breaking news
lady killed
-
సిద్దిపేటలో లేడీ కిల్లర్
సిద్దిపేటకమాన్: డబ్బు, బంగారం కోసం వరుస హత్యలకు పాల్పడుతున్న లేడీ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి సీపీ రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన ఈ నెల 8న పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు భూంపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే అతికం విజయ (45)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, ఆమె కుమారుడిని నిందితులుగా గుర్తించారు. వీరు స్థానికంగా కిరాణ దుకాణం, టీస్టాల్ నిర్వహిస్తున్నారు. రజిత భర్త అనారోగ్యంతో బెడ్‌పై ఉంటున్నాడు. రజిత తన మైనర్ కుమారుడితో కలిసి ఒంటరి మహిళలను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి, వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వీరి ఇంటికి దగ్గర్లో ఒంటరిగా ఉంటున్న అతికం విజయ ఈ నెల 8న కిరాణ షాప్‌నకు రాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం లోపలికి పిలిచి ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని ఎక్స్ఎల్ వాహనంపై రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఏడాది మే 28న వీరి ఇంటి దగ్గర్లో నివాసముండే కుంట రేఖ కూడా కిరాణ షాపునకు రాగా ఆమెను కూడా హత్య చేసి, అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో కాలి్చవేశారు. 2025 జూన్‌లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి చేసి 5 తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశారు. మరో నలుగురు మహిళలను కూడా హత్య చేసి, వారి నుంచి బంగారం చోరీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టు పోలీసుల విచారణలో చెప్పింది. అయితే అనారోగ్యంతో మంచంపై ఉన్న భర్తను కూడా హత్య చేయాలని నిందితురాలు ప్రణాళిక రచించిందని, ఇందుకు ఇన్సూరెన్స్ చేయించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని ఆమె నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు వాహనం, రెండు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. హత్యల కోసం కుమారుడికి జిమ్ ఏర్పాటు..మహిళలను హత్య చేయడానికి కుమారుడిని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. దుకాణంలోనే జిమ్‌ను ఏర్పాటు చేయించి కొడుకుతో వ్యాయామం చేయించేది. దుకాణంలో పలు రకాల వ్యాయామ పరికరాలను పోలీసులు గుర్తించారు. -
అక్కను చంపేసి.. పోలీసులకు ఫోన్!
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 30 ఏళ్ల మహిళను ఆమె సొంత తమ్ముడే కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ఆ తర్వాత పోలీసులకు స్వయంగా తానే ఫోన్ చేసి, అక్కను చంపేసినట్లు చెప్పాడు. 30 ఏళ్ల వయసున్న జ్యోతి అనే మహిళను ఆమె తమ్ముడు మొహిందర్ (27) పొడిచి చంపేశాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతంలో జరిగింది. ఆర్కె పురం సెక్టార్ 3లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం ఏమీ లేని మొహిందర్.. తానే స్వయంగా ఫోన్ చేసి నేరం గురించి చెప్పాడన్నారు. అతడి ఒంటి మీద కడా కొన్ని కత్తి గాట్లు ఉండటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్కాతమ్ముళ్ల మధ్య ఆస్తి వివాదం వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.


