హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్‌లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు.


