సిద్దిపేటలో లేడీ కిల్లర్‌ | Mother and son arrested for serial murders and robbery in Siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో లేడీ కిల్లర్‌

Aug 17 2026 4:09 AM | Updated on Aug 17 2026 4:09 AM

Mother and son arrested for serial murders and robbery in Siddipet

ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడిస్తున్నసీపీ రష్మీ పెరుమాళ్‌

మైనర్‌ కుమారుడితో కలిసి ఘాతుకాలు

కిరాణ దుకాణానికి వచ్చే ఒంటరి మహిళలే టార్గెట్‌ 

ఇప్పటి వరకు ఇద్దరి దారుణ హత్య.. మరో నలుగురి హత్యకు ప్లాన్‌ 

కేసు వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: డబ్బు, బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి సీపీ రష్మీ పెరుమాళ్‌ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు భూంపల్లిలోని డబుల్‌ బెడ్రూం కాలనీలో నివాసముండే అతికం విజయ (45)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణ దుకాణం, టీస్టాల్‌ నిర్వహిస్తున్నారు. 

రజిత భర్త అనారోగ్యంతో బెడ్‌పై ఉంటున్నాడు. రజిత తన మైనర్‌ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గర్లో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణ షాప్‌నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్‌ఎల్‌ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్‌ పోసి కాల్చేశారు. 

ఈ ఏడాది మే 28న వీరి ఇంటి దగ్గర్లో నివాసముండే కుంట రేఖ కూడా కిరాణ షాపునకు రాగా ఆమెను కూడా హత్య చేసి, అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాలి్చవేశారు. 2025 జూన్‌లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్‌ చేస్తుండగా ఆమెపై దాడి చేసి 5 తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశారు. మరో నలుగురు మహిళలను కూడా హత్య చేసి, వారి నుంచి బంగారం చోరీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టు పోలీసుల విచారణలో చెప్పింది. 

అయితే అనారోగ్యంతో మంచంపై ఉన్న భర్తను కూడా హత్య చేయాలని నిందితురాలు ప్రణాళిక రచించిందని, ఇందుకు ఇన్సూరెన్స్‌ చేయించాలని ప్లాన్‌ చేసిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని ఆమె నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు.  

హత్యల కోసం కుమారుడికి జిమ్‌ ఏర్పాటు..
మహిళలను హత్య చేయడానికి కుమారుడిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. దుకాణంలోనే జిమ్‌ను ఏర్పాటు చేయించి కొడుకుతో వ్యాయామం చేయించేది. దుకాణంలో పలు రకాల వ్యాయామ పరికరాలను పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement