breaking news
Khalistani terrorists
-
ఖలిస్తానీ శక్తుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: ద్వీపదేశమైన న్యూజిలాండ్‌లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్‌ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్‌మ్యాప్ భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇండో–పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి. విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్‌కు భారత్, న్యూజిలాండ్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్‌లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.అందుకే క్రికెట్ మాట ఎత్తలేదు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో క్రికెట్ అంశం ప్రస్తావనకు రాలేదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించానని అన్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య దౌత్య సంబంధాల దెబ్బతినకుండా అడ్డుకోవాలన్నదే తన ఆలోచన అని వివరించారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వేశారు. సోమవారం భేటీ తర్వాత లక్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోïఫీలో భారత్ చేతిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఓడిపో యిన సంగతి తెలిసిందే. అలాగే ఇండియాలో జరిగిన టెస్టు క్రికెట్ సిరీస్‌లో న్యూజిలాండ్ నెగ్గింది. తమ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడనందుకు మోదీని అభినందిస్తున్నానని లక్సన్ చెప్పారు. మరోవైపు మోదీ, లక్సన్ కలిసి సోమవారం ఢిల్లీలోని చరిత్రాత్మక గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్
కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో గత ఆదివారం హిందూ టెంపుల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఖలిస్తానీ నిరసనల ప్రధాన నిర్వాహకుడు ఇందర్జీత్ గోసల్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై హింసాత్మక దాడికి సంబంధించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ రీజినల్ పోలీసులు(PRP) వెల్లడించారు. నిందితుడు ఖలీస్తానీ వేర్పాటువాద గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని షరతులపై విడుదల చేశామని తెలిపారు. బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ముందస్తుగా పేర్కొన్న తేదీన హాజరుకావలసి ఉంటుందని అతనికి తెలియజేశారు. మరోవైపు.. టెంపుల్‌పై దాడి జరిగిన అనంతరం.. నవంబర్ 3, 4 తేదీల నుంచి చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలించడానికి పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై జరిగిన దాడిపై ఇండో-కెనడియన్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో, కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.Glad that @PeelPolice has finally charged Khalistani extremist Inderjeet Gosal of Brampton for assault with a weapon. He was arrested yesterday but released on conditions. We urge @PeelPolice to also arrest / charge other accomplices of Gosal and their operators who are behind… pic.twitter.com/nBGKt4EjcT— VHP Canada (@vhpcanada) November 10, 2024ఎవరీ ఇందర్జీత్ గోసల్?ఇందర్జీత్ గోసల్‌కు సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ పన్నూకు లెఫ్టినెంట్‌గా గుర్తింపు ఉంది. గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు కెనడియన్ ఆర్గనైజర్‌గా నియమించబడ్డాడు. కెనడియన్ పోలీసుల ప్రకారం.. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది కెనడియన్లలో గోసల్ కూడా ఉన్నట్లు తెలిపారు.చదవండి: ఉక్రెయిన్, పశ్చిమాసియాపై ఏం చేస్తారు? -
కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందువులపై దాడి వీడియోలు వైరల్
-
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్‌స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు -
Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్
అమెరికాలోని స్వామినారాయణ్ మందిర్ గోడలపై విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదుల ఆగడాలకు ఎట్టిపరిస్థితుల్లో చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్.. ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూఎస్ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తాను చూసినట్లు జైశంకర్ మీడియాకు తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే.. తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఈ ఘటన భారతీయుల మనోభావలను కించపరిచింది. వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యూఎస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. #WATCH | On Swami Narayan temple in Newark, US defaced with pro-Khalistani slogans, EAM Dr S Jaishankar says, "I have seen it. Extremists, separatists and such forces should not be given space. Our Consulate there complained to the government and the police and an inquiry is… pic.twitter.com/dfEzsfeeT8 — ANI (@ANI) December 23, 2023 స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది విద్వేశాలు రెచ్చగొట్టే చర్యల కిందకి వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ ట్వీటర్లో కోరింది. చదవండి: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
America: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు
కాలిఫోర్నియా : అమెరికాలోని స్వామినారాయణ్ గుడి గోడలపై విద్వేష రాతలు వెలిశాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మద్దతు నినాదాలతో గుడి గోడలను నింపేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ పట్టణంలో ఉన్న ఈ స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది హేట్ క్రైమ్ కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్వీట్లో కోరింది. హిందై అమెరికన్ ఫౌండేషన్ విజ్ఞప్తిపై నెవార్క్ పోలీసులు సానుకూలంగా స్పందించారు. గుడి గోడలపై విద్వేష పూరిత రాతలు రాసిన ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికా, కెనడాలో ఇలాంటి విద్వేష నేరాలు తరచూ రికార్డవుతున్నాయి. జీ 20 సదస్సు సమయంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లపైనా ఖలిస్తానీ అనుకూల రాతలు వెలిశాయి. #Breaking: Swaminarayan Mandir Vasana Sanstha in Newark, California was defaced with pro-#Khalistan slogans.@NewarkCA_Police and @CivilRights have been informed and full investigation will follow. We are insisting that this should be investigated as a hate crime. pic.twitter.com/QHeEVWrkDj — Hindu American Foundation (@HinduAmerican) December 22, 2023 ఇదీచదవండి..హిట్లర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
లండన్: ఖలిస్థాన్ మద్దతుదారుల సెగ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను కూడా తాకింది. ఇంగ్లాండ్‌లోని భారత దౌత్యాధికారి దొరైస్వామి యూకేలోని గురుద్వారాకు రాగా ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. శనివారం భారత హైకమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో సిక్కు గురుద్వారాకు వచ్చారు. వెంటనే అక్కడి ఖలిస్థాన్ మద్దతుదారులు ఆయనను కారులో నుంచి దిగకుండానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్ళిపోమంటూ కోపంగా వారించారు. దీంతో దొరైస్వామి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి 'సిక్కు యూత్ యూకే' ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకరు కెనడాలోనూ ఇతర దేశాల్లోనూ భారత దౌత్యాధికారులపైన కూడా మాలాగే తిరగబడాలని పిలుపునిచ్చారు. మరో మద్దతుదారుడు మాట్లాడుతూ.. భారత్ దౌత్యాధికారులైన ఇతర అధికారులైనా ఎక్కడ గురుద్వారాకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కెనడాలో ఏం జరుగుతుందో మాక్ తెలుసు. కెనడా ప్రధాని ఏవిధంగా అయితే భారత చర్యలను తప్పుబట్టి భారత దౌత్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. భారత దౌత్యాధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇంగ్లాండ్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యపై బీజీపీ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం వారైనా గురుద్వారాలోనికి ప్రవేశించవచ్చన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గ్రేవాల్ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యను తప్పుబట్టారు. గురుద్వారాలోనికి ప్రవేశించే వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని అన్నారు. Heightened activity by Khalistanis outside of India. This is not Canada, this is Glasgow. Should the UK government not take serious note of this? How would’ve the UK responded if something like this would’ve happen with a British diplomat in India? An Indian diplomat is… pic.twitter.com/zIt6JM6hxg — Sneha Mordani (@snehamordani) September 30, 2023 ఇది కూడా చదవండి: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్? -
ఉగ్రవాదులకు అడ్డగా కెనడా: భారత్‌కు శ్రీలంక మద్దతు
శ్రీలంక విదేశాంగశాఖ మంత్ర అలీ సబ్రీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెనడా భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై మంగళవారం ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంతమంది ఉగ్రవాదులకు కెనడా సురక్షిత ప్రాంతంగా మారిందని విమర్శించారు. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఎటువంటి ఆధారాలు లేకుండానే దారుణమైన ఆరోపణలతో ముందుకొచ్చినట్లు అనిపిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి ఆరోపణలే శ్రీలంకపై కూడా చేశారు. కానీ మా దేశంలో ఎలాంటి హత్యాకాండ జరగలేదని అందరికీ తెలుసు. అంతేగాక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలిసి పనిచేసిన వారికి కెనడా పార్లమెంట్‌లోకి ట్రూడో ఆహ్వానించి, సత్కరించడం నిన్న చూశాను. ఆయన చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. ట్రూడో సంగతి నాకు తెలుసు. అందుకే నిరాధార ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడం నాకేం ఆశ్యర్చం అనిపించలేదు. చదవండి: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల కెనడాలో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి రెండో ప్రపంచ యుద్ధ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను స్పీకర్ ఆంటోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు అంటూ స్పీకర్ పొగడటంతో.. అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, జలెన్‌స్కీ సహా అందరూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. దీనిపై వివాదం చెలరేగడంతో.. పొరపాటు జరిగిందంటూ ఆదివారం స్పీకర్ ఆంటోనీ క్షమాపణలు చెప్పారు. దీనిపై తాను రాజీనామాకు కూడా సిద్దమేనని ప్రకటించారు. అటు, కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇలా జరిగినందుకు కలత చెందానని అన్నారు. ఇది కెనడా పార్లమెంటుకు, కెనడియన్లందరికీ చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పారు. -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని శివాజీ పార్కు నుండి పంజాబ్ బాగ్ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ తీవ్రవాదుల నినాదాలు కలకలం సృష్టించాయి. ఈ మేరకు SFJ సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారుల నుండి సమాచారాన్ని అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదని, మోదీ భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో ఈ నినాదాలను రాశారు దుండగులు. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జీ20 సదస్సుకు కొద్దిరోజుల ముందు ఖలిస్తానీలు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసి 450కి పైగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను పీసీఆర్ వ్యాన్లు, 50కి పైగా అంబులెన్స్‌లు, ఎయిర్‌పోర్టు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాలతో సహా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. In more than 5 metro stations somebody has written 'Delhi Banega Khalistan and Khalistan Zindabad'. Delhi Police is taking legal action against this: Delhi Police pic.twitter.com/T6U5myjZyv — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..
లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు. మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్‌లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు. This is what we’re up against. The Labour Party, a subset of lawyers, criminal gangs - they're all on the same side, propping up a system of exploitation that profits from getting people to the UK illegally. I have a plan to stop it. Here’s how 🧵https://t.co/ez3rYIU0uQ — Rishi Sunak (@RishiSunak) July 25, 2023 ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి... -
అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఖలిస్తానీ మూకలు మళ్లీ పేట్రేగాయి. ఈసారి అమెరికాలో వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దానిపై దాడికి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన యత్నాన్ని సీక్రెట్ సర్వీస్ పోలీసులు విఫలం చేశారు. ఎంబసీ ఎదుట వారు హింసను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేని దౌత్యాధికారి తరన్‌జిత్ సంధును బహిరంగంగానే బెదిరించారు! ఎంబసీ కిటికీలు, అద్దాలు పగులగొట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టుకున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న పీటీఐ ప్రతినిధినీ దూషించారు. ఆయన్ను నెట్టేస్తూ, ఖలిస్తానీ జెండా కర్రలతో కొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్రివర్ణ పతాకమున్న పోల్‌ను విరగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్, లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద కూడా ఖలిస్తానీ మూకలు గొడవలకు దిగడం తెలిసిందే. కెనడాలోని తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. -
హిందూ ఆలయాల విధ్వంసంపై భారత్ ఫైర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో స్వల్ప వ్యవధిలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల మొదట్లో మెల్బోర్న్లోని స్వామినారాయణ్ ఆలయం, విక్టోరియా కర్రమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్బోర్న్లోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడుదలు జరిగాయి. ఆలయాల గోడలపై భారత్‌కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు. ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘవిద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని.. ఈ దాడులను ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినదని సదరు ప్రకటనలో భారత హై కమిషన్ పేర్కొంది. అంతేకాదు ఈ చర్య.. ఇండో-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఉందని పేర్కొంది. ఖలీస్థానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, సిక్క్స్ ఫర్ జస్టిస్ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలు, ఇతర విద్వేషపూరిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయని అక్కడి ప్రభుత్వాన్ని భారత్ వారించింది. ఇప్పటికే ఆలస్యం అయ్యిందన్న కోణంలో.. దాడికి పాల్పడినవాళ్లను గుర్తించి, తగ్గ కఠిన శిక్షలు విధించాలని.. తద్వారా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే ఆకాంక్ష వెలువరించింది భారత హై కమిషన్ ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ ఈ వ్యవహారంపై బదులిచ్చింది. ప్రస్తుతం విషయం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. భారత్‌లాగే.. ఆస్ట్రేలియా కూడా బహుళ సంప్రదయాల దేశమని, హిందూ ఆలయాల విధ్వంసం తమనూ దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓఫారెల్ తాజాగా ట్వీట్ కూడా చేశారు. -
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉగ్రవాదుల జాబితా ప్రకటించిన కేంద్రం..
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సహా తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా గుర్తించింది. ఈ మేరకు బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వం జాబితా ప్రకటించింది. అమెరికాలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పంజాబ్ యువకులను ఉగ్రవాదంలోకి చేరడానికి ప్రేరేపిస్తున్నాడనే కారణంతో పన్నూన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. యూఏపీఏ కింద ఉగ్రవాదులుగా గుర్తించబడిన వారిలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన గుర్మిత్ సింగ్ బాగ్గా తదితరులు ఉన్నారు. కాగా గత సెప్టెంబర్‌లో.. సవరించిన యూఏపీఏ నిబంధనల ప్రకారం ప్రకటించిన ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీంలతో కలిపి ఈ సంఖ్య 13కు చేరుకుంది. (కీలక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ..) -
పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్‌లు పాక్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఖలిస్తాన్‌కు మద్దతిచ్చే ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు భద్రతా దళం, ఎన్ఐఏ, రా, ఐబీ వర్గాలను ఆదేశించింది. మరోవైపు పంజాబ్‌లోకి ఆయుధాలు తరలిరాకుండా పంజాబ్ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు చేపట్టేందుకు ఖలిస్తాన్‌ను కాంక్షించే ఉగ్రవాదులు చేపడుతున్న శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యూపీలోని అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ యోచిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ సన్నాహాలు చేస్తున్నట్టు ఉగ్రసంస్థ కమ్యూనికేషన్ కోసం వాడుతున్న చాటింగ్ యాప్ టెలిగ్రాం ద్వారా నిఘా వర్గాలు పసిగట్టాయి. -
డ్రోన్లతో భారత్‌లోకి పాక్ ఆయుధాలు
చండీగఢ్: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రమూకలు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు డ్రోన్ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్ తరన్ జిల్లాలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్ జిందాబాద్ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్ పిస్టల్స్ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్ ఫోన్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వైర్లెస్ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. డ్రోన్లు వస్తే పేల్చేస్తాం హిసార్: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్‌సింగ్ క్లేర్ చెప్పారు. భారత్–పాక్ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు. -
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరెస్ట్
చంఢీఘర్ : పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను సోమవారం పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన ఆయుధాలు, పెద్ద ఎత్తున నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో రిజిస్ట్రేషన్ అయిన మారుతీ స్విఫ్ట్ కారులో అమృత్‌సర్‌కు వెళుతున్న బల్వంత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్బజన్ సింగ్, బల్బీర్ సింగ్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో ఆకాశ్‌దీప్ సింగ్, బల్వంత్ సింగ్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ వాదనలకు బలం చేకూరుస్తూ.. జమ్మూ-కశ్మీర్లో మరోసారి భయాందోళనను సృష్టించేందుకు పాకిస్తాన్, భారత్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లో డ్రోన్ల ద్వారా ఎకె-47, గ్రనైడ్లను వదిలివెళ్లినట్లు సమాచారం అందిందని పంజాబ్ పోలీసులు నిర్దారించారు. కేవలం నెల వ్యవధిలోనే 8 డ్రోన్ల ద్వారా ఆయుధాలతో పాటు సాటిలైట్ ఫోన్లను భారతగడ్డపై వదిలివెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఈ డ్రోన్లు అత్యంత వేగంగా ఎగురుతూ 5 కేజీల బరువును సలువుగా మోస్తాయని, సమాచారాన్నివేగంగా పసిగడతాయని వెల్లడించారు. అలాగే వారిని అదుపులోకి తీసుకున్న ప్రదేశంలో సగం కాలిపోయిన డ్రోన్ దొరికిందని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో డ్రోన్‌లో ఇబ్బంది తలెత్తడంతో ఉగ్రవాదులే దానిని కాల్చడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ఆగస్టులో ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను కోరినట్లు పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కల్పించుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. -
ఆ సీఎంను ఎలా హతమార్చామో తెలుసు కదా..!
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపేస్తామంటూ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ మేరకు వరుసపెట్టి ఆడియో రికార్డింగులు ఆయనకు పంపినట్లు తెలుస్తోంది. ''కెప్టెన్, మీ పార్టీ నుంచే బియాంత్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు.. అతడి అంత్యక్రియలు చేయడానికి మృతదేహం ముక్కలు ఏరుకోవాల్సి వచ్చింది'' అని గట్టిగా అరుస్తూ ఒక హెచ్చరికను రికార్డు చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను ఖలిస్తాన్ ఉగ్రవాదులు కారుబాంబుతో చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే చంపేస్తామంటూ కెప్టెన్ అమరీందర్నూ హెచ్చరిస్తున్నారు. అయితే, వాటిని తాను ఏమాత్రం పట్టించుకునేది లేదని కెప్టెన్ అంటున్నారు. వాళ్లు కెనడాలో తలలు పగిలేలా అరుచుకున్నా తాను మాత్రం కొంచెం కూడా పట్టించుకోనని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం, పంజాబ్ కూడా సుస్థిరంగా, బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని, రాష్ట్రం సుస్థిరంగా ఉంటే తాను అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టగలనని అన్నారు. కెనడాలో ఉంటున్న కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కేవలం పంజాబ్ ముఖ్యమంత్రినే కాక.. మాజీ డీజీపీ కేపీఎస్ గిల్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేశారంటూ గిల్‌కు అప్పట్లో చాలా మంచిపేరు వచ్చింది. కెనడాలో ఏదో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ.. ఆ సందర్భంగానే ఈ ఆడియో మెసేజ్‌లు రికార్డు చేసినట్లుగా వెనకాల శబ్దాలను బట్టి తెలుస్తోంది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ పేరు కూడా ఆ ఆడియో సందేశాల్లో వినిపించింది. ఆయన ఖలిస్తానీ ఉద్యమానికి సానుభూతిపరుడన్న ఉద్దేశంతో సజ్జన్‌ను కలిసేందుకు అమరీందర్ నిరాకరించారు. అయితే.. ఆయనకు తగిన భద్రత మాత్రం కల్పించారు. ''నువ్వు మా రక్షణ మంత్రిని ఉగ్రవాది అన్నావు. నువ్వు సిక్కులను అవమానించావు. ఈ గడ్డ మీద నుంచి నిన్ను చాలెంజ్ చేస్తున్నాం. నీకు ఏ రేంజిలో స్వాగతం పలుకుతామంటే.. ఎప్పుడూ ఇక సిక్కులతో పెట్టుకోవు. నువ్వు సిక్కులందరినీ రెచ్చగొట్టావు. దమ్ముంటే కెనడా రమ్మని సవాలు చేస్తున్నాం'' అని మరో ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు.