హర్దీప్‌ నిజ్జర్‌ను చంపింది మేమే | Gangster Goldy Brar Claims He Killed Hardeep Nijjar In Canada | Sakshi
Sakshi News home page

హర్దీప్‌ నిజ్జర్‌ను చంపింది మేమే

Aug 24 2026 5:46 AM | Updated on Aug 24 2026 5:46 AM

Gangster Goldy Brar Claims He Killed Hardeep Nijjar In Canada

ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంలో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ పాత్ర 

న్యూఢిల్లీ: కెనడాలో 2023లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు తనదే బాధ్యతని గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ప్రకటించుకున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం డ్రగ్స్‌ దందాను నిజ్జర్‌ ప్రోత్సహిస్తున్నందుకే నిజ్జర్‌ను తన ముఠా చంపిందని తెలిపాడు. యూకేకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్‌ సింగ్‌ పమ్మాతో కొంతకాలం క్రితం గోల్డీబ్రార్‌ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బ్రార్‌ ఇందులో నిజ్జర్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందో పమ్మాకు చెప్పాడు.

 ‘టీనేజర్లను బెదిరించి డ్రగ్స్‌ దందాకు వాడుకున్నాడు. వారితో కావాల్సినవిధంగా పనులు చేయించుకునేవాడు. ఆయుధాల స్మగ్లింగ్‌తో అతడికి సంబంధాలున్నాయి. అందుకే చంపేశాం’అని బ్రార్‌ అంటున్నట్లుగా అందులో ఉంది. కాగా, 2023 జూన్‌ 19వ తేదీన ఓ గురుద్వారా వద్ద హత్యకు గురయ్యాడు. ఇది భారత ప్రభుత్వం చేయించినపనే అంటూ అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా, నిజ్జర్‌ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు ప్రకటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement