breaking news
Goldy Brar
-
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్‌కు చెందిన యువ పాప్‌సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్‌కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్‌పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్‌తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌లు బిష్ణోయ్‌కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్‌కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్‌బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్‌బిహా గ్యాంగ్‌కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్‌గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్‌కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్‌లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్‌బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్‌ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్‌షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్‌ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్‌లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్‌లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్‌ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
ఉగ్రవాది గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
వాషింగ్టన్: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని చెప్పారు. ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు!
భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హత్యపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతను బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని హోల్ట్‌అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారు.కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్ కాదని లెఫ్టినెంట్ విలియం జే డూలే అని పోలీసులు వెల్లడించారు. మీరు మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్మెంట్కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్ అని తెలిపారు.కాగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్ పేరు తెరపైకొచ్చింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా హత్య కేసుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్‌కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.