రదేశంలో దాచాను. వంటగదిలోని పై షెల్ఫ్‌లో. ఆ షెల్ఫ్‌పై అర నేల నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్నవి తీయాలంటే ఐదడుగుల అంగుళం ఎత్తుండే మా ఆవిడ నా మీదే ఆధారపడుతుంది. మా మధ్య ఎత్తులోని అడుగుకి నేను కాంప్రమైజ్ అవడానికి కారణం ఆమె సంపదే.అన్నీ సేకరించాక నేను ఫొటో తీసుకున్న పేజీలోని రెసిపీ ప్రకారం సరైన పాళ్ళల్లో, సరైన పద్ధతిలో, సరైన విరామాల్లో, సరైన టెంపరేచర్లలో వాటిని కలిపాను. తర్వాత దాన్ని డిలీట్ చేసేశాను. సంక్రాంతి రోజు తను చేసిన స్వీట్ పొంగల్‌లో మా ఆవిడ తినే బౌల్లో దాన్ని కలిపాను. అది తిన్న నలభై ఎనిమిది గంటల్లో మా ఆవిడ మరణించింది. అందులో రాసినట్లుగానే మరణానికి మునుపు వివిధ లక్షణాలని గమనించాను.ఇలాంటి కథల్లో ట్విస్ట్ చివర్లో వస్తుంది. నా కథలోని ట్విస్ట్ మా మరదలే. తన అక్కని నేను చంపి ఉండచ్చని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమెది తేలు స్వభావం అని తెలుసు కాబట్టి ఇ¯Œ స్పెక్టర్ అది చెప్పినప్పుడు నేను పెద్దగా షాక్ అవలేదు.‘‘పరిశోధించండి. ఆమె చెప్పింది తప్పని ఆమెకి దయచేసి ఋజవు చెయ్యండి.’’ కోరాను.వాళ్ళు నా భార్య దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేశారు. నాకేం కాదనే ధీమాలో ఉన్న నాకు వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. పోస్ట్‌మార్టంలో నా భార్య విషప్రయోగంతో మరణించిందని తేలిందని పోలీస్ డాక్టర్ నిర్ధారించాడు! సీసీటీవీ కెమేరాలు పాడుగాను. ఆ విషానికి అవసరమైన పదార్థాలని నేను కొన్నాననే ఋజువులని కూడా సంపాదించారు. నా నేరం ఋజువయ్యాక నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా సెల్ గార్డ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.‘‘నీకు అవసరమైనప్పుడల్లా నన్ను అడిగితే టైం చెప్తాను.’’ నన్ను సెల్‌లోకి పంపాక తాళం వేస్తూ చెప్పాడు.∙∙ ఆ రోజు లైబ్రరీ అవర్‌లో జైల్ లైబ్రరీలో పుస్తకాల కోసం వెదుకుతూంటే నాకు ఆ బఫూన్ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమే నన్ను జైలుకి పంపిందని జైలుకి వచ్చిన అక్కడున్న ఓ ఖైదీకి చెప్పాను. అతను దాన్ని చదవడానికి తీసుకున్నాడు.మర్నాడు లైబ్రరీ అవర్‌లో ఆ ఖైదీ నవ్వుతూ నాకు ఓ పేజీని చూపించాడు. శుభం తర్వాత నేను చదివిన పుస్తకంలో లేని ఓ కొత్త పేజీ కనిపించింది. అది పబ్లిషర్స్ నోట్. అందులో ఇలా ఉంది.హెచ్చరిక: వెనీషియన్ విషాన్ని ఎవరూ ప్రయత్నించకండి. అది కల్పితం కాదు. ఇప్పుడు పోస్టుమార్టంలో ఆ విషాన్ని కనుక్కోగలుగుతున్నారు.బ్రిటీష్ లైబ్రరీలో నేను చదివిన ఆ పుస్తకంలోని ఈ ఆఖరు కాగితాన్ని ఎవరు, ఎందుకు చింపారో నాకు తెలీదు. వాడివల్ల నేను జీవితఖైదు అనుభవిస్తున్నానని ఆ వెధవకి తెలీదు.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి చదవండి: భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ! -
దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
నగరం చీకటి దుప్పటి కప్పుకున్న వేళ... అక్కడ హాలోవీన్ వేడుకలు మొదలయ్యాయి. వ్యాపారవేత్త చేతన్ విల్లా అంతా వింత ఆకారాలు, భయంకరమైన అలంకరణలతో నిండిపోయింది. మోడల్ నమిత, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ మిత్రా, జర్నలిస్ట్ శుక్లా, నమిత స్నేహితురాలు వినతి, రమ్య అక్కడ చేరారు. అందరూ విభిన్నమైన ఫ్యాన్సీ డ్రెస్సుల్లో, ముసుగుల్లో ఉన్నారు. నమిత తెల్లటి దుస్తుల్లో ప్రేతాత్మలా భ్రమను కలిగిస్తోంది.వేడుక పీక్స్‌కి చేరింది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారర్ ఎఫెక్ట్ కోసం ఇంట్లోని లైట్లన్నీ ఆపేశారు. ఐదు నిమిషాల పాటు అంతా కారుచీకటి. కేవలం భయంకరమైన నవ్వుల సౌండ్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత లైట్లు ఆన్ అయ్యాయి.ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ షాకయ్యారు. హాల్లో ఉన్న సోఫాపై నమిత నిర్జీవంగా రక్తం మడుగులో పడి ఉంది. ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగి ఉంది. ఆ గదిలో మంత్రాల్లా గోడపై రక్తం గుర్తులు రాసి ఉన్నాయి. అక్కడి వారంతా ఇది ‘ఆత్మ చేసిన హత్య’ అని ప్రచారం మొదలుపెట్టారు.∙∙ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు. మీడియాలో ‘హాలోవీన్ రాత్రి ఆత్మ చేసిన హత్య’ అంటూ అప్పటికే రూమర్స్ మొదలయ్యాయి. రక్తం మడుగులో నమిత– లక్షలాది మంది మగవాళ్ల హార్ట్ బీట్. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మోడల్. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపి, అక్కడ ఉన్న ఐదుగురినీ విచారించడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.డైరెక్టరు మిత్రా తన తదుపరి యాడ్ ఫిలింలో చేయమని నమితను కోరితే, ఆమె చేయనంది. అతనికి నమిత మీద పీకల దాకా కోపం వుంది.జర్నలిస్ట్ శుక్లా– నమితకు కెరీర్ మొదట్లో సాయం చేసి, ఫేమస్ చేశాడు. కానీ స్టార్ అయ్యాక నమిత అతన్ని దూరం పెట్టడంతో లోలోపల రగిలిపోతున్నాడు.బిజినెస్‌మేన్ చేతన్ నమితను పిచ్చిగా ప్రేమించి ప్రపోజ్ చేశాడు. నమిత అతని ప్రపోజల్‌ను తిరస్కరించింది. అతని ఈగో దెబ్బతింది.ఇక వినతి, రమ్యలకు పెద్దగా మోటివ్స్ లేవు. అభిమన్యు నోటీసులోకి రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, నమిత గుండెల్లో దిగిన కత్తిని కుడిచేత్తో బలంగా పొడిచారు. రెండు, లైట్లు ఆపే సమయానికి, ఆన్ అయ్యే సమయానికి అందరూ ఒకే చోట ఉన్నారా లేదా?అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలించాడు. గోడపై రాసిన రక్తపు గుర్తులు ఆత్మ చేసిందిగా నమ్మించడానికి కావాలనే రాసినట్టు అర్థమైంది. హాల్లోని స్మార్ట్ హోమ్ లైటింగ్ సిస్టమ్ డేటాను ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. లైట్లు స్విచ్ బోర్డు నుండి కాకుండా, మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ అయినట్లు గుర్తించింది.అభిమన్యు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి. ‘లైట్లు పోయిన ఆ ఐదు నిమిషాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాడు.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని చెప్పాడు. చేతన్ తను అక్కడే వున్నానని చెప్పాడు. లైట్లు ఆఫ్‌లో ఉండటం వాళ్ళ సీసీ కెమెరాలు పని చేయలేదు.అందరి మొహాల్లో టెన్షన్– పోలీసులు సంకెళ్లతో సిద్ధంగా ఉన్నారు. బయట మీడియా హడావుడి. .∙∙ అక్కడ అంతా నిశ్శబ్దం. అభిమన్యు పోలీసుల వైపు చూశాడు.‘మిస్టర్ మిత్రా! పదండి’ అన్నాడు.‘ఎందుకు? మిత్రా అడిగాడు.‘నమితను హత్యకు కారణమైనందుకు’, అని చేతన్ వైపు తిరిగి ‘మిస్టర్ చేతన్! మీరు కూడా... నమితను కత్తితో పొడిచి చంపినందుకు’ అన్నాడు.మిత్రాను, చేతన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.∙∙ మీడియా చుట్టుముట్టింది.‘హత్య జరిగి గంట గడవక ముందే వీళ్ళే హంతకులని ఎలా తెలుసుకున్నారు?’ మీడియా అడిగింది.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని అబద్ధం చెప్పాడు. కానీ ఫోన్లో యాప్ లాగ్స్‌లో అసలు నిజం బయటపడింది.అతడి కుడిచేతికి ఫ్రాక్చరై బెల్ట్ ఉంది. ఎడమచేత్తో అంత బలంగా పొడవడం సాధ్యం కాదు. అప్పుడే సందేహం వచ్చింది. లైట్లను ఆర్పింది మిత్రా... నమితను చంపే ప్రయత్నంలో నమిత గట్టిగా గోళ్లతో గీరింది. చేతన్ కుడి చేతి మణికట్టుపై ఉన్న గాయం, ఆ గోళ్ల ముక్కల్లో ఉన్న చర్మం మ్యాచ్ అయ్యాయి. అతను వేసుకున్న దెయ్యం కాస్ట్యూమ్‌పై నమిత రక్తం చిందింది. వాటిని విల్లా వెనుక డస్ట్ బిన్ లో దాచాడు. దాన్ని నా టీమ్ స్వాధీనం చేసుకుంది’ చెప్పాడు అభిమన్యు.‘హాలోవీన్‌లో కనిపించే ఆత్మల కన్నా మన కళ్ళ ముందు స్వార్థం, ద్వేషంతో ఘోరాలు, నేరాలు చేసే మనుష్యులే అసలైన ప్రేతాత్మలు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.- శ్రీసుధామయిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
అమెరికాలో నిఖిత హత్య కేసులో సాఫ్ట్ వేర్ అర్జున్ అరెస్ట్
-
అమెరికాలో నగర యువతి హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్‌లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి -
45 ఏళ్లకు కానీ తేల్లేదు
న్యూఢిల్లీ: ‘‘కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడు’’అంటారు. దేశంలో కోర్టు కేసులు తేలేందుకు ఏళ్లు పూళ్లవుతున్న నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ నానుడి తాజాగా ఇంకోసారి రుజువైంది. జంట హత్యల కేసులో ఓ వ్యక్తి యాభై ఏళ్లుగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిపై దేశ అత్యున్నత న్యాయస్థానమూ చలించిపోయింది. డెబ్ఫై ఏళ్ల ఆ నిందితుడు సైమన్ సోరేన్ శిక్షను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం’’ఈ ఉదంతమని జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్లుగా ఈ కేసును తేల్చని జార్ఖండ్ హైకోర్టు తీరును కూడా న్యాయమూర్తులు ఆక్షేపించారు. కోర్టులో వినిపించిన వాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యల ప్రకారం... 1981, అక్టోబర్ 18న బిభూతి, బనార్సీ, క్షీర్సాగర్ మండల్లు, మేనల్లుళ్లు జగదీశ్, సత్యనారాయణ్లతో కలిసి వరి కోతల కోసం దుమ్కా జిల్లాలోని భురుండియా గ్రామానికి వెళ్లారు. అదేరోజు కొంతమంది సంతాల్ గిరిజనులు డప్పులు కొడుతూ విల్లు, బాణాలతో, గొడ్డళ్లతో మండల్ కుటుంబీకులు పనిచేస్తున్న పొలాల వద్దకు వచ్చారు. ఈ గిరిజనులు మండల్ కుటుంబ సభ్యులను చంపాలంటూ పిలుపునిచ్చారు. పారిపోతూండగా వెంటబడ్డ జేథున్ సోరేన్, సైమన్ సొరేన్ పేరున్న గిరిజనులు బిభూతి మండల్, బనార్సీ మండల్లపై బాణాలతో దాడి చేశారు.ఆ తరువాత బిభూతి, బనార్సీ మండల్లు ఇద్దరూ కిందపడిపోగా జెథున్, సైమన్లు వారిని నరికి చంపారని ప్రత్యక్ష సాక్షులు జగదీశ్, సత్యనారాయణలు తెలిపారు. ఈ ఘర్షణ, జంట హత్యలపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు గిరిజనులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అభియోగాలు నమోదు చేయకముందే ఇద్దరు నిందితులు మరణించారు. ఆ తరువాత విచారన పూర్తయ్యేందుకు ఏకంగా పన్నెండేళ్లు పట్టింది. 1991లో ఛార్జ్‌షిట్ నమోదైతే 2002లో శిక్షలు ఖరారయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ కేసు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ఐదుసార్లు బదిలీ అయింది. నిందితులు కొందరు ఆరేళ్లపాటు పరారీలో ఉండటమూ తోడై విచారణలో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే ఈ పన్నెండేళ్లను మినహాయిస్తే మిగిలిన సమయంలోనైనా కేసు విచారణ ఎందుకు ఒక కొలిక్కి రాలేదన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయిన తరువాత ట్రయల్ కోర్టు 2002లో జీవించి ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షగా విధించింది. నిందితులు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు కానీ.. కేసు అక్కడ పెండింగ్‌లో ఉండగానే ముగ్గురు మరణించారు. దీంతో సైమన్ సోరేన్ ఒక్కడే మిగిలిపోయాడు. సుమారు 22 ఏళ్ల తరువాత జార్ఖండ్ హైకోర్టు 2024 అక్టోబరు 28న సైమన్ సోరేన్ అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్‌కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. అప్పటికి సోరేన్ వయసు దాదాపు డెబ్భై ఏళ్లు! అనేక అనారోగ్యాలతో బాధపడుతూ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీలోకి వెళ్లారు.కస్టడీలో రెండేళ్లు మాత్రమేసైమన్ సోరేన్‌కు శిక్ష ఖరారైన తరువాత కస్టడీలో ఉన్నది కేవలం రెండేళ్ల నాలుగు నెలలు, 12 రోజులు మాత్రమేనని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు 19న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్ల ధర్మాసనం తుది తీర్పునిస్తూ... దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని’’ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. నేరానికి శిక్ష పడేందుకు విచారణ పేరుతో 22 ఏళ్లు పడితే.. అప్పీళ్లలో ఇంకో 22 ఏళ్లు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. సైమన్ సోరెన్ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరానికి పాల్పడకూడదనే షరతుతో, వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెపె్టంబరు 18కి వాయిదా వేసింది. -
ఫ్రిడ్జ్‌లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడి కిడ్నాప్, హత్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల లేమిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పును వాయిదా వేసింది.సుప్రీంలో సుదీర్ఘ వాదనలు..విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోయాడని, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ.. పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. ఘట నా స్థలంలోని ఫ్రిడ్జ్‌పై ఉన్న వేలిముద్రలు శ్రీధర్వేనని ఫొరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందన్నా రు. ఘటనకు ముందు బాధితుడిని నిందితుడే ప్లాట్‌కు తీసుకెళ్లడాన్ని వాచ్‌మన్ చూశాడని, మృతుడికి చెందిన ఆర్టీసీ బస్ పాస్ కూడా నిందితుడి వద్దే లభ్యమైందని కోర్టు దష్టికి తీసుకొచ్చారు.ధర్మాసనం వ్యాఖ్యలు..వాదనలు విన్న జస్టిస్ పార్దివాలా ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టు శిక్ష పడిన నలుగురిని హై కోర్టు విడుదల చేస్తే వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి.. ఒకే వ్యక్తిపై హత్యానేరా న్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఇంటి ఓనర్‌కు నిందితుడు ఎవరో తెలియదని, కేవలం వాచ్‌మన్ మాత్రమే చూశానని చెప్పడాన్ని ‘లాస్ట్ సీన్’ కింద మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మృతుడికి చెందిన బస్ పా స్ నిందితుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. సరైన ఆధారాలు నిరూపించకుండా 16 ఏళ్లుగా ఒక వ్యక్తి జైలులో ఉండటంపై స్పంది స్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో ఏం జరిగిందంటే..: 2011 జూన్‌లో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్‌కు వచ్చి అదశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడి తండ్రి రూ.1.50లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ప్లాట్లోని ఫ్రిడ్జ్‌లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాలకు సంబంధించి 65–బీ సర్టిఫికెట్ లేకపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో హై కోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్లాట్ అద్దెకు తీసుకున్నది, బాధితుడిని చివరిసారిగా అక్కడికి తీసుకెళ్లింది శ్రీధర్ కావడంతో సెక్షన్ 106 కింద అతడి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీ ర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం -
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్‌కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్‌పూర్‌లోని దాస్‌పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్‌పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
రూపారెడ్డి కేసులో ట్విస్ట్.. మైనర్ల మైండ్ లో ఇంత దారుణమైన ప్లానా?
-
హర్దీప్ నిజ్జర్‌ను చంపింది మేమే
న్యూఢిల్లీ: కెనడాలో 2023లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు తనదే బాధ్యతని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించుకున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం డ్రగ్స్ దందాను నిజ్జర్ ప్రోత్సహిస్తున్నందుకే నిజ్జర్‌ను తన ముఠా చంపిందని తెలిపాడు. యూకేకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్ సింగ్ పమ్మాతో కొంతకాలం క్రితం గోల్డీబ్రార్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బ్రార్ ఇందులో నిజ్జర్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందో పమ్మాకు చెప్పాడు. ‘టీనేజర్లను బెదిరించి డ్రగ్స్ దందాకు వాడుకున్నాడు. వారితో కావాల్సినవిధంగా పనులు చేయించుకునేవాడు. ఆయుధాల స్మగ్లింగ్‌తో అతడికి సంబంధాలున్నాయి. అందుకే చంపేశాం’అని బ్రార్ అంటున్నట్లుగా అందులో ఉంది. కాగా, 2023 జూన్ 19వ తేదీన ఓ గురుద్వారా వద్ద హత్యకు గురయ్యాడు. ఇది భారత ప్రభుత్వం చేయించినపనే అంటూ అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు ప్రకటించడం గమనార్హం. -
నలభై రెండేళ్లకు చిక్కాడు
న్యూఢిల్లీ: ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నలభై రెండేళ్లు పోలీసుల కళ్లుకప్పాడు ఆ వ్యక్తి. ఎప్పుడో 1984లో ఢిల్లీలో హత్య చేసి పారిపోయిన నత్తూ అలియాస్ నథూలాల్ చివరకు 2026 ఆగస్టు 18న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు చిక్కాడు. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన నత్తూలాల్ ఢిల్లీలో ఉండేవాడు. 1984 మే 23వ తేదీ సీతాపూర్‌కు చెందిన మిత్రుడు బభూతి ప్రసాద్‌తో కలిసి ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో అశోక్ కుమార్ అనే వ్యక్తిని చంపాడు. అశోక్ కుమార్ ఒంటిపై బోలెడన్ని కత్తిపోట్లు కనిపించాయి. ఈ విషయమై జనక్‌పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కూడా. కేసు విచారించిన పోలీసులు బభూతి ప్రసాద్‌ను అరెస్ట్ చేసి నేరం చేసేందుకు వాడిన కత్తిని కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి నత్తూ మాత్రం కనిపించకుండా పోయాడు. ఎలాగైనా ఈ పాత కేసును పరిష్కరించలని అనుకున్నారో ఏమో కానీ... నత్తూ అరెస్ట్ కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత కేసు రికార్డులను నెలలకొద్దీ పరిశీలించి... సీతాపూర్, హర్దోయి ప్రాంతాల్లో తనిఖీలు చేసి నత్తూ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల హర్దోయిలోని పాలి ప్రాంతంలో వెరిఫికేషన్ జరుగుతూండగా నత్తూ బతికే ఉన్నట్లు, అప్పుడప్పుడూ సొంతూరుకు వచ్చిపోతున్నట్లు పోలీసులకు తెలిసింది. నత్తూ పోలికలతో ఉన్న వ్యక్తి గురించి ఆగస్టు 17న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెంచారు. ఆ మరుసటి రోజే నత్తూ తన ఊరి నుంచి ఫరూకాబాద్ వెళ్లేందుకు ప్రయతి్నస్తూండగా పట్టుబడ్డాడు. -
రూపా రెడ్డిని చంపేసి గోవాలో జల్సాలు.. దిమ్మతిరిగే మర్డర్ ప్లాన్
-
పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
సాక్షి,న్యూఢిల్లీ: భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం ఒక యువ టెకీని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి తన భార్యతో ఇంట్లో వచ్చిన వివాదంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో అది తీవ్రరూపం దాల్చింది. వీరి దాడిలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా హత్యకు గురైన సంఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం మృతుడిని లక్ష్మీ పార్క్ నివాసి, నోయిడాలోని 'అడోబ్' (Adobe) సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)గా గుర్తించారు. కాగా వినయ్‌కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల వయసున్న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారు.ఏం జరిగింది?ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించగా, వారు నిహాల్ విహార్‌లోని వినయ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన విజిటర్స్ కోసం నీళ్లు, అల్పాహారం తీసుకురావడానికి వినయ్ తల్లి బయటకు వెళ్లిన సమయంలో, భార్య తరఫు బంధువులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి వచ్చి అడ్డుపడి, ఆపమని బ్రతిమాలినా వినకుండా దాడిని కొనసాగించారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్‌ను ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మృతుడి భార్యతో పాటు మరో ఆరేడుగురిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
105 ఏళ్ల దోషికి సుప్రీం సాయం
న్యూఢిల్లీ: హత్య కేసులో దోషిగా నిర్ధారితమైన వ్యక్తికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ ఖరారు చేసింది. మిగిలిన శిక్షకాలాన్ని కూడా మాఫీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తుదితీర్పునిస్తూ.. పిటిషనర్ వయసును పరిగణలోకి తీసుకుని కేసు మూసివేయాలని తీర్మానించినట్లు తెలిపింది. శిక్షాకాలం ఏదైనా మిగిలి ఉన్నా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘జీవితఖైదు అవధి ముగియకున్నా అతడిని మళ్లీ కస్టడీలోకి తీసుకోకూడదు’’అని సీజేఐ స్పష్టం చేశారు. 2024లో ఇచి్చన మధ్యంతర బెయిల్‌ను పూర్తిస్థాయి, చివరి బెయిలుగా ఖరారు చేసింది. ‘‘మధ్యంతర ఉత్తర్వు రూపంలో రసిక్ చంద్ర మోండల్ మధ్యంతర బెయిల్/పెరోల్ కింద విడుదల అవుతారు. అతడిపై ప్రస్తుతమున్న రిట్ పిటిషన్ తేలేంతవరకూ ట్రయల్‌కోర్టు తగిన షరతులు విధించవచ్చు’’అని వివరించింది. 1988లో అరవై ఎనిమిదేళ్ల వయసులో రసిక్ చంద్ర మోండల్‌పై హత్యాభియోగం నమోదు కాగా కోర్టు అతడిని 1994లో దోషిగా నిర్ధారించింది. సుదీర్ఘమైన జైలు శిక్ష తరువాత సుప్రీంకోర్టు అతడికి 2024 నవంబరు 29న బెయిల్ మంజూరు చేసింది. 1920లో పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో జన్మించిన మోండల్ వయసు ఇప్పుడు 105 ఏళ్లు. హత్యాభియోగాన్ని సవాలు చేస్తూ మోండల్ వేసిన కేసును కలకత్తా హైకోర్టు 2018లో కొట్టివేయగా ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. -
మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్య
నాగపూర్‌లోని నరేంద్ర నగర్ పరిధిలో ఉన్న సుందర్బన్ ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. రెండు వారాల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన రౌడీషీటర్ గౌరవ్ పంకజ్ రాగ్డే (27) హత్య స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుడు, తోటి గ్యాంగ్‌స్టర్ గౌరవ్ రాంభావో రౌత్ చేతిలోనే అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. ఒకమహిళతో వీరిద్దరికీ ఉన్న సన్నిహిత సంబంధిత వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుడు గౌరవ్ రాగ్డే ప్రముఖ గ్యాంగస్టర్ గమ్ఛు హత్య కేసుతో పాటు పలు దోపిడీ, హత్య, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిపై అజ్నీ పోలీస్ స్టేషన్లో దాదాపు 9 కేసులు నమోదు కాగా, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే రాగ్డే జైలులో ఉన్న సమయంలో అతడి ప్రేమికురాలు 'రాణి' (పేరు మార్పు)తో గౌరవ్ రౌత్‌కు పరిచయం ఏర్పడి, అది సాన్నిహిత్యానికి దారితీసింది. నేర ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్న రాణి, రౌత్‌తో కలిసి నరేంద్ర నగర్లో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించి, సమీపంలోనే ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. గురువారం మధ్యాహ్నం, రాణి గౌరవ్ రౌత్ ఇంటికి వెళ్లింది. అక్కడ రౌత్ ఇతర స్నేహితులు కూడా ఆమెతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాగ్డే తీవ్ర ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నాడు. తలుపులు మూసి ఉండటంతో మద్యం మత్తులో ఉన్న రాగ్డే, రాళ్లతో దాడి చేసి, ఇంట్లోని అద్దాలను ధ్వంసం చేస్తూ గొడవకు దిగాడు.దీంతో రౌత్ తన అనుచరులతో కలిసి ఇంటి వెనుక తలుపు గుండా తప్పించుకునేందుకు యత్నించగా, రాగ్డే వారిని వెంటాడాడు. సుందర్బన్ నాలా వద్ద ఉన్న ఒక వంతెన సమీపంలో వీరి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాగ్డే కిందపడిపోగా, రౌత్ తన అనుచరుడు అభిషేక్ వాస్నిక్‌తో కలిసి రాగ్డే చేతిలో ఉన్న కత్తిని లాక్కుని అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాగ్డే అక్కడికక్కడే కూలిపోగా, నిందితులు పరారయ్యారు.నిందితులైన రౌత్, వాస్నిక్ కూడా వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నాసినిమా ఫక్కీలో పోలీసుల ఛేజింగ్పెట్రోలింగ్లో ఉన్న అజ్నీ పోలీస్ స్టేషన్ సిబ్బంది మనీష్ భాల్మే, నరేష్ సావన్కర్ తక్షణమే స్పందించారు. కానిస్టేబుల్ మనీష్ భాల్మే సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి నిందితుడు గౌరవ్ రౌత్‌ను పట్టుకున్నాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’గొడవ అజ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభమై, హత్య బెల్తరోడీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును బెల్తరోడీ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకాలు!
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన హైదరాబాద్, కడప ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా సాగుతున్న వివేకా హత్య కేసులో మరో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి రావడంపై రాజకీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల పేరుతో కూటమి ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెర తీసిందా?అనే చర్చ జోరందుకుంది. .వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ఏపీ, తెలంగాణలో పది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో రెండు, వైఎస్సార్ జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్‌తో పాటు శంకర్‌రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. అటు పులివెందులలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈడీ ఎందుకు?వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి ఇప్పటికే చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. 2026 మార్చిలో సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది మూడో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలైనట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు అవసరం లేదన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన మరింత దర్యాప్తు కోరిన పిటిషన్‌ను పక్కన పెట్టింది. ఇలాంటి సమయంలో వివేకా హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.‘మళ్లీ ఇదేంటి?’వివేకా హత్య కేసు ఇప్పటికే సుదీర్ఘకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు కేంద్రంగా ఉంది. సీబీఐ దర్యాప్తు, చార్జ్షీట్లు, కోర్టు విచారణల తర్వాత ఇప్పుడు ఈడీ సోదాలు జరగడంతో.. ఇదే కేసును మరో కోణంలో మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసు.. మళ్లీ ఫోకస్‌లోకి2019 మార్చిలో పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం సీబీఐకి కేసు అప్పగించారు. 2020లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2021లో తొలి చార్జ్‌షీట్, ఆ తర్వాత అనుబంధ చార్జ్షీట్లు దాఖలయ్యాయి. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని 2022లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. విచారణ ముగించామని, ఇంక లోతైన దర్యాప్తేదీ అవసరం లేదని చెప్పినా.. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: దమ్ము లేని ప్రభుత్వమిది -
డాక్టర్ ప్రియాంక హత్య కేసు: 16 ప్రశ్నలు.. కీలక విషయాలపై ఆరా!
సాక్షి, తూర్పుగోదావరి: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీ విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది.16 ప్రశ్నల్లో 6 పూర్తి..ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 16 కీలక ప్రశ్నలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 6 ప్రశ్నలకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. నిందితులు ఇచ్చే సమాధానాలను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇతర కీలక అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా ప్రకాష్‌నగర్ సీఐ బాజీ లాల్‌ను ఉన్నతాధికారులు తప్పించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఈ నిందితులను విచారిస్తున్నట్లుగా ఏఎస్పీ దేవరాజ్ తెలిపారు.రేపు ఉదయం కస్టడీ పూర్తి..ప్రస్తుతం రెండవరోజు కొనసాగుతున్న నిందితుల పోలీస్ కస్టడీ గడువు రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. దీంతో కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహేష్‌బాబు సినిమా చూసి.. హత్యకు స్కెచ్!
మంచి కంటే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే సినిమాల్లోనూ హీరోలను గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా చూపించే ట్రెండ్ పెరుగుతోంది. తెరపై చూపించే క్రైమ్ సన్నివేశాలు, వాటి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సందేశాత్మక చిత్రాల నుంచి కూడా చెడునే స్వీకరిస్తుండడం.. ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేరళలో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరలేపింది. తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమా.. అక్కడ ఓ దారుణ హత్యకు స్ఫూర్తినివ్వడమే అందుకు కారణం. కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగిన 65 ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ దొంగతనం కేసుగా మొదలైన ఈ ఘటన వెనుక.. మొదట ప్రొఫెషనల్ హంతకుల ప్రమేయం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే మైనర్లు, అందునా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా నిర్ధారించుకున్నారు. అయితే తన తాత హత్యకు 13 ఏళ్ల మనవరాలే సహకరించడం.. ఈ కేసులో మరో కీలక అంశంగా వెల్లడైంది. కరువత్తలో శివన్కుట్టి(65) హత్య కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హత్యకు 2017లో విడుదలైన ‘స్పైడర్’ చిత్ర స్ఫూర్తిగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో దర్శకనటుడు ఎస్జే సూర్య.. సైకో విలన్ పాత్ర భైరవలో అలరించాడు. మురగదాస్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే సూర్య విలనిజానికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదుగో ఆ క్యారెక్టర్ నుంచి.. అందునా ఓ సీన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని.. ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సినిమా చూసి హత్యకు ప్లాన్?పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు తొలుత శివన్కుట్టి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాలని భావించారు. నిద్రలో ఉన్న సమయంలో పెద్ద రాయితో దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు 2017లో వచ్చిన తమిళ సినిమా ‘స్పైడర్’లోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇంటి పైకప్పు కింద చెక్కతో నిర్మించిన సీలింగ్ ఉండటంతో వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.వాట్సాప్ చాట్లే కీలక ఆధారంఈ కేసులో కీలక ఆధారాలు నిందితుల వాట్సాప్ సంభాషణల ద్వారా లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మనవరాలు, ఆమె స్నేహితుడి మధ్య జరిగిన చాట్లలో హత్యకు సంబంధించిన పలు ప్రణాళికలు చర్చించినట్లు గుర్తించారు. విషం పెట్టడం, వాహనంతో ఢీకొట్టడం వంటి పద్ధతుల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరునాగప్పల్లి ప్రాంతానికి చెందిన ఓ కిరాయి ముఠాను సంప్రదించి హత్య చేయించేందుకు ప్రయత్నించారని.. అయితే డబ్బు ఆఫర్ చేసినా ఆ ముఠా అంగీకరించలేదని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.రాత్రి రైల్లో వచ్చి.. దాడిపోలీసుల ప్రకారం.. నిందితులు శనివారం రాత్రి కొల్లం నుంచి రైలులో కరువట్టకు చేరుకున్నారు. శివన్కుట్టి నిద్రపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పైకప్పు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత.. వెంటిలేటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరు ఇంట్లోకి వెళ్లి తలుపు తెరవడంతో మిగతావారు లోపలికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని శివన్కుట్టి లేచి రావడంతో ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత లైవ్ మర్డర్ ఫొటోలను బాలికకు నిందితుడు పంపించాడు.ఐఫోన్, బైక్‌ల కోసం దొంగతనం?హత్య తర్వాత ఇంట్లో ఉన్న ఆరు సవర్ల బంగారాన్ని నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారాన్ని అమ్మి బాలికకు ఐఫోన్, ఇతర నిందితులకు బైక్‌లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంతలో పోలీసులకు దొరికిపోయాడు.తప్పుడు కథనం సృష్టించారా?కేసు దర్యాప్తులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివన్కుట్టి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే అది నిజమైన కారణమా? లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు సృష్టించిన కథనా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.కుటుంబంతో కలిసి జీవనం..శివన్కుట్టి కుటుంబం రెండేళ్ల క్రితం కొల్లం నుంచి కరువట్టకు మారింది. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు తొలుత అద్దె ఇంట్లో ఉండేవారు. అనంతరం శివన్కుట్టి అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఘటనలో చిన్న వయసులో ఉన్న నిందితులు ఇంత పక్కా ప్రణాళికతో.. అదీ సినిమా చూసి హత్యకు పాల్పడ్డారన్న విషయం కేరళలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. -
పెద్ద ప్లాన్ వేసి.. చిన్న తప్పుతో దొరికేశారు
-
9 ఏళ్ల బాలికపై హత్యాచారం : గ్రామంలో ఉద్రిక్తత
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పైగా బాలిక కనిపించడం లేదన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో నిందితుడు కూడా వారితో కలిసి వెతుకుతూ నాటకం ఆడాడు. చివరికి పోలీసులు అతని యవ్వారాన్ని బయటపెట్టారు. ఈ ఘటన జున్నార్ తాలూకా పింపాల్వండి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. ఈ కేసును వేగంగా విచారించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూణే-నాసిక్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. అసలేం జరిగింది అంటేపోలీసుల సమాచారం ప్రకారం బాధిత చిన్నారి 4వ తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా, ఆమె అనారోగ్యం వల్ల ఆ రోజు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన పొరుగింటి 25 ఏళ్ల కీచకుడు సాహిల్ ఖైరే ఆమెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది తెలియని తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం గాలించి, ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అప్పటివరకూ నిందితుడు సాహిల్ కూడా ఏమీ ఎరగనట్టుగా వీరితో పాటే ఉండటం గమనార్హం.అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించగా, సైకిల్‌పై వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తిని సాహిల్ ఖైరేగా గుర్తించి ప్రశ్నించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతడు చూపించిన ప్రదేశం (ఓ వాగు వద్ద ఉన్న చెట్టు కింద) నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి: ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్ఆందోళనలు-ఉద్రిక్తతఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పుణే-నాశిక్ రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని ఉరితీయాలని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి 15 రోజుల్లోగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్పందనఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, పుణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్‌తో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య -
BIG BREAKING.. రూపారెడ్డిని చంపింది విద్యార్థులే..
-
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, నల్లగొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 11న జరిగిన ఈ హత్యకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ విద్యార్థి ప్రధాన నిందితుడిగా, మరో ఇద్దరు విద్యార్థులు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రూపారెడ్డి హత్యకు విద్యార్థులు గంజాయి సేవించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కొద్ది రోజుల క్రితం కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా రూపారెడ్డి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారిని మందలించడంతో పాటు, వారు గంజాయి సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా రూపారెడ్డి వద్ద ఉన్నట్లు సమాచారం. దీంతో తమను ఎక్కడ బయటపెడతారోనన్న భయంతో విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో గ్లౌజులు, మాస్కులు ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థులు.. కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 80 మందిని విచారించిన పోలీసులు.. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థుల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే విద్యార్థుల ప్రమేయం, హత్యకు గల కారణాలు, నగదు చోరీకి సంబంధించిన అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ప్రిన్సిపాల్‌ని చంపింది పదో క్లాస్ కుర్రాడే
నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో వారం రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హంతకుడు పదో తరగతి చదువుతున్న వంశీగా గుర్తించారు. ఇతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్య ఎందుకు చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది.మృతురాలు కల్లు రూపారెడ్డి.. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్. ఈమె తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించారు.సీసీ ఫుటేజీలని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గత శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అలా ఇప్పుడు ఎట్టకేలకు నిందుతుల్ని కనిపెట్టారు. -
ప్రియురాలిని చంపి.. గోనె సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు
హైదరాబాద్: నగర యువకుడి చేతిలో బిహార్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన మేరకు.. పాటా్నకు చెందిన రెహానా (21) తల్లిదండ్రులతో కలిసి ఒరంగడ్డలోఉంటోంది.ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పని చేసేది. ఈ క్రమంలోనే ఫంక్షన్ హాళ్లకు ఫిల్టర్ వాటర్ సరఫరా చేసే షాహిన్‌నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (21)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాము పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో రెహానా తండ్రి ఇషాక్ ఆరు నెలల క్రితమే కూతురుఉన వదిలేసి కుటుంబంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. నాలుగు నెలల పాటు ప్రేమికులిద్దరూ రహస్యంగా కలిసి ఉన్నట్లు సమాచారం. రెండు నెలలు క్రితం రెహానాను నేరుగా తన ఇంటికి తీసుకెళ్లిన అహ్మద్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెహనా గర్భం దాల్చింది. ప్రస్తుతం రెండునెలల గర్భవతి. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన అహ్మద్ కత్తితో రెహానా వీపు భాగంలో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన తల్లి ఆయేషాతో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, మాయం చేసేందుకు పరిచయస్తుల సాయం కోరాడు. విషయం బయటకు రావడంతో స్థానికులు డయల్– 100కు ఫోన్ చేసి, సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బెడ్రూంలో మూటకట్టి పెట్టిన మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, క్లూస్ టీమ్‌తో ఆధారాలు, బ్లడ్ శాంపిళ్లను సేకరించారు. పరారీలో ఉన్న తల్లీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మద్యం మత్తులో మృత్యు క్రీడ
బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో జరిగాయి. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ రోడ్డులో ఉంటున్న హైమావతికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటసుబ్బయ్య (45)కు వివాహమైంది. ఇతడికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు ఇతన్ని వదిలి వెళ్లిపోయారు. చిన్నకుమారుడు సురేష్ కూడా మద్యానికి అలవాటు పడడంతో భార్య, ఇద్దరు పిల్లలు విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు తల్లి దగ్గరే ఉంటున్నారు. శనివారం రాత్రి సురేష్ చికెన్ పకోడి తెచ్చుకున్నాడు. శనివారం చికెన్ తేవద్దని అమ్మ నాకు చెబుతూ ఉండేదని, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని వెంకటసుబ్బయ్య మద్యం మత్తులో చికెన్పకోడీ, సురేష్ భార్య గురించి అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం వెంకటసుబ్బయ్య మద్యం తాగి, భోజనం చేసి మంచంపై నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై కొట్టాడు. తల్లితో వాడు చచ్చాడో లేదో చూడుపో అన్నాడు. బయట ఉన్న తల్లి హైమావతి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు సురే‹Ùను పోలీసులు అదుపులోకి తీసుకుని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్రతో భార్యను హతమార్చిన భర్త మరో ఘటనలో అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామానికి చెందిన గెమ్మెలి కామయ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలి (40)తో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరి కోట్లాటకు దారి తీసింది. మత్తులో ఉన్న కామయ్య విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో భార్య మెడపై, శరీరంపై కర్రతో బలంగా మోది హత్య చేసి పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తండ్రిని చంపిన కొడుకు బేతంచెర్ల: కొడుకు దాడి చేయడంతో తండ్రి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆకుల శివకుమార్(49) తరచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. శనివారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచి్చ, భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా కుమారుడు శరత్ కుమార్ అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన శరత్ కుమార్ తండ్రిపై కట్టెతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
సిద్దిపేటలో లేడీ కిల్లర్
సిద్దిపేటకమాన్: డబ్బు, బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు భూంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే అతికం విజయ (45)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణ దుకాణం, టీస్టాల్ నిర్వహిస్తున్నారు. రజిత భర్త అనారోగ్యంతో బెడ్‌పై ఉంటున్నాడు. రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గర్లో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణ షాప్‌నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్ఎల్ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఏడాది మే 28న వీరి ఇంటి దగ్గర్లో నివాసముండే కుంట రేఖ కూడా కిరాణ షాపునకు రాగా ఆమెను కూడా హత్య చేసి, అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాల్చివేశారు. 2025 జూన్‌లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి 5 తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశారు. మరో నలుగురు మహిళలను కూడా హత్య చేసి, వారి నుంచి బంగారం చోరీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టు పోలీసుల విచారణలో చెప్పింది. అయితే అనారోగ్యంతో మంచంపై ఉన్న భర్తను కూడా హత్య చేయాలని నిందితురాలు ప్రణాళిక రచించిందని, ఇందుకు ఇన్సూరెన్స్ చేయించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని ఆమె నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యల కోసం కుమారుడికి జిమ్ ఏర్పాటు..మహిళలను హత్య చేయడానికి కుమారుడిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. దుకాణంలోనే జిమ్‌ను ఏర్పాటు చేయించి కొడుకుతో వ్యాయామం చేయించేది. దుకాణంలో పలు రకాల వ్యాయామ పరికరాలను పోలీసులు గుర్తించారు. -
క్లూ..! హత్యకు టూత్‌పిక్ సాక్ష్యం!
డిటెక్టివ్లు ఇద్దరూ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయ్ చెప్పిన అడ్రస్‌కి చేరుకున్నారు.హతుడి శవం బెడ్రూమ్లో మంచంమీద ఉంది. ‘ఆయన వయసు అరవై ఐదు, డెబ్భై మధ్య ఉండచ్చ’ని డిటెక్టివ్ పెద్దబ్బాయి అనుకున్నాడు.‘‘ఈయన పేరు ఐలయ్య. కోటీశ్వరుడు. ఉదయం బట్లర్ నిద్ర లేచేసరికి ఇలా కనిపించాడు. డాక్టర్ ప్రాథమిక పరీక్ష ప్రకారం ఎనిమిది గంటల క్రితం గొంతు పిసికి చంపబడ్డాడు. తెల్లవారుజామున. ఈయన ఆస్తికి ఇద్దరు వారసులు. కొడుకు వయసు ముప్ఫై ఎనిమిది, కూతురి వయసు ముప్ఫై రెండు. రాత్రిళ్ళు ఇంట్లో పనివాడు మాత్రమే ఉంటాడు.’’ ఇన్ స్పెక్టర్ వివరించాడు.పెద్దబ్బాయి ఆ గదిని పరిశీలనగా చూసి తల ఊపాడు. మంచం చుట్టూ తిరిగి, దాని వెనుక నేల మీద పడివున్న టూత్‌పిక్ తీసి పరిశీలించాడు.‘‘దాని మీద వేలిముద్రలు దొరకవు.’’ ఇన్ స్పెక్టర్ చెప్పాడు.‘‘కాని పళ్ళముద్రలు, డీఎన్ఏ దొరుకుతాయి. హంతకుడితో హతుడు పెనుగులాడినప్పుడు హంతకుడి నోట్లోంచి ఇది నేల మీదికి పడి ఉంటుంది.’’‘‘అది హంతకుడిదే అని ఎలా చెప్పగలరు? హతుడిదీ అయి ఉండొచ్చుగా?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ప్రశ్నించాడు.‘‘పరిశీలన. ఊహ. ఈ రెండింటినీ ఉపయోగించాను. శవం పళ్ళని పరిశీలిస్తే ఆయనవి కట్టుడు పళ్ళని తెలిసింది. వాళ్ళకి టూత్‌పిక్ అవసరం ఉండదు. రాత్రిళ్ళు నక్షత్రాల్లా డెంచర్లు కూడా బయటికి వస్తాయి. రాత్రి వాటిని నీళ్ళల్లో ఉంచి, ఉదయం శుభ్రం చేసి పెట్టుకుంటారు. మీ సార్ టూత్‌పిక్స్ వాడుతారా?’’ పెద్దబ్బాయి పనివాడి వైపు చూసి అడిగాడు.అతను తల అడ్డంగా ఊపాడు.‘‘నిన్న రాత్రి మీ అయ్యగారిని ఆఖరిసారి ఎప్పుడు చూశావు?’’‘‘రాత్రి పదిన్నరకి పాలగ్లాస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి, రెండో అంతస్తులోని నా గదికి వెళ్ళాను. ఉదయం ఆరున్నరకి కిందికి వచ్చాక చూశాను. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.’’‘‘దొంగతనంగా ఇంట్లోకి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు సార్.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఇల్లంతా తిరిగి చూసి వచ్చి చెప్పాడు.‘‘ఈ ఇంటి డూప్లికేట్ తాళంచెవులు ఎవరి దగ్గర ఉన్నాయి?’’‘‘వీరి పిల్లలు... కూతురు, కొడుకుల దగ్గర.’’ పనివాడు జవాబు చెప్పాడు. ‘‘వాళ్ళు నిన్న వచ్చారా?’’‘‘ఇవాళ ఆయన విల్లు రాయాలని అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం కొడుకు వచ్చి ఆస్తిని ఆయన ఇంటి పేరుగల వారికే, అంటే తనకే రాయాలని కోరాడు. ఆయన కూతురు సాయంత్రం వచ్చి, తన తల్లి తన అన్నని ఎలా కష్టపడి కన్నదో తనని కూడా అలాగే కన్నదని, తనకి సగం ఆస్తి రాయడం న్యాయమని కోరింది.’’‘‘వాళ్ళిద్దరిలో ఎవరికి టూత్‌పిక్ అలవాటు ఉంది?’’‘‘కొడుక్కి ఉంది. నాకు అదే ఆశ్చర్యం. సినిమాల్లో విలన్లు టూత్‌పిక్‌లు నోట్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతుంటారు కదా! అతను అచ్చం అలా తిప్పుతాడు.’’‘‘నువ్వు ఇల్లు సరిగ్గా ఊడుస్తావా?’’‘‘ఊడుస్తాను సార్.’’‘‘మరి ఈ టూత్‌పిక్ ఊడవలేదే?’’‘‘అది నిన్న రాత్రి ఏడు తర్వాత పడి ఉంటుంది. నేను ప్రతి సాయంత్రం చీకటి పడకముందే వాక్యూమ్ చేస్తాను.’’కబురు అందుకుని ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వచ్చారు. కొడుకు, అల్లుడి నోళ్ళల్లో టూత్‌పిక్‌లు ఉన్నాయి. ఆ నలుగురి కళ్ళ వెంటా నీళ్ళు కారుతున్నాయి.‘‘మీరు మీ నోట్లోని టూత్‌పిక్‌ని ఇస్తారా?’’ పెద్దబ్బాయి తనని పరిచయం చేసుకుని అడిగాడు.‘‘దేనికి?’’ ఇద్దరూ ఇచ్చి ఆశ్చర్యంగా అడిగారు.‘‘హంతకుడిని కనుక్కోడానికి.’’పెద్దబ్బాయి టూత్పిక్లని పరిశీలించి,ఇన్ స్పెక్టర్ వైపు తిరిగాడు.‘‘మిస్టర్ ఇన్ స్పెక్టర్. దయచేసి హంతకుడిని అరెస్టు చేయండి. అల్లుడిదే ఈ గిల్లుడు.’’‘‘ఎలా చెప్పగలరు?’’ అల్లుడు అదిరిపడి అడిగాడు.‘‘మీ మామగారి గొంతు పిసికినప్పుడు కిందపడ్డ మీ టూత్‌పిక్ చెప్పింది.’’‘‘అది నాదేనని ఏమిటి? నా బావమరిదిదై ఉండొచ్చుగా?’’ సీరియస్‌గా అడిగాడు.‘‘మిస్టర్ అల్లుడు. టూత్‌పిక్స్ రెండు రకాలు ఉన్నాయి. పిసినారి వాళ్ళ కోసం చేసే వాటికి అటూ ఇటూ సూది మొనలు ఉంటాయి. కాని మామూలు వాళ్ళు వాడే వాటికి వాడి మొన ఒకవైపు మాత్రమే ఉంటుంది. అది మీ బావమరిదిదైతే రెండో వైపు మొన ఉండేది కాదు. ఇల్లు ఊడ్చాక తెల్లారజామున మీరీ హత్య చేయడంతో నా పని తేలికైంది. మీరు ఇది మీ పని కాదనడం సహజం. అది ప్రతి నేరస్తుడి వాదనే. కాని డీఎన్ఏ క్లూని ఎవరూ కాదనలేరు.’’అల్లుడు బయటకి వేగంగా నడుస్తూంటే కాన్ స్టబుల్స్ ఆపారు.లోపలకి వస్తున్న ఓ ఏభై ఏళ్ళ వ్యక్తిని చూసి పెద్దబ్బాయి చెప్పాడు.‘‘మీరు లాయరైతే ఇక మీకు ఇక్కడ పని లేదు.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
బెంగాల్లో దారుణం: కాంగ్రెస్ నేత, కుమారుని కిరాతక హత్య!
నదియా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రాత్రి వేళ నకాషిపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెతువాడహరి రైల్వే గేట్ సమీపంలో దుండగులు జరిపిన హింసాత్మక దాడిలో సీనియర్ కాంగ్రెస్ నేత అనిసుర్ రెహమాన్, ఆయన కుమారుడు అబు సుఫియాన్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును అడ్డగించి తొలుత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత వాహనాన్ని ఆపి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అధిక రక్తస్రావం కావడంతో తండ్రీకొడుకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నకాషిపారా పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యల వెనుక స్థానిక ఆధిపత్య పోరు, కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. జైలులో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జుబ్బార్ షేక్ ఆదేశాల మేరకే ఈ దారుణం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ కిరాతక హత్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ట్రాక్‌పై తోడేలు తల.. పట్టాలు తప్పిన స్పెషల్ ట్రైన్! -
రూపారెడ్డిని హత్య చేసింది 20 ఏళ్ల యువకుడేనా?
నల్లగొండ జిల్లా: పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా, విన్నా రూపారెడ్డి హత్య గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మృతురాలు రూపారెడ్డి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న పాఠశాలలో.. 2010 నుంచి 2025 బ్యాచ్‌ల వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఆ కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం. -
48 గంటల మిస్టరీకి తెర.. బీజేపీ నేత దారుణ హత్యతో ఉద్రిక్తత
గుహవటి: అసోంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 48 గంటలుగా కనిపించకుండా పోయిన 52 ఏళ్ల బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ చివరకు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అసోంలోని శ్రీభూమి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చాగల్మోవా గ్రామానికి చెందిన ధర్ ఆగస్టు 12న తన మోటార్‌సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తూ నిందితుల వరకు చేరుకున్నారు.శుక్రవారం ఉదయం అసోం-త్రిపుర సరిహద్దుకు సమీపంలోని జోగిచ్ఛరా ప్రాంతంలో ఓ చెరువు వద్ద ధర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, విచారణలో ఒక నిందితుడు ధర్‌ను మాచెటీతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు రాజకీయ కారణం ఉందా, లేక వ్యక్తిగత కక్షే కారణమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వ్యక్తిగత వైరం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం..దర్యాప్తు సమయంలో మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ఓ కానిస్టేబుల్‌పై పదునైన వస్తువుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, నిందితుడి ఎడమ కాలికి బుల్లెట్ గాయం అయింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఆందోళనలు, ఉద్రికత్త..ధర్ మృతదేహం లభ్యమైన వార్తతో చాగల్మోవా, బజారిచెర్రా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల విధ్వంసం, నిప్పంటించే ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పంటించినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా జిల్లా యంత్రాంగం BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు హత్యకు కారణం ఏమిటి? ఆరుగురు నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది. -
నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ
-
భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి శవమై సూట్‌కేసులో
బిహార్‌లో జరిగిన దారుణ ఘటన దిగ్బ్రాంతి రేపింది. ఛోటీ కుమారి అనే వివాహితను ఆమె ప్రియుడు రిషభ్ కుమార్ దారుణంగా హత్య చేసి, శవాన్ని సూట్‌కేసులో దాచిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి అతని చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బిహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన ఛోటీ కుమారికి ఇదివరకే వివా మైంది. అయితే, తన గ్రామానికి చెందిన ప్రేమికుడు రిషభ్ కుమార్ సింగ్‌తో కలిసి దద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సాకు పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో రిషభ్‌పై కిడ్నాపింగ్ కేసే నమోదైంది.మరోవైపు పెళ్లయిన తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్దామని ఛోటీ పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 9న జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, రిషభ్ కోపంతో ఛోటీని గొంతు నులిమి హత్య చేశాడు. బాడీని సూట్‌కేస్‌లో కుక్కి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆగస్టు 3న గది యజమాని వేరే వారికి అద్దెకు ఇవ్వడం కోసం తాళం పగులగొట్టి చూడగా, బాత్రూమ్లో ఉన్న సూట్‌కేస్ నుండి తీవ్ర దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం హత్య తర్వాత వారణాసికి పారిపోయిన రిషభ్, తన పేరు మార్చుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. -
రెజ్లర్ సుశీల్‌కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్ పురుషైంద్ర కుమార్... సుశీల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సుశీల్ కుమార్‌ను 2021లో యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రశాల్ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుశీల్ కుమార్ నుంచి తుపాకీ స్వాదీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలపరుస్తున్నాయని తెలిపింది. సుశీల్ కుమార్‌కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది. కేసు ఏంటంటే... భూ వివాదాల నేపథ్యంలో జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ను 2021లో సుశీల్ కుమార్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని ఛత్రశాల్ స్టేడియంకు తీసుకువచ్చి బేస్‌బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్స్‌తో దారుణంగా కొట్టారు. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది బెయిల్ మీద బయటకు వచ్చిన సుశీల్ కుమార్ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దుచేసింది. -
డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్!
న్యూఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందన కోరింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు సీబీఐ కూడా ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 నవంబర్ 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.2002 అక్టోబర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నవంబర్ 21న మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించగా, తగినన్ని సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026 మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.దిగువ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. కాగా, ఈ కేసులోని మరో ముగ్గురు దోషుల శిక్షలను మాత్రం హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్ర ఛత్రపతి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అప్పీల్ చేయలేదని ప్రస్తావిస్తూ రామ్ రహీమ్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుపై నవంబర్‌లో జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు! -
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్‌బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్‌లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్‌పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్‌పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్‌ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు. -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి! -
పల్నాడులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్‌గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్‌తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
కూరలో విషం కలిపిన భార్య....
మోపాల్(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో సెలైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి భర్తను హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఇదే మండలంలో కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తలను హత్య చేయడానికి యత్నించిందో భార్య. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్నకు వర్ని మండలం తిమ్మాపూర్‌కు చెందిన సోనితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భూమన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భర్త, అత్త ఇద్దరూ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన సోని వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ప్రణాళిక వేసింది. ఈనెల ఒకటో తేదీన మధ్యాహ్న సమయంలో మీల్మేకర్ కర్రీలో గడ్డి మందును కలిపి వడ్డించింది.ఆ కూరతో అన్నం తిన్న అత్త భూదవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భూమన్న కూడా అదే కూరతో భోజనం చేశాడు. అయితే కూర వాసన రావడంతో తినడం మానేశాడు. అతడు సైతం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించిందని ఎస్సై తెలిపారు. నిందితురాలు సోనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
హత్య కేసులో సాక్షి నుంచి లంచం డిమాండ్, బయటపడ్డ పోలీసుల సంచలన ఆడియో
-
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
ఒకప్పుడు నేను.. ఇప్పుడు నా బిడ్డ కూడా!
విశాఖపట్నం: భర్త జైలులో.. ఒడిలో ఐదు నెలల పసికందు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒకప్పుడు అనాథగా పెరిగిన శృతి.. ఇప్పుడు తన బిడ్డ కూడా అదే అనాథ జీవితాన్ని అనుభవించాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమైంది. విశాఖలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో అరెస్టయిన బొలిశెట్టి సురేష్ భార్య శృతి ఊర్వశీ జంక్షన్లో ఉన్న ఇంట్లో బోరున విలపిస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ప్రేమతో మొదలై.. విషాదంతో మిగిలింది హాస్టల్లో పెరిగిన శృతి ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా సురేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, జీవితాంతం తోడుంటానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో సంతోషం కంటే కన్నీళ్లే ఎక్కువయ్యాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమార్తెను కోల్పోయింది. గర్భంలో ఉన్న కవలల్లో ఒక శిశువు కూడా మృతిచెందింది. ఇప్పుడు ఒడిలో ఉన్న ఐదు నెలల పసికందే తనకు మిగిలిన ఆశగా నిలిచింది. పాలకు డబ్బులు లేక.. మైనర్ బాలికను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఒడిశాకు తీసుకెళ్లి, అక్కడ పడేసి వచ్చిన భర్త సురేష్ జైలుకెళ్లడంతో కుటుంబానికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం మూసుకుపోయింది. నెలకు రూ.3,500 అద్దె చెల్లిస్తూ గౌరీనగర్‌లో ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని చెబుతున్నారని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు సెరెలాక్ కొనుగోలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఒకప్పుడు నేనే అనాథను. ఇప్పుడు నాతో పాటు నా ఐదు నెలల బిడ్డ కూడా అనాథ అయింది. మా బిడ్డ ఏ పాపం చేసింది?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది. ఒక వ్యక్తి చేసిన నేరానికి చట్టం శిక్ష విధిస్తుంది. కానీ ఆ నేరం వల్ల ఛిద్రమైన కుటుంబాలు, దిక్కులేని చిన్నారులు అనుభవించే బాధకు మాత్రం కొలమానం ఉండదు. ఈ కేసులోనూ నిందితుడి చర్యతో అమాయక పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ఇదేం విచిత్రమో.. ఆ లాజిక్కు మిస్సయ్యిందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్‌లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్‌గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు.ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జూన్ 27వ తేదీ రాత్రి పాతగొడవల నేపథ్యంలో చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పను దారుణంగా హత్యచేశారు. అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుకు సుబ్బన్న, అయ్యప్పలతో చేపలవేట వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజు, గుడివాడకు చెందిన నలుగురు స్నేహితుల సహకారంతో సుబ్బన్న, అయ్యప్పలపై కర్రలు, రాడ్డు, కత్తితో దాడిచేశారు. వారిద్దరినీ హతమర్చారు. అనంతరం మృతదేహాలను వారి ద్విచక్ర వాహనానికే కట్టి నీటిలో పడేశారు. కంకిపాడు సీఐ బి.బి.రవికుమార్, ఆర్‌పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ నాగేంద్రప్రసాద్ మూడు బృందాలుగా ఏర్పడి దాదాపు నెలరోజుల పాటు సాంకేతిక అంశాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హత్యచేసింది శంకరపు శ్రీను, జల్లానాగరాజు, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, అబ్బూరి విజయరత్నం (దాస్), యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, గుడివాడ కార్మికనగర్‌కు చెందిన అబ్దుల్ఖాదర్జిలానీ అని గుర్తించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లక్ష్మీపురం సెంటర్లో ఉండగా వారందరినీ పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక కారు, ద్విచక్రవాహనం, ఏడు మొబైల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుపరాడ్డు, కర్రను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నెలరోజులపాటు ఎంతో శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. అధికార పార్టీ అండతోనే.. జంటహత్యల కేసులో నిందితులు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చినగొల్లపాలెంకు చెందిన నిందితులు ఆ పార్టీకి అత్యంత సానుభూతి పరులు. ఈ కారణంగానే హత్య జరిగినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిందితులు శ్రీను, నాగరాజు, కటికల కల్యాణ్‌ను రక్షించేందుకు అనేక యత్నాలు చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీనుతో పాటు నాగరాజును అనుమానించిన పోలీసులు కొద్ది రోజుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనంతరం వారిని వదిలేశారని సమాచారం. చివరికి అసలు నిందితులు వారే కావడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలుస్తోంది. -
అబిడ్స్‌లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్‌లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్‌లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఛేజ్‌చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
మరిది వేసిన మాస్టర్‌ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బందిని అభినందించారు. -
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
ప్రియుడిని నరికి, ట్యాప్ కింద పెట్టి..
థానే: మహారాష్ట్రలోని థానేలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. పూణెకు చెందిన హసిబా అనే మహిళ తన ప్రియుడు హమిదిల్లా ఇస్లామ్‌ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం లేదా వ్యభిచార కూపంలోకి నెట్టేయాలని చూశాడనే అనుమానంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సుమారు ఐదు రోజుల క్రితం ప్రియుడిని హతమార్చిన నిందితురాలు, మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అనంతరం దుర్వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోవడానికి బాత్రూమ్లోని రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ మృతదేహాన్ని గోనెసంచిలో దాచింది.ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హసిబా కోల్‌కతాకు పరారైంది. అయితే ఫ్లాట్ యజమానికి వాయిస్ మెసేజ్ పంపి తాను హత్య చేసినట్లు తెలిపింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి పరిశీలించగా, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కోల్‌కతాకు పంపారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు! -
జంట హత్యల కేసులో మరణశిక్ష
పాలక్కాడ్: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్‌తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), సెక్షన్ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్‌తామర తన పొరుగింటి సుధాకరన్తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్‌తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్‌తామర పొరుగింటి సుధాకరన్ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్ జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గత ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్ చెన్తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ఇంటికెళ్లం నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్‌తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
'మా ఇంటికి ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి' అనడమే శాపమైంది..
హైదరాబాద్, బహదుర్‌పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ కలీల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్ ఫైజ్ ఎలియస్ అజాన్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఐదేళ్ల క్రితం కాలాపత్తర్‌లో ఉన్న అబ్రార్ ప్రస్తుతం బాలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్ తన స్నేహితులు ఆశ్వక్ (21), పర్హాన్ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్లను వెంటబెట్టుకుని కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీలోని అజాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్ మామ సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్‌ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి. -
సోషల్ మీడియా మోహం.. సంసారాల్లో క్రైమ్ దాహం!
సాక్షి, అమరావతి: నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన దాంపత్య బంధాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. అనుమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆస్తి వివాదాలు సైతం చివరికి దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబ వ్యవస్థ విచి్ఛన్నం అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలు యావత్ సమాజాన్ని విస్తుగొలుపుతున్నాయి.ముఖ్యంగా భర్తలను చంపడంలో మహిళలు అనేక సరికొత్త మార్గాలను ఎంచుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. ప్రెషర్ కుక్కర్, నీళ్ల డ్రమ్, బాత్రూమ్ టైల్స్ కింద, గ్యాస్ సిలిండర్‌లో ఇలా అనేక చోట్ల భర్త మృతదేహాలను దాచిపెట్టడం భీతిగొలుపుతోంది. కొండపై నుంచి తోసేయడం, తినే ఆహారంలో విషం కలపడం, విషం నింపిన ఇంజక్షన్లు చేయడం, కత్తితో పొడవడం, గొంతు నులిమి చంపేయడం, కిరాయి వ్యక్తులతో హత్య చేయించడం వంటి మార్గాలను ఎంచుకుని మరీ కట్టుకున్న వాడిని కడతేర్చుతున్నారు. ప్రాణం తీస్తున్న పరిచయాలు.. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడుతున్న పరిచయాలు తీవ్ర నేరాలకు పురిగొల్పుతున్నాయి. కొంత కాలం పరిచయాలే బంధాలుగా ఏర్పడి, అప్పటికే ఉన్న బంధాలను తెంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో భర్త హత్య కేసులు ఇటీవల సంచలనం సృష్టించాయి.చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణాలుగా తేలాయి. హత్యలకు కుటుంబ, వ్యక్తిగత వివాదాలే కారణమని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, హత్యలకు గురైన కేసుల్లో 36.36 శాతం కుటుంబ, ఆస్తి వివాదాలు, 29.55 శాతం వివాహేతర సంబంధాల వల్ల జరిగినట్లు తేలింది. బాధితులు, నిందితులు ఎక్కువగా ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనని అధ్యయనం వెల్లడించింది. విస్మయం కలిగిస్తున్న అధ్యయనాలు.. వివాహేతర సంబంధాలపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. దేశంలోని టైర్–1, టైర్–2 నగరాలకు చెందిన 1,503 మంది వివాహితులపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 37 శాతం మంది ప్రేమలో ఉన్నప్పటికీ భాగస్వామిని మోసం చేయడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పది మందిలో ఆరుగురికిపైగా వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపినట్లు సర్వే పేర్కొంది. అలాగే పురుషుల్లో 59 శాతం, మహిళల్లో 53 శాతం మంది తమ భాగస్వామిపై అవిశ్వాసం లేదా అనుమానం వ్యక్తం చేశారు. 44 శాతం మంది సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు వెల్లడైంది. పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ ధోరణి దాదాపు ఒకే స్థాయిలో ఉండటం గమనార్హం. కుటుంబాలు ఛిన్నాభిన్నం.. మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, సోషల్ మీడియా ప్రభావం, మద్యం వ్యసనం, ఆర్థిక ఒత్తిళ్లు, పరస్పర అనుమానాలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. విభేదాలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్, కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వం లేదా చట్టబద్ధమైన విడాకుల వంటి మార్గాలను ఎంచుకోవాల్సిన చోట హత్యలకు పాల్పడటం అత్యంత ప్రమాదకర ధోరణిగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. భర్త హత్యకు గురైతే ప్రాణం కోల్పోయేది ఒక్కరే కాదు. తల్లిదండ్రులు కుమారుడిని, పిల్లలు తండ్రిని కోల్పోతారు. నేరానికి పాల్పడిన భార్య జైలుకు వెళ్లడంతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమవుతుంది. నమ్మకం, పరస్పర గౌరవం, సంభాషణ, సమస్యలకు శాంతియుత పరిష్కారాలే ఇలాంటి విషాదాలను నివారించే మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రియుని సహకారంతో భర్తకు పాము కాటు వేయించి..
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ (35) మృతి వెనుక అతని భార్య దామిని కుట్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు తన ప్రియుడు, స్కూల్ డ్రైవర్ తుషార్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.పోలీసుల కథనం ప్రకారం, 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అతుల్, దామిని దంపతులు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని, ప్రియుడితో కలిసి జీవించాలని దామిని పథకం పన్నింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అతుల్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపి, అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఆ పాము కాటుకు అతుల్ మరణించాడు.సందేహం రాకుండా ఉండేందుకు భర్త పాము కాటుకు గురయ్యాడని ఆమె నాటకం ఆడింది. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. నిందితుల ఫోన్లలో పాము ఫొటోలు లభ్యమయ్యాయి. తాము పామును కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తుషార్ అంగీకరించాడు. 20 రోజుల క్రితం కూడా కారుతో ఢీకొట్టి అతుల్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: శరీరంలోకి సర్రున దూసుకెళ్లిన ఇనుప రాడ్లు.. ఆ తర్వాత? -
HYD: మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకాగా, పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా భాస్కర్ లో మార్పు రాలేదని సమాచారం.ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్‌కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు . హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల వివాదమే హత్యకు ప్రధాన కారణమా, లేక ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి. -
ఆరు హత్యలకు కారణం.. మొదటి నుంచి చివరి వరకు
-
కోటను తవ్వి ఎలుకనూ పట్టలేదు!
సాక్షి ప్రతినిధి, కడప: పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది (2025 జూలై 14న) చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యంత క్రూరమైన హత్య కేసు జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, టవర్ లొకేషన్లు, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ వంటి అత్యాధునిక పరీక్షలు నిర్వహించి, ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు పర్యవేక్షించినా క్షేత్రస్థాయిలో ఫలితం మాత్రం ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ చందంగా మారింది. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు శరవేగంగా అర్ధరాత్రి పూట కూడా స్పందించే సీఎం చంద్రబాబు సర్కార్.. ఒక అబల ప్రాణం పోయి ఏడాదైనా నిందితులెవరో తేల్చలేక చేతులెత్తేయడం గమనార్హం. మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ దాకా.. ఇంటర్మీడియట్ చదువుతున్న సదరు బాలిక కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2025 జూలై 14న ప్రొద్దుటూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 257/2025 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గండికోట పరిసరాల్లో బాలిక హత్య వ్యవహారం బహిర్గతం కావడంతో జమ్మలమడుగు పోలీసులు క్రైమ్ నంబర్ 498/2025 కింద హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ మైనర్ బాలిక హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. లోకేష్‌కు క్లీన్చిట్ ఇచ్చిన డీఐజీ.. ఆంతర్యమేమిటి? ఈ మైనర్ బాలిక హత్య కేసులో కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అత్యంత వేగంగా ఒక నిర్ధారణకు రావడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్, అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్ సమక్షంలోనే విలేకరులతో మాట్లాడుతూ.. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని హడావుడిగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, “ఈ రోజు సాయంత్రానికే నిందితులను అదుపులోకి తీసుకుంటామని, ఎస్పీ పూర్తి వివరాలు తెలియజేస్తారన్ఙి మీడియాకు వివరించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలలో బాలిక లోకేష్ బైక్‌పై గండికోటకు వెళ్లినట్లు, తిరుగు ప్రయాణంలో లోకేష్ ఒక్కడే వస్తున్నట్లు స్పష్టంగా రికార్డు అయినా.. డిఐజీ స్థాయి అధికారి కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే లోకే‹Ùకు క్లీన్చిట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు మాయం ముఖ్య అనుమానితుడు లోకేష్‌కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో దర్యాప్తు దృష్టి ఒక్కసారిగా మృతురాలి సమీప బంధువుల వైపు మళ్లింది. స్నేహితుడు హత్య చేయలేదంటే, ఇది కచ్చితంగా బంధువులే చేసిన ‘పరువు హత్య’ అయ్యి ఉంటుందనే కోణంలో విశ్లేషణలు నడిచాయి. పోలీసులు మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణకు బంధువులంతా పూర్తిగా సహకరించినప్పటికీ, అటు వైపు కూడా ఎలాంటి క్లూస్ కానీ, ఆధారాలు కానీ లభ్యం కాలేదని పోలీసులు తేల్చేశారు. ఇద్దరు ఎస్పీలు మారినా తేలని మిస్టరీ.. జవాబు చెప్పాల్సింది విజనరీ సీఎంగండికోట మైనర్ బాలిక హత్య కేసును వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఏడాది దాటినా చేధించలేకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు ప్రస్తుత ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సైతం ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. టవర్ లోకేషన్ల ద్వారా ఫోన్‌కాల్స్ విశ్లేషణ, అనుమానిత వాహనదారుల విచారణ వంటి అన్ని సాంకేతిక వ్యవహారాలను ఉపయోగించి దర్యాప్తు చేసినా సంక్లిష్టత అలాగే ఉండిపోయింది.అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఈ కేసు చేధించలేకపోవడం వెనుక ఉన్న తెరవెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఏమిటో ‘విజనరీ సీఎం’ అని చెప్పుకునే చంద్రబాబు సర్కారే తేల్చి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
షాబాద్ హత్యలకు ముందు సెల్ఫీవీడియో
సాక్షి, హైదరాబాద్: షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యలకు ఒక రోజు ముందు నిందితుడు తన ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో తీసినట్లు తెలిపారు.. అందులో " నేను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయా, ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకుంది. నాపై కేసు పెట్టి నన్ను మోసం చేశారు. అందుకే వాళ్లని చంపాలనుకున్నా చివరకి నా పిల్లలకి కూడా భూమి లేకుండా పోయింది. డబ్బుమెుత్తం ఇచ్చేసి అప్పులపాలయ్యాను జీవితం మీద విరక్తి కలిగింది." అని రికార్డు చేసినట్లు తెలిపారు.షాబాద్ నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన అనంతరం అతని వద్ద లభించిన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. "ఆ ఘటన జరిగిన రోజు 10.30 గంటల ప్రాంతంలో నిందితుడు రాజ్ కుమార్ ఉర్లోకి వచ్చాడు. అమ్మాయిని తీసుకొని దేవరకొండకు వచ్చాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. జీపీఎస్ ఆధారంగా పట్టుకునేందుకు యత్నించాము" అని సీపీ పేర్కొన్నారు.కాగా షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించడం చర్చనీయాంశమైంది.రాజ్‌కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని ఆరుహత్యల నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్టు కాకుండా కాపాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అండదండలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇచ్చి కాపాడారు. ఈలోపు నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్ అనే నాయకుడు రేవంత్ రెడ్డిని పెయింట్ వేస్తారు అన్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే పోలీసులు అతనిని జైలుకు తరలించారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, అతడితో కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీశ్ రావు ఆరోపించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆ హంతకుడి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. -
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితునికి ఎంఏ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలు నుంచి ఎంఏ పరీక్షలు రాయనున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 20న కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి ఢిల్లీ న్యాయస్థానం అతనికి మినహాయింపునిచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాల నమోదు కోసం కోర్టు జూలై 20 నుండి 25 వరకు రోజువారీ విచారణను గత మే నెలలో ఖరారు చేసింది.అయితే జూలై 20 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తనకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంఏ సోషియాలజీ చివరి పరీక్ష ఉందని, అందుకే ఆ రోజు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆఫ్తాబ్ కోర్టును కోరారు. తీహార్‌లోని సెంట్రల్ జైలు నంబర్ 3లో జూలై 11 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి.ఈ కేసును విచారిస్తున్న సెషన్స్ న్యాయమూర్తి హర్గురువరిందర్ సింగ్ జగ్గీ.. జూలై 20న విచారణను వాయిదా వేస్తూ, జూలై 21 మధ్యాహ్నం 2 గంటల నుండి తిరిగి సాక్ష్యాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కోర్టు ముందుగా నిర్ణయించిన మిగిలిన తేదీల విచారణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎనిమిది మంది సాక్షులను విచారించాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను పాక్షికంగా నమోదు చేయగా, 12 మంది సాక్షుల విచారణ వాయిదా పడింది.లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామి శ్రద్ధా వాకర్ (27)ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా తాను నిర్దోషినని ఆఫ్తాబ్ కోర్టులో వాదించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు విద్యను అభ్యసించే అవకాశం ఉండటంతో కోర్టు ఈ మినహాయింపునిచ్చింది. -
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్‌కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్‌లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్‌కు భారత్‌కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్‌లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు. -
డబ్బులివ్వద్దన్నా అక్కకు ఇస్తుంది.. అందుకే అమ్మను చంపేస్తున్నా!
నల్గొండ, తుంగతుర్తి: సంపాదించిన డబ్బంతా కుమార్తెకే ఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తుంగతుర్తి సీఐ ఉపేందర్‌రావు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (74), కనకలక్ష్మి (66) దంపతులు అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరు జీవనోపాధి కొరకు ఒకరు సూర్యాపేటలో, మరొకరు తిరుమలగిరిలో ఉంటున్నారు.అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును కనకలక్ష్మి ఎక్కువగా కుమార్తెకు ఇస్తుందని, అంతేకాకుండా కుమార్తెకు రూ.3 లక్షలతో తిరుమలగిరిలో ప్లాటు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆమెతో భర్త కోటేశ్వరరావు తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కనకలక్ష్మి నెల క్రితం పెద్ద కుమారుడు సోమేశ్వర్ దగ్గరకు వెళ్లింది. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి పంచాయితీ పెట్టి కనకలక్ష్మిని తిరిగి గొట్టిమర్తికి తీసుకొచ్చారు. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య పంచాయితీ జరగడంతో కనకలక్ష్మి తన కుమారులకు ఫోన్ చేసింది.కుమారులిద్దరు కాన్ఫరెన్స్‌లో తల్లిదండ్రులతో మాట్లాడి ‘మీరు పంచాయితీ పెట్టుకోవద్దు.. మేము వస్తామని’ చెప్పారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఫోన్లో మాట్లాడుతూ.. ‘మీ అమ్మ నేను చెప్పినట్లు వినడం లేదు, నాకు తెలియకుండా డబ్బులన్నీ అక్కకు ఇస్తుంది, ఎలాగైనా మీ అమ్మను చంపుతాను’ అని చెప్పడంతో కుమారులిద్దరు కలిసి తండ్రిని వారించి సర్ది చెప్పారు.సూసైడ్ నోట్ గోడకు అంటించి..!ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కనకలక్ష్మి తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం కోటేశ్వరరావు సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉన్న గోడకు అంటించాడు. తన వద్ద రూ.4.90 లక్షలు అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9వేల నగదు ఉందని, ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా తీసుకోవాలని, గొడవ పెట్టుకోవద్దని సూసైడ్ నోట్లో రాశాడు. 4.20 గంటలకు ఉరేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని, తాను చేసుకున్న కర్మ అని రాసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గురువారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుమారులకు సమాచారం ఇచ్చారు. కుమారులిద్దరు వచ్చి చూడగా.. అప్పటికే కోటేశ్వరరావు, కనకలక్ష్మి మృతిచెంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. మృతుల చిన్న కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద గత నెలలో హత్యకు గురైన ఈ కేసుపై వేగంగా విచారణ, త్వరితగతిన ట్రయల్ జరిపించాలని కోరుతూ కేతన్ తండ్రి, విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కేసుత్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కేతన్ అకాల మరణాన్ని తట్టుకోలేక, తాత గుండెపోటుతో మరణించిన తరువాత ఈ పరిణామం జరిగింది.బుధవారం రాష్ట్రపతి సెక్రటరీకి పంపిన ఒక భావోద్వేగ ఈమెయిల్లో, కేతన్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను విశాల్ అగర్వాల్ పంచుకున్నారు. తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేవలం 20 రోజుల తర్వాత తన తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ వేదనను తట్టుకోవడం తమవల్ల కావడంలేదని పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. తానొక వ్యాపారవేత్తగానో, ప్రభావితవ్యక్తిగానో కాదు, ఎంతో బాధతో, ఆశతో ఇది రాస్తున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక తండ్రిగా కొడుకుకు న్యాయం కోసం అర్ధిస్తున్నానంటూ వేడుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే అటు కొడుకును, ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేతన్ తాతయ్య అతడిని ఎంతగానో ప్రేమించేవారని, మనవడి మరణంతో ఆయన గుండె పగిలిపోయిందని అన్నారు. కేతన్ ఇక లేడని తెలిసి, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారన్నారు. ఇది తమ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చిందంటూ తమ మానసిక ప్రభావాన్ని,కేతన్ మరణం తర్వాత తమ జీవితాలు పూర్తిగా విషాదంగా మారిపోయాని విశాల్ అన్నారు. దారుణంగా హత్యకు గురైన కేతన్కు న్యాయం జరిగేది ఎపుడు? ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనేదాకా ఇదే ప్రశ్న తమమెదళ్లను తొలిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని, దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూడాలని విశాల్ అధికారులను కోరారు. తమ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరంలేదు కానీ, అనవసర జాప్యం లేకుండా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నా మన్నారు. లేదంటే తమలాంటి కుటుంబాలు బాధతో మరింత కుంగిపోతాయన్నారు. నా కొడుకును వెనక్కి తేలేం కానీ, కేతన్‌ను మళ్లీ వెనక్కి తీసుకురాలేం, కానీ దోషులు మాత్రం శిక్ష నుండి తప్పించుకోకూడదన్నారు. వారికి కఠినమైన శిక్ష పడినపుడు మాత్రమే తమకు మనశ్శాంతి దక్కడంతోపాటు, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజంలో వెళుతుందని, దయచేసి తన కొడుకు కేసును కూడా మరో కేసులా మరుగున పడవేయవద్దని మార్చొద్దని, దీని వెనుక సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబం ఉంది అంటూ ఆవేదనతో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్ (26) ఒక లోయలో పడి మరణించాడు. మొదట ఇది ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ, విచారణలో ఇది హత్య కేసుగా మారింది. కేతన్ నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్, ఆమె, ప్రియుడిగా భావిస్తున్న చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని, అతడిని లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, హత్య , నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే -
ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్‌ను నిలదీశారు. నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్‌తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపుభార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. -
భర్తను చంపి 400 కి.మీ. దూరంలో పాతేసింది భయ్యా !
-
ప్రదాన నిందితుని ఎన్కౌంటర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నాలుగోతేదీన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతి కొనేందుకు బయటకు వెళ్లి అదృశ్యమై సరస్సులో శవమై తేలిక 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యోదంతంలో బుధవారం ప్రధాన నిందితుడు ప్రభాస్ మొండల్‌ను పశ్చిమబెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌ను ఇటీవల ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన సువేంధు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది తొలి పోలీస్ చర్యగా నిలిచిపోయింది. ఎన్కౌంటర్ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు. హత్యాచార ఘటన పూర్వాపరాలను తెల్సుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సుర్జాపూర్ హాట్‌లోని ఘటనాస్థలికి మంగళవారం అర్ధరాత్రిదాటాక 12.45 నిమిషాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసుల నుంచి సరీ్వస్ తుపాకీని తీసుకుని మొండల్ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న నిందితుడిని హుటాహుటిన సమీప బారుయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ధ్రువీకరించారు. బాలికను చంపేసి గోనెసంచిలో కుక్కి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే కొలనులో పడేశారన్న వార్త తెలిసి నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. మేజి్రస్టియల్ విచారణ తర్వాత ప్రధాన నిందితుడు మొండల్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇదే ఉదంతంలో కబీర్ మొల్లా అనే మరో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను గతంలోనే అరెస్ట్‌చేశారు. గతంలోనే ప్రభాస్ మొండల్‌నూ అరెస్ట్‌చేయగా ఈ కేసులో మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్యోదంతం వెలుగుచూసిన కొన్ని గంటలకే ఈ ఘటనలో సంబంధం ఉందనే అనుమానంతో ఒకతడిని స్థానికులు కొట్టి చంపిన విషయం తెల్సిందే. వాడి శవం నాకు అక్కర్లేదు: తల్లి పోలీసు ఎన్కౌంటర్లో నీ కుమారుడు చనిపోయాడని తల్లి సంధ్యా మొండల్‌కు అధికారులు సమాచారం ఇవ్వగానే ఆమె ఆగ్రహంగా స్పందించారు. ‘‘చెడు అలవాట్లకు బానిసైన వాడు నా కొడుకే కాదు. వాడి మృతదేహాన్ని నేను తీసుకోను. తాగుడు మానేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదు. వాడు చనిపోయినా నాకు ఏమాత్రం బాధ లేదు. బాలికను దారుణంగా హింసించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. మార్చురీలో వాడి ముఖం చూసేందుకు కూడా నేను వెళ్లను. నేనే కాదు మా కుటుంబంలో ఎవరూ వాడి మృతదేహాన్ని తెచ్చుకోము’’అని తల్లి తెగేసి చెప్పారు. నేనూ బాధితురాలినే: మొండల్ భార్య భర్త మృతిచెందాక ప్రధాన నిందితుని భార్య చంపా స్పందించారు. ‘‘నా భర్త అమాయకుడు, ఈ నేరం చేయలేదు అని నేను చెప్పను. తనతో జీవిస్తూ ఎన్నో బాధలు పడ్డా. హత్యోదంతంలో ఇతని పేరు విన్పించగానే ఇలాంటిదేమో చేసే ఉంటాడని ముందుగానే ఊహించా. పెళ్లయిన నాటి నుంచి వేధింపులకు గురిచేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు’’అని ఆమె తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో హతమవడంతో ఈ ఘటనకు సరైన న్యాయం జరిగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 2013లో కామ్‌ధునీలో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసునూ తిరిగితోడి నిందితులకు ‘సరైన’శిక్ష పడేలా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి దేవ్జీత్ సర్కార్ అన్నారు. అయితే ఎన్కౌంటర్లో నిందితుడిని హతమార్చడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సువేందు సర్కార్‌కు రాష్ట్ర పోలీసులపై నియంత్రణ ఉందా? రాష్ట్రంలో బెంగాల్–ఉత్తరప్రదేశ్ 2.0ను విధానం అమలుచేద్దామని చూస్తున్నారా? బెంగాల్లో బీజేపీ పాలన ఉందా? ఎన్కౌంటర్లో చంపేయడం అంటే ఆటవికంగా పాలించడమే’’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ర్యాలీలో బాహాబాహీ.. బాలిక హత్యోదంతాన్ని నిరసిస్తూ బుధవారం కోల్‌కతాలోని హజ్రా రోడ్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. దొంగలు అని నినదిస్తూ అవాంతరాలు సృష్టించారు. మానవహారంగా నిలబడి ర్యాలీని అడ్డుకోవడంతో ఆగ్రహంతో టీఎంసీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త తోపులాటగా మారింది. కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపుతప్పకుండా నిలువరించారు. -
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్‌లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్‌టౌన్‌లోని ఉడ్‌ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్‌పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్‌లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్‌మెంట్‌కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్‌కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు. -
భర్తను లేపేయడానికి చావు తెలివి.. పట్టించిన సెల్ ఫోన్
-
కేతన్ హత్యకు నాలుగు నెలలముందే...సీక్రెట్ మ్యారేజ్
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్, క్రైమ్ జరగడానికి కొన్ని నెలల ముందే మరో నిందితుడు, తన ప్రియుడు చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వారి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్లను పరిశీలించినప్పుడు ఈ విషయం బయట పడింది. అలాగే జూన్ 14నే కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో సియా ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా, చేతన్‌కు ఒక మెసేజ్ పంపుతూ.. ఒంటరిగా ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలడం లేదని, ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుండి కిందకు నెట్టేద్దామని, కాబట్టి తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటునిందితుల గత ఆరేడు నెలల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు మరియు ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు క్రైమ్ ప్లానింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను అందించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సియా, చేతన్ తమ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారి రహస్య వివాహం తర్వాతే కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.కాగా సియా, ప్రియుడి సహాయంతో, తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోలీసులు సియా, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా? -
భార్య, మరదలిని హత్య చేసిన భర్త?
బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్ దంపతుల కుమార్తెను కోలారు మిలత్ నగరకు ఎజాజ్ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు. పుట్టింటికి వచ్చేసినా.. భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్‌పేట ఠాణాలో లొంగిపోయాడు. గంజాయి, ఇస్పేటు అలవాట్లు చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్ పరిశీలించారు. ఎజాజ్ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు. -
మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి
హైదరాబాద్, పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) జిమ్ కోచ్‌తో పాటు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సయీద్ బిన్ ఫైసల్ బామ్, సాలం బామ్ అనే స్నేహితులు ఉన్నారు.వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్‌ను స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్‌పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. -
కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్‌కు మద్దుతుగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో నిందితురాలు సియాను దుమ్మెత్తి పోస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. బలవంతపు పెళ్లి పర్యవసానమే ఇది అంటూ సియాను సమర్థించడానికి ప్రయత్నించిన ఒక నెటిజన్‌పై నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేరపూరిత ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులను వాడుకోలేమంటా విమర్శలు గుప్పించారు. అసలు ఏమైంది అంటే... ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌పై సానుభూతి చూపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందించారు. బలవంతపు వివాహాల వల్లే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా యూరప్‌లో ఉండి ఉంటే, వారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ ఈ కథలోకి వచ్చేవాడే కాదని పేర్కొన్నాడు. దీనిపై సుచిత్ర కృష్ణమూర్తి ఘాటుగా స్పందించారు.నటి సుచిత్ర కృష్ణమూర్తి కౌంటర్ఒకవేళ సియాపై పెళ్లికి ఒత్తిడి తెచ్చినప్పటికీ, హింసకు పాల్పడకుండా ఆమెకు అనేక చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చారు. "ఏ సంస్కృతి కూడా నేరపూరిత ప్రవర్తనను సమర్థించదు. ఇలాంటి నేరాలను సమర్థించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆమె ఇల్లు వదిలి పారిపోవచ్చు, లేదా తన సమ్మతి లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నందుకు కుటుంబంపై కేసు కూడా పెట్టాల్సింది. కానీ, పక్కా ప్రణాళికతో తన కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపడం అనేది కేవలం ఒక సైకోపాత్ (ఉన్మాది) మనస్తత్వం మాత్రమే" అంటూ ఎక్స్‌లో సుచిత్ర విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’కాగా జూన్18న లోహగఢ్ కోట దగ్గర ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించి నప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.ఇదీ చదవండి: ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు! -
ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు!
పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యోదంతం ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన కేవలం మూడు నెలలకే ఒక 25 ఏళ్ల అంకిత్ తన ప్రేయసి సహాయంతో భార్యను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టు నేపాల్‌కు పారిపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి తల్లి మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన 22 ఏళ్ల కుమార్తెకు ఫిబ్రవరిలో మనేసర్ నివాసి అంకిత్‌తో వివాహం జరిగిందని ఆమె పోలీసులకు తెలిపారు. మృతురాలు గత మే 21న అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి, అత్తమామలను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదు. దీంతో తమ కుమార్తె భర్త,అతని కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు.దర్యాప్తులో భాగంగా, పోలీసులు మే 22న మనేసర్‌లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కాల్చి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితులైన భర్త ఏళ్ల అంకిత్, అతని ప్రేయసి, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి, 38 ఏళ్ల రజనీ దేవిలను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, అంకిత్ మనేసర్‌లో పొగాకు దుకాణం నడుపుతుండగా, రజనీ అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేది.మూడేళ్ల ప్రేమాయణం , హత్య అంకిత్ ,రజనీ గత మూడేళ్లుగా రిలేషన్లో న్నట్టు పోలీసులు గుర్తించారు. భార్యను అడ్డు తొలగించేందుకు అంకిత్, తన భార్యను ఆ గదికి తీసుకెళ్లాడని, అక్కడ నిందితులిద్దరూ కలిసి ఆమెను కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని ఘటనకు సుమారు రెండు నెలల ముందే ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేశారట.. కేవలం ఈ హత్యను చేసేందుకే ఆ ఆయుధాన్ని కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.గుట్టు చప్పుడు కాకుండా నేపాల్‌కు పోలీసుల సమాచారం ప్రకారం, హత్య జరిగిన తర్వాత అంకిత్ , రజని హరిద్వార్‌కు పారిపోయి, ఆ తర్వాత నేపాల్ వెళ్లిపోయారు.జూన్ 30న తిరిగి భారతదేశానికి వచ్చే వరకు నిందితులు పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనేసర్‌లో క్రైమ్ బ్రాంచ్ బృందం వారిని అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టు వీరిద్దరికీ 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారిస్తున్నామని, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ -
కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం
పూణే: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన మనవడి హఠాన్మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవీచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను, పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టు జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లోహగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు, లల్లానగర్ మైదానంలో హత్యకు ముందు వారు చేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. -
CODEWORDS, EMOJI లతో సియా సీక్రెట్ చాట్స్
-
కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మొబైల్ ఫోన్లో పోలీసులు డిజిటల్ చాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘సీక్రెట్ చాట్స్’ సరికొత్త మలుపుగా మారాయి. అసలు కోడ్‌వర్డ్స్ ఎమోజీల అర్థం ఏంటో తెలియక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న చాట్లలోరహస్య కోడ్వర్డ్లు, మారుపేర్లు , ఎమోజీలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటి అర్థం కేవలం నిందితులకు మాత్రమే తెలుసని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. సియా గోయల్‌కు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) పరిశీలనకు పంపారు. మరోవైపు నిందితులను మరింత విచారించేందుకు పోలీసు కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ, కోర్టు అందుకు నిరాకరించింది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎ.ఎమ్. విభూతే ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: పెళ్లై నాలుగు నెలలే.. యాసిడ్ తాగించి, కన్న కొడుకు హత్యనిందితులు హత్యకు ముందు రిహార్సల్ చేసినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు 'పంచనామా' నిర్వహించారు. అలాగే ముంబై వైపు వెళ్తుండగా కేతన్ అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను పడేసిన చోట కూడా పంచనామా పూర్తి చేశారు. కేతన్ అగర్వాల్ నుండి సియా గోయల్‌కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!కాగా కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న పుణె జిల్లాలోని లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను కిందకు తోసి సియా గోయల్, చేతన్ చౌదరిలు హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేతన్పై హత్యా యత్నం సహా అనేక సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ -
సోనమ్ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్‌కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్‌ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్‌పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్‌పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్‌ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్‌ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది. -
లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?
ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్గ్రౌండ్సర్గిగా చెక్చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు. జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్‌ను ఊరడించారు. కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానంజూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్యపూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్‌ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలంఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్‌ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్‌ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. -
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
-
కేతన్ హత్య కేసు: ఏఐ సాయంతో వికృత రీల్స్!
పూణె: మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఇటీవల లోహగఢ్ కోటపై దారుణ హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘాతుకం.. డిజిటల్ ప్రపంచంలో ఒక వైరల్ వినోదంగా మారిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ)సాంకేతికతతో సృష్టించిన వికృతమైన రీల్స్, మీమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ, మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026సాంకేతికత దుర్వినియోగంపోలీసుల దర్యాప్తు ప్రకారం, కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి హత్య చేసింది. తొలుత దీనిని ప్రమాదంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. కానీ డిజిటల్ క్రియేటర్లు ఈ దారుణాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా తరహాలో మలిచేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఏఐ సాయంతో కొండ అంచున ఉన్న ఒక జంట, గంభీరమైన సంగీతం, కిందకు తోసివేయడం, స్లో-మోషన్లో కింద పడిపోవడం లాంటిటి విజువల్స్‌ను అత్యంత స్టైలిష్‌గా రీ-క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఒక మనిషి చివరి క్షణాలు, నేడు క్లిక్‌ల కోసం వాడే కంటెంట్‌గా మారిపోవడం సమాజ పతనానికి అద్దం పడుతోంది.Ketan Agarwal, owner of business worth crores, was ki!!ed by Siya Goyal with the help of her boyfriend Chetan Chaudhary.A marriage worth crores was arranged. Ketan was innocent and in love with her. She had the courage to kill someone rather than tell her family she loved pic.twitter.com/r5JneEr4zQ— Er Nawaz Choudhary (@N143ch) June 24, 2026లింగ వివక్ష.. నెట్టింట వికృత వ్యాఖ్యలుఈ దురదృష్టకర ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు మరిన్ని కలవరపెట్టే నిజాలను బయటపెడుతోంది. ఇలాంటి దారుణాలలో బాధితులు పురుషులైనప్పుడు సోషల్ మీడియా వ్యాఖ్యల విభాగం హింసకు వ్యతిరేకంగా కాకుండా, మహిళలపై సార్వత్రిక దాడులకు వేదికగా మారుతోంది. ‘మగవారికి రక్షణ లేదు’ అనే తరహా కథనాలతో పాటు సియా గోయల్‌ను విలన్‌గా చూపిస్తూ వేసిన వికృతమైన జోకులు, మీమ్స్ ఇందుకు ఉదాహరణ. నేరం ఎవరూ చేసినా క్షమార్హం కాదు. కానీ ఒక వ్యక్తిగత నేరాన్ని సమాజంపైకి అస్త్రంగా మార్చుకోవడం ఇక్కడి దుస్థితి.केतन और सिया का अनोखा अवतार!' सोशल मीडिया पर वायरल AI वीडियो ने मचाया तहलकाइंटरनेट पर केतन और सिया का एक नया एआई (AI) जेनरेटेड वीडियो तेजी से वायरल हो रहा है, Ketan Siya Viral Video, AI Generated Look, Social Media Reaction, Trending AI Video]#KetanSiya #AIVideo #ViralTrend pic.twitter.com/L6TbD1l8NT— The Lokdoot (@thelokdoot) June 26, 2026ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతారాహిత్యంసోషల్ మీడియా అల్గారిథమ్‌లు సానుభూతికి, దోపిడీకి మధ్య తేడాను గుర్తించవు. అవి కేవలం వినియోగదారుల ‘అటెన్షన్’ (ఆకర్షణ)ను మాత్రమే కోరుకుంటాయి. ఈ ఘోర శోకాన్ని కూడా రీల్స్, షేర్ల రూపంలోకి మార్చి, బాధితుడి తల్లిదండ్రుల వేదనను పట్టించుకోకుండా క్లిక్‌లను లాభాలుగా మార్చుకునే ఒక వికృతమైన వ్యవస్థ నడుస్తోంది. సాంకేతికత చిత్రాలను సృష్టించవచ్చు, కానీ వాటిని అప్లోడ్ చేసి, చూసి, ఆనందిస్తున్నది మనుషులే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. లోహగఢ్ కోటపై జరిగిన హత్య ఒక విషాదమైతే, సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వికృత క్రీడ అంతకన్నా పెద్ద మానసిక విషాదంగా పరిణమించింది.ఇది కూడా చదవండి: సింగిల్ శాలరీతో కష్టమే.. మారిన ఆర్థిక సూత్రం -
గాయత్రి మర్డర్ మిస్టరీ.. ముస్సోరిలో జరిగిన అసలు కథ! పేరెంట్స్ చెప్పిన షాకింగ్ నిజాలు
-
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
-
గర్భిణీపై కనికరం లేకుండా.. నీళ్ల బకెట్లో ముంచి..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో, ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. నిత్యం ఆమెను ఇంట్లోనే బంధించి నరకం చూపించడమే కాకుండా, చివరకు ఆమె తలను నీళ్ల బకెట్లో ముంచి ప్రాణాలు తీసిన ఈ ఘటనా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.రోజుకు 10 గంటల గృహ నిర్బంధంఢిల్లీలోని లాజ్‌పత్ నగర్లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే అమిత్ గుప్తా (26) అనే వ్యక్తికి, నేహా కుమారి (23) అనే మహిళతో వివాహమైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అమిత్, ఆమెను ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి రాత్రి 7 గంటల వరకు తను ఆఫీసుకు వెళ్లే సమయంలో, నేహాను కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోనే పెట్టి బయట నుండి తాళం వేసేవాడు. ఒంటరిగా మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా ఆమెకు అనుమతి ఉండేది కాదు. ఈ విషయాన్ని నేహా తన పుట్టింటి వారితో చెప్పినప్పటికీ వారు ఎప్పుడూ ఆమె భర్తను నచ్చజెప్పలేదు.బకెట్ నీళ్లలో ముంచి దారుణ హత్యకొన్నాళ్ల నుండి అమిత్ ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమిత్.. గర్భవతి అని కూడా చూడకుండా నేహా తలను బలవంతంగా నీళ్లతో నిండిన బకెట్లో ముంచి శ్వాస ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. శనివారం నాడు మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మృతురాలికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై పూర్తి నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.కట్నం కోసమేనా? పోలీసుల దర్యాప్తుఈ దారుణానికి సంబంధించి ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్పాల్ యాదవ్ కీలక విషయాలు వెల్లడించారు. నేహా తండ్రి.. అల్లుడు అమిత్ ఒత్తిడి తట్టుకోలేక ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, దానిని అమిత్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, వారి కోసం ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు అమిత్ గుప్తా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్..? కేతన్ బట్టతలే హత్యకు కారణమా?
-
కేతన్ అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్..? కొత్త విషయాలు వెలుగులోకి!
-
పెద్ద సైకో... వాడు మళ్లీ బయట తిరగకూడదు రాధా గాయత్రి తండ్రి, పిన్ని
-
కేతన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచలన నిజాలు!
-
కేతన్ హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు
-
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించారని.. ఆ గ్యాంగ్ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్‌తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్‌పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్‌కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. -
ఆ నలుగురిదీ హత్యే
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురూ హత్యలకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ, ఛాతీ భాగంలో గాయాలు ఉండటంతో ఇది కచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితులకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు లభించలేదు.పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కరాటే వచ్చిన ముజమిల్ ప్రతిఘటించడంతో 16 చోట్ల విచక్షణారహితంగా పొడిచి ఉండొవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులకు భయపడి 11 ఏళ్ల అక్సర మంచం కింద దాక్కుంటే ఆమెను బయటకు లాగి చంపి ఉంటారని.. ఆమె మృతదేహం సగం మంచం కింద ఉండటాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే హత్యల అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంతో దుండగులు పక్కా ప్రణాళికతోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో 20 మంది!ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మృతుల మొబైల్ కాల్‌డేటా ఆధారంగా 20 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆస్తి గొడవలు, బంధువులతో విభేదాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల కిందట మృతుల ఇంట్లో దొంగతనం జరగడం.. తాజాగా హత్యల అనంతరం ఇంట్లోని బీరువాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో ఈ రెండు ఘటనలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇల్లు పట్టణానికి చివరన ఉండటంతోపాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. అయితే ఘటన జరిగిన రాత్రి ఇంట్లో కేకలు వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. ఆ కుటుంబంలో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుండటంతో ఆ రోజు కూడా అదే జరుగుతోందని భావించి దృష్టిపెట్టలేదంటున్నారు. మూడు రోజుల తర్వాత ఇంట్లో దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్
-
రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోటవద్ద రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కాబోయే కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ కుటుంబం చివరికి కాబోయే కోడలి క్రూరత్వానికి బలైపోయింది. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని తీవ్ర ఆవేదన మిగిల్చింది.కన్నతల్లి ఆవేదన.. ఆఖరి మాటలుకొడుకు మరణవార్త విన్న కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గుండెకోత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతున్నారు. తనే పంపించానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అసలు ఆ రోజు లోహగఢ్ కోట ట్రిప్‌కు వెళ్లమని కేతన్‌ను ఒప్పించింది అతని తల్లే. దాంతో కొడుకును మృత్యుపాశంలోకి తానే నెట్టేసానని తల్లి తల్లడిల్లిపోతోంది. ఆమె తీరని ద్రోహం చేసింది. మా యింటి పిల్ల అనుకున్నాం. కలిసి షాపింగ్‌లు చేశాం, కలిసి భోంచేశాం కానీ ఇంత దారుణానికి తెగ బడుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కాబోయే కోడలి గురించి తల్లి, కొడుకుతో చెప్పిన చివరిమాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు."My son is no more. Siya betrayed us. We treated her like family, went shopping and had dinners together, but never imagined this," said Ketan Agarwal's grieving mother. 💔 Meanwhile, Ketan's father has appealed for a fast-track trial and the strictest punishment for the… pic.twitter.com/ebQ5MkWggS— Megh Updates 🚨™ (@MeghUpdates) June 24, 2026చివరి మాటలుకేతన్ ట్రిప్‌కు బయలుదేరే ముందు తల్లి రాఖీ అగర్వాల్ అతనికి చెప్పిన చివరి మాటలు.. ‘‘సియాను జాగ్రత్తగా చూసుకో. ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టకు’’ అని కొడుకు ప్రాణాలు తీయబోయే అమ్మాయి గురించే ఆ తల్లి ఆఖరి నిమిషం వరకు అంతగా తాపత్రయపడటం అందరినీ కలచివేస్తోంది.35 ఏళ్ల బంధంఅగర్వాల్, గోయల్ కుటుంబాల మధ్య 35 ఏళ్ల పరిచయం అందుకే రాఖీ అగర్వాల్ కాబోయే కోడలు సియాను తన సొంత కూతురిలా చూసుకున్నారు. అలాంటి సియానే తన కొడుకును చంపడానికి కుట్ర పన్నిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయారు.తండ్రి మరో వాదనకేతన్ తండ్రి పుణేలో ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ ఈ హత్యకు సంబంధించిన మరికొన్ని భయంకరమైన వివరాలను పంచుకున్నారు. కేతన్‌ను కోట పైనుంచి కిందకు నెట్టేయడానికి ముందే.. సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి పదునైన ఆయుధంతో కేతన్ తలపై బలంగా కొట్టారు. అతడు స్పృహ తప్పేలా లేదా కనీసం తప్పించుకోలేనంత బలహీనపడేలా చేసిన తర్వాతే పైనుంచి కిందకు నెట్టేసి చంపేశారని వాపోయారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలిపోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు త్వరగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయడమే నా ఏకైక డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక కావాలి అని తండ్రి విశాల్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.బర్త్‌డే వేడుక కోసం స్టార్ హోటల్లో 70 రూములు తన కుమారుడి కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకను మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ మహాబలేశ్వర్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, సియా మనసులో తన కుమారుడికి సంబంధించి ఒక భయంకరమైన పథకం ఉందని ఆయనకు తెలియదు.జూన్ 20న మహాబలేశ్వర్‌లో సియా పుట్టినరోజును కేతన్, సియా, కుటుంబాలు కలిసి జరుపుకోవాలని అనుకున్నాయి. ఇందుకోసం కేతన్ తండ్రి ఆ హిల్ స్టేషన్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. అయితే, ఆ ప్లాన్‌ను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ఒంటరిగా వెళ్లేలా సియా కేతన్‌ను ఒప్పించింది. ప్రియుడితో కలిసి తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన కేతన్‌ను హతమార్చింది.రూ. 17 కోట్ల పెళ్లి వేడుక.. అంతలోనే విషాదంకేతన్ (26), సియా (20) ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌ను రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకురావడానికి రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కొడుకు ముస్తాబులో చూడాలనుకన్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారిపోవడం కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్ఎవరీ కేతన్ అగర్వాల్కుటుంబ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'సక్సెస్ గ్రూప్'కు డైరెక్టర్‌గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO)గా ఉండేవారు. పూణేలో నివసించేవారు.ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు. సింబయాసిస్ యూనివర్సిటీ నుండి బీబీఏ డిగ్రీని కూడా పొందారు. కేతన్ లింక్డ్ఇన్ బయో ప్రకారం, సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉండటమే కాదు, కేవలం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా, పచ్చని భవిష్యత్తుకు దోహదపడే ప్రాజెక్టులపై దృష్టి సారించారు.ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!కాగా కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది, నవంబర్‌లో వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న, సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కేతన్ లోయలో పడి మరణించాడు. సియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించినప్పటికీ, విచారణలో సియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఎత్తు నుండి కిందకు తోసేశారని తేలింది. ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు -
‘ముంబై లోకల్’: వర్షం గొడవలో యువకుడి దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. లోకల్ ట్రైన్లో ఊహించని దారుణం జరిగింది. రైలు కోచ్ తలుపు తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. తోటి ప్రయాణికుడిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, పదునైన ఆయుధంతో కడుపులో పొడవడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.తలుపు వివాదం.. ప్రాణాంతక దాడిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ లోహర్ (22) అనే యువకుడు చర్చిగేట్ నుంచి నల్లాసోపారా వెళ్లే ఫాస్ట్ లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాడు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోచ్ తలుపును తెరిచి ఉంచాలా లేదా మూసివేయాలా అనే విషయమై మయాంక్‌కు, మరో ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సదరు గుర్తుతెలియని దుండగుడు అకస్మాత్తుగా పదునైన ఆయుధాన్ని తీసి, మయాంక్ కడుపులో బలంగా పొడిచాడు. రాత్రి 11:04 గంటలకు రైలు బోరివలీ స్టేషన్‌కు చేరుకోగానే, రైలు పూర్తిగా ఆగకముందే నిందితుడు జనం రద్దీలోకి దూకి పారిపోయాడు.రైల్వే అధికారుల తక్షణ స్పందనరైలు బోరివలీ స్టేషన్లో ఆగడమే ఆలస్యం.. పశ్చిమ రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను పోర్టర్ల సహాయంతో అత్యవసరంగా బోరివలీ స్టేషన్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు రాత్రి 11:42 గంటలకు కందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ.. క్షతగాత్రుడికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించామన్నారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపుఈ దారుణ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ముంబై సెంట్రల్), సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బోరివలీ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా అంధేరి, మలాడ్, బోరివలీ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆనవాళ్లను సేకరించి, అతడు ఏ మార్గంలో పారిపోయాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రాధా గాయత్రి కేసుపై వివరణ ఇచ్చిన శ్రీచరణ్ తండ్రి
-
తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?
పట్నా: బిహార్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆర్జేడీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ఆకాష్ యాదవ్‌తో పాటు మరో ఏడుగురు కలిసి తనను, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన సచివాలయం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు, తనకు తక్షణమే భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.నివాసంలోకి చొరబాటు.. ప్రతిపక్షాల కుట్ర?తనను అంతమొందించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. పట్నాలోని తన నివాసంలోకి నలుగురు వ్యక్తులు బలవంతంగా చొరబడ్డారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే వారు పరారయ్యారని మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపిన ఆకాష్ యాదవ్, ఈ తరహా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తనను ఒకేసారి మట్టుబెట్టాలనేది వారి ప్లాన్ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.రివర్స్ కేసు.. చిన్నారి అపహరణ బెదిరింపులుఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తేజ్ ప్రతాప్‌పై కూడా పట్నాలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆకాష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఒక నివాసంలోకి తేజ్ ప్రతాప్ బలవంతంగా దూసుకెళ్లారని, అక్కడ ఉన్న ఒక చిన్నారిని తన ‘కూతురు’గా పిలుస్తూ, ఆమెను కలవనివ్వకపోతే అపహరిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో అమెరికా నంబర్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాయిస్ నోట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపే..తనపై వచ్చిన ఆరోపణలను తేజ్ ప్రతాప్ యాదవ్ పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో సదరు వ్యక్తి ప్రవర్తనపై తాను చట్టపరమైన నోటీసులు పంపినందుకే, కక్ష గట్టి తనపై తప్పుడు కథనాలతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వివాదాల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడైన తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడుతున్నాయా? -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
సీక్రెట్ పెళ్లి, ఫస్ట్ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!
బెంగళూరులో వరుస ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల యువతి శవమై కనిపించగా, స్పృహతప్పి పడివున్న ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇద్దరూ కలిసి చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నమా లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? మిస్టరీగా మారింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, భవాని (22) ఒక మొబైల్ షోరూమ్‌లో పనిచేస్తూ పశ్చిమ బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. భవానీ, చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుమారు ఏడాది క్రితం తమ కుటుంబాలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే చంద్రశేఖర్‌కు అప్పటికే పెళ్లయ్యి, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.ఇన్స్టాగ్రామ్ స్టోరీతో వెలుగులోకిజూన్ 13న భవాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక స్టోరీ పెట్టింది. హ్యాపీ యానివర్సరీ అంటూ చంద్రశేఖర్ కలిసి ఉన్న ఒక ఫోటో స్టోరీగా ప్రత్యక్షమైంది. తమ తొలిపెళ్లి రోజు సందర్భంగా చంద్రశేఖరే ఆ ఫోటోను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు భవాని కుటుంబ సభ్యులను ఈ పోస్ట్ అలర్ట్ చేసింది. అనుమానంతో వారు వరుసగా భవానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు చేసినా ఆమె ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. అందోళనతో ఆమె తండ్రి ఇంటి యజమానికి సమాచారం అందించారు. యజమాని, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా భవాని మృతి చెంది ఉంది, చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.భవాని తండ్రి సమాచారం ప్రకారం, భవానికీ ఇటీవల పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా చేయాలని భావించారు. బహుశా ఈ విషయం భవాని చంద్రశేఖర్‌కు చెప్పడం వల్లే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుందామని చంద్రశేఖర్ ఆమెను ఒప్పించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విషం తాగిన తర్వాత భవానికి వాంతులు అవ్వడంతో, చంద్రశేఖర్ ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత అతడు కూడా ఎక్కువ మొత్తంలో విషం తాగి ఉంటాడే అనేది ప్రాథమిక అంచనా.ప్రస్తుతం చంద్రశేఖర్ కోలుకోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భవాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఫొరెన్సిక్, మెడికల్ రిపోర్టులు వస్తే తప్ప ఇది ముందే ప్లాన్ చేసి చేసిన హత్యా, లేక ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై చేసిన హత్యా అనేది తెలిసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది
గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్వాడీకి చెందిన షేక్ మసూద్ అలియాస్ చాందిని మసూద్ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మూడేళ్లుగా షేక్ మసూద్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్ మసూద్ తన బస్తీ కుమ్మర్వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్ మసూద్‌ను సూటిపోటి మాటలతో వేధించేవారు.దీంతో మసూద్ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్ బావమరుదులు మసూద్‌ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్ సోహెల్‌తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్‌తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్ మసూద్ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్‌కు, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్‌తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్‌పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్‌తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. స్పాట్లోనే మృతి
హన్సి: హర్యానాలోని హన్సి జిల్లాలో ఒక జిమ్ యజమానిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపి పారిపోయారు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే పది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫవ్వారా చౌక్ సమీపంలో గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని కపిల్‌గా గుర్తించారు.ఆయన తన ఫిట్నెస్ సెంటర్ వెలుపల వ్యాయామం చేయిస్తున్న సమయంలో, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. హెల్మెట్లు, మాస్కులు ధరించిన ఆ నిందితులు అత్యంత సమీపం నుండి కేవలం ఐదు సెకన్లలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో శిఖ అనే మహిళ కూడా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఆధారాలు సేకరించాయి. ఈ కేసు దర్యాప్తును హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)కి అప్పగించారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నామని, అయితే ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.ఢిల్లీలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ కలకలంఇదిలావుండగా గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో ఉన్న ఒక జిమ్ వెలుపల కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జిమ్‌పై సుమారు ఏడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఢిల్లీ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. -
ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి..
తెహ్రీ గర్హ్వాల్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఒక విషాద ఘటన వెలుగుచూసింది. తమ ఇంటి అమ్మాయితో స్నేహం చేశాడనే నెపంతో 18 ఏళ్ల ఒక దళిత యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయగా, పోలీసులు నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.అర్ధరాత్రి పిలిచి..మృతుడు కేతన్ లాల్ గత ఆరు నెలలుగా సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో, కేతన్ తన స్నేహితుడైన దివాకర్ దిమ్రీతో కలిసి ఆమె నివసించే ఖోల్గఢ్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడకు చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు వీరిద్దరినీ ఒక గదిలో బంధించి, కర్రలతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు.రక్తపు మడుగులో కుమారుడుమరుసటి రోజు ఉదయం ఆ యువతి తండ్రి.. కేతన్ తండ్రి ధన్పాల్ లాల్‌కు ఫోన్ చేసి, నీ కొడుకును వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ధన్పాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, కేతన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో గాయపడిన కేతన్ స్నేహితుడు దివాకర్ ప్రస్తుతం బౌరారీలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్ఈ ఘోర ఉదంతంపై తెహ్రీ గర్హ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌబే స్పందిస్తూ.. నిందితులపై ఐపీసీ హత్య సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యశ్వీర్ సింగ్ పన్వార్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! -
బాలిక హత్యాచారం కేసులో దంపతులకు ఉరి
ఢాకా: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన దంపతులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని న్యాయవాదులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న 19 రోజుల్లోనే ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ ఈ ఘనత సాధించిందన్నారు. మే 18వ తేదీన ఢాకాలోని పల్లబి ప్రాంతంలోని ఓ 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమెను అక్కడే ఓ అపార్టుమెంట్లో ఉండే సోహెల్ రాణా కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అతడికి భార్య స్వప్నా ఖాతూన్ సహకరించింది. అనంతరం ఆ బాలికను ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేసి సోహెల్ పరారయ్యాడు. పోలీసులు 19వ తేదీన సోహెల్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జడ్జి మస్రూర్ సలెకిన్ ఆదివారం తీర్పు వెలువరించారు. నిందితులు ఇద్దరికీ ఉరి శిక్షతోపాటు, రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను వేలం వేసి, వసూలు చేయాలని ఆదేశించారు. -
ఆస్తికోసం తల్లిదండ్రులు, సోదరి హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన
ప్రయాగ్‌రాజ్ : డబ్బు, ఆస్తి మీద విపరీమైన వ్యామోహంతో ఎంతటి దారుణానికైనా తెగ బడుతున్నారు మనుషులు. మానవ విలువల్ని, బంధాల్ని బంధుత్వాల్ని మరిచి సొంత తల్లిదండ్రులను, తోగబుట్టిన సోదరిని హత్య చేశాడో దుర్మార్గుడు. చివరికి అతను కూడా అదే అత్యాశకు బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలోఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదనే సూత్రం వీరి విషయంలో అక్షరాలా నిజమైంది.పోలీస్ కమిషనర్ జోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ మలకా ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. వీరేంద్ర వైశ్య, ఆయన భార్య తమ ఆస్తి నుండి కుమారుడు అభిషేక్‌కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అభిషేక్. తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు సన్నీ గుప్తాను ఇంటికి పిలిపించు కున్నాడు. ప్లాన్ ప్రకారం వారిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఇంటో దొంగిలించిన విలువైన వస్తువులను పంచుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణానికి వెళ్లారు. అయితే ఈ పంపకాల సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఏరాడ్తో అయితే తల్లిదండ్రులను హత్య చేశాడో అదే రాడ్‌తో అభిషేక్‌ను హత్య చేసి, శవాన్ని దుకాణంలోనే వదిలేసి, షాప్‌కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు సన్నీ.రెండు రోజుల తరువాత ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భయంకరమైన దృశ్యం కనిపించింది. మే 31 సాయంత్రం అభిషేక్, గుప్తాతో కలిసి వీరేంద్ర, అనిత, మీనాక్షిలను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనిత (65), కుమార్తె మీనాక్షి (45) మృతదేహాలను స్వాధీనం తీసుకున్నారు.మొదట, అభిషేక్ హంతకుడై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావించి, అతని కోసం గాలించారు.. కానీ మృతదేహాలపై డిటర్జెంట్, శుభ్రపరిచే రసాయనాలుపూసి ఉండటంతో, రక్తపు మరకలున్న టీ-షర్టు, కుటుంబ కలహాలు, ఆభరణాలచోరీ , నకిటీ నోట్ ఆధారంగా హత్య పథకాన్ని వారు వెలికితీశారు. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తాళం వేసిన దుకాణాన్ని బలవంతంగా తెరిచారు. అక్కడ అభిషేక్ వైశ్య (40) మృతదేహం లభించింది. సిసిటివి ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితుడైన సన్నీ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి బంగారం, 360 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఫ్యామిలీ బిజినెస్ వీరేంద్ర వైశ్య ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త. భార్య అనిత, కుమార్తె మీనాక్షి, పెద్ద కుమారుడు అభిషేక్‌తో కలిసి ఆ భవనంలో నివసించేవాడు. కింది అంతస్తులో సుమారు 15 నుండి 16 దుకాణాలు ఉండేవి, వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చి, ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించేవి. లిక్విడ్ డిటర్జెంట్ మరియు టాయిలెట్ క్లీనర్లతో సహా వెస్టిజ్ ఉత్పత్తులను అమ్మే దుకాణాన్ని అభిషేక్ నడిపేవాడు. మరొకటి మీనాక్షికి చెందింది. ఆమె ఇటీవలే ఒక గిఫ్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.చిన్నకొడుకుతో విభేదాలు, తప్పుడు నోట్కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు, సుమారు 15 ఏళ్ల క్రితం వీరేంద్ర తన చిన్న కొడుకు అశ్వినిని తన కొడుకు కాదని వదిలేశాడని సమాచారం. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పదేపదే తలెత్తుతూ ఉండేవి. వీరిద్దరినీ బంటీ, బబ్లూ అని పిలిచేవారు. ఈ హత్యను తప్పు దారి పట్టించేందుకు బంటీ , కోడలు బబ్లూనే చంపారు అనే నోట్ వదిలారు. అయితే వివాహ వెబ్సైట్ మోసాలకు సంబంధించిన ఒక కేసులో అశ్విని, రితు 2024లో జైలు పాలయ్యారు. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్‌గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్‌లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్‌పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్‌కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్‌ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్‌తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్‌కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్‌సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్‌కు పరిచయస్తుడైన మునీర్‌లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
హైదరాబాద్ లో హత్య కలకలం.. గంజాయి మత్తులో దారుణం
-
నల్లమాడులో జంట హత్యలు
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో మూడు రోజులు క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీ కుమార్తెగా గుర్తించారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనంతపల్లికి చెందిన గంటా అంథోబాయికి నలుగురు పిల్లలు. వీరిలో వెంకటలక్ష్మి అంధురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్టులో ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది.తల్లి అంథోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీరితోనే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లీకుమార్తె బయలుదేరి ఫంక్షన్‌కు వెళ్లేందుకు దూబచర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దూబచర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కుమారుడికి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వారి ఫోన్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్లగా అక్కడ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుకుని వివరాలు సేకరించారు. జంట హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వారని చెప్పడంతో వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లీకుమార్తె ఆటో ఎక్కి ఉండవచ్చని... ఆటో డ్రైవర్ వీరిని నల్లమాడు ఆయకట్టు పరిధిలోని జీడితోటలోకి తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్‌లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్‌ను హుటాహుటిన పనవూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్‌కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్‌లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!
రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్‌సింగ్ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్‌తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్మెంట్ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్‌సింగ్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు, ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు విషయం బయటపడింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్ కొడుకు కలిసి.. తొలుత రామ్సింగ్ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్‌సింగ్ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్‌కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసి..పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం..
మంచిర్యాల క్రైం: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడి చేత హత్య చేయించింది. ఇందుకోసం భర్త పేరిట ముందే రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు చేయించి వాటిని కూడా సొంతం చేసుకోవాలని పథకం రచించింది. ఆపై ఎవరికీ అనుమానం రా కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూడటంతో చివరకు కటకటాలపాలైంది. మంచిర్యాలలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సాయిని కుమార్ (40) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లిన కుమార్.. ముల్కల్ల శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీ సులకు సమాచారం అందించారు. అయితే కుమారుడి మర ణం అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం నుంచే.. గుడిపేటకు చెందిన రామ్‌మల్లేశ్ వద్ద కుమార్ గతంలో రూ. 60 వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రామ్ మల్లేశ్ తన అప్పు తీర్చాలంటూ తరచూ కుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. చంపుతానని కూడా బెదిరించేవాడు. ఈ క్రమంలో రామ్‌మల్లేశ్ భారతికి దగ్గరయ్యాడు. అప్పటికే ఆమె గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భారతి, కుమార్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భారతి ఏడాది క్రితమే నిర్ణయించుకుంది. లోన్ యాప్‌లో అప్పు చేసి బీమా పాలసీలు.. భర్తను హత్య చేస్తే వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోతుందని.. అదే సమయంలో భర్త పేరిట బీమా చేయిస్తే రూ. కోట్లు పొందొచ్చని భారతి భావించింది. ఇందుకోసం ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షలు అప్పు చేసి గతేడాది జనవరిలో భర్త కుమార్ పేరిట వివిధ బీమా కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన పాలసీలు తీసుకుంది. అనంతరం భర్త హత్యకు రూ.10 లక్షలతో రామ్ మల్లేశ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారిద్దరూ పథకం వేసుకున్నారు. రామ్‌మల్లేశ్... తనకు పరిచయం ఉన్న మంచిర్యాల ఎల్ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్‌కుమార్ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమార్లు కుమార్‌తో కలిసి ముల్కల్ల శివారులో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న కుమార్‌ను ఇనుప సుత్తితో తలపై కొట్టి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కనే మోటార్ సైకిల్ పడేసి వెళ్లిపోయారు. కుమార్ మృతిచెందడం, అతని తల్లి ఈ మరణంపై అ నుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భార్యపైనే అనుమా నం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య చేసింది రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమారేనని.. చేయించింది భారతి అని నిర్ధారించారు. అలాగే భారతితో వివాహేతర సంబంధం కొనసాగించిన లగిశెట్టి సురేందర్‌పైనా కేసు నమోదు చేశారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై కిరణ్‌కుమార్ రెండ్రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం భారతి, రామ్‌మల్లేశ్, సురేందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీరాంకుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సంగారెడ్డి ముత్యంరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు
-
తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్‌ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్‌ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్‌ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్‌తో సహా నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


