మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి | Youth Brutally Murdered In Hyderabad Pahadishareef | Sakshi
Sakshi News home page

మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి

Jul 7 2026 7:05 AM | Updated on Jul 7 2026 7:05 AM

Youth Brutally Murdered In Hyderabad Pahadishareef

పాత గొడవలతో యువకుడి దారుణ హత్య

ఘాతుకానికి ఒడిగట్టింది స్నేహితులే..

హైదరాబాద్‌, పహాడీషరీఫ్‌: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  బాలాపూర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్‌ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ బాల్కషర్‌ (29) జిమ్‌ కోచ్‌తో పాటు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సయీద్‌ బిన్‌ ఫైసల్‌ బామ్, సాలం బామ్‌ అనే స్నేహితులు ఉన్నారు.

వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్‌ను స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్‌పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement