America: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు | ​Hindu Temple In Us Defaced With Pro Khalistani Slogans | Sakshi
Sakshi News home page

గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు

Dec 23 2023 9:25 AM | Updated on Dec 23 2023 9:58 AM

​Hindu Temple In Us Defaced With Pro Khalistani Slogans - Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలోని స్వామినారాయణ్‌ గుడి గోడలపై విద్వేష రాతలు వెలిశాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మద్దతు నినాదాలతో గుడి గోడలను నింపేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ పట్టణంలో ఉన్న ఈ స్వామినారాయణ్‌ మందిర్‌ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది.

‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్‌ సింగ్‌ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది హేట్‌ క్రైమ్‌ కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ట్వీట్‌లో కోరింది.

హిందై అమెరికన్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తిపై నెవార్క్‌ పోలీసులు సానుకూలంగా స్పందించారు. గుడి గోడలపై విద్వేష పూరిత రాతలు రాసిన ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికా, కెనడాలో ఇలాంటి  విద్వేష నేరాలు తరచూ రికార్డవుతున్నాయి. జీ 20 సదస్సు సమయంలో  ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లపైనా ఖలిస్తానీ అనుకూల రాతలు వెలిశాయి. 

ఇదీచదవండి..హిట్లర్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement