సీఎం రేవంత్‌ ఇంటికి మంత్రి కొండా సురేఖ | Minister Konda Surekha Meets Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ ఇంటికి మంత్రి కొండా సురేఖ

Aug 28 2026 10:35 AM | Updated on Aug 28 2026 11:10 AM

Minister Konda Surekha Meets Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్‌ గ్యాప్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది.

కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్‌ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement